10
October, 2026

A News 365Times Venture

10
Saturday
October, 2026

A News 365Times Venture

SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..

Date:

SIR: ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై దేశవ్యాప్తంగా రాజకీయ వివాదం కొనసాగుతున్న వేళ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన 20 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటర్ల నమోదుకు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించింది. జాబితాలో పేర్లు లేకుండా పోయిన అర్హులైన ఓటర్లను తిరిగి చేర్చేందుకు ఈ చర్యలు చేపట్టింది. ఎస్ఐఆర్ పూర్తయిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫారం-6తో పాటు ఎస్ఐఆర్ సమయంలో తీసుకువచ్చిన అదనపు డిక్లరేషన్ సమర్పించాల్సిన అవసరం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ జరుగుతున్న సమయంలోనే ఇది వర్తిస్తుందని చెప్పింది.

ఎస్ఐఆర్ పూర్తయిన ప్రాంతాల్లో అర్హులైన ఓటర్లు సాధారణ ఫారం-6 ద్వారా ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవచ్చని ఈసీ పేర్కొంది. SIR లేని సమయంలో ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎలెక్టర్స్ రూల్స్, 1960’ ప్రకారం నిర్దేశించిన సాధారణ ఫారమ్‌లే వర్తిస్తాయని కమిషన్ స్పష్టం చేసింది. ఎస్ఐఆర్ సమయంలో జాబితాలో పేర్లు లేకుండా పోయిన అర్హులైన ఓటర్లను గుర్తించి చేర్చేందుకు రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులు (CEO), జిల్లా ఎన్నికల అధికారులు (DEO), ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులు (ERO) చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఈ ప్రత్యేక కార్యక్రమం నిరంతర అప్‌డేషన్ ప్రక్రియ ద్వారా నిర్వహించబడుతోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"அன்புமணி வஞ்சகத்தோடு நடுநிலைமை வகித்தது அதிமுக-விற்குப் பெரிய இழப்பு" – டாக்டர் கிருஷ்ணசாமி

"இடைத்தேர்தலில் தவெக சாதித்துவிடவும் இல்லை, திமுக, அதிமுக சாய்ந்து போய்விடவும் இல்லை"...

AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల అంశంపై రేపు (అక్టోబర్...

தாராபுரம்: ''நம்பிக்கைத் துரோகம், உள்ளடி வேலை'' – அதிமுக மூன்றாவது இடம் பிடித்த பின்னணி என்ன?

தாராபுரம், மதுராந்தகம் ஆகிய இரண்டு தொகுதிகளிலும் மூன்றாவது இடத்துக்கு வந்து அதிர்ச்சி...