7
October, 2026

A News 365Times Venture

7
Wednesday
October, 2026

A News 365Times Venture

Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..

Date:

తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు డిస్కంలు షాకిచ్చాయి. రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలైన ఎస్పీడీసీఎల్ (TGSPDCL), ఎన్పీడీసీఎల్ (TGNPDCL) పరిధిలో ట్రూ-అప్ ఛార్జీల వసూళ్లకు తెలంగాణ విద్యుత్ నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ) అధికారికంగా అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి విద్యుత్ కొనుగోలు వ్యయం, ఆదాయ వ్యత్యాసాల కారణంగా ఏర్పడిన ట్రూ-అప్ భారాన్ని వినియోగదారులపై మోపేందుకు రంగం సిద్ధమైంది.

ఈ నిర్ణయం ప్రకారం రాబోయే నవంబర్ నెల నుంచి వినియోగదారుల బిల్లులలో ట్రూ-అప్ ఛార్జీలు ప్రత్యక్షం కానున్నాయి. విద్యుత్ సంస్థలు నవంబర్ నెల నుంచి ఒక్కో యూనిట్‌పై 30 పైసల చొప్పున, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున ఈ ఛార్జీలను వసూలు చేయనున్నాయి. అయితే.. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ విధానాన్ని కొనసాగిస్తూ… వ్యవసాయ కనెక్షన్లకు ఈ ట్రూ-అప్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు.

మొత్తం రూ. 7,635.22 కోట్ల ట్రూ-అప్ మొత్తంలో… వ్యవసాయ రంగానికి సంబంధించిన రూ. 2,214.99 కోట్లను ప్రభుత్వమే భరించాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ. 1,442.49 కోట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ. 772.50 కోట్లను ప్రభుత్వ సబ్సిడీ ద్వారా రాబట్టుకోవాలని డిస్కంలను ఆదేశించింది. ఇక మిగిలిన రూ. 5,420.23 కోట్లను (ఎస్పీడీసీఎల్ పరిధిలో రూ. 4,222.93 కోట్లు, ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ. 1,197.30 కోట్లు) మాత్రం గృహ, వాణిజ్య తదితర ఇతర అర్హత కలిగిన విద్యుత్ వినియోగదారుల నుంచి వసూలు చేయనున్నారు.

ఈ వసూళ్ల ప్రక్రియను క్రమపద్ధతిలో అమలు చేయాలని ఈఆర్సీ స్పష్టం చేసింది. ఎస్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు 29 నెలల పాటు, ఎన్పీడీసీఎల్ పరిధిలోని వినియోగదారులు 26 నెలల పాటు ఈ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. వినియోగదారుల బిల్లుల్లో ఈ ట్రూ-అప్ మొత్తాన్ని ప్రత్యేకంగా స్పష్టంగా ముద్రించాలని, ఇతర ఛార్జీలతో కలపకుండా ఏ ఆర్థిక సంవత్సరానికి ఆ సంవత్సరం వివరాలను విడిగా చూపాలని డిస్కంలను ఆదేశించారు. ఈ భారంపై వినియోగదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹൂത്തി ആക്രമണം: സൗദിയില്‍ സൈനിക വിന്യാസത്തിന് തുര്‍ക്കി; വ്യോമപ്രതിരോധ സംവിധാനങ്ങളടക്കം എത്തിക്കും

റിയാദ്: ഹൂത്തി ആക്രമണം വര്‍ധിച്ച സാഹചര്യത്തില്‍ സൗദി അറേബ്യയുടെ പ്രതിരോധം ശക്തിപ്പെടുത്തുന്നതിന്റെ...

நிறைவடைந்த மதுராந்தகம், தாராபுரம் இடைத்தேர்தல்; பதிவான வாக்குகள் எவ்வளவு?

கடந்த சட்டமன்றப் பொதுத் தேர்தலில் அதிமுக சார்பில் போட்டியிட்டு வெற்றி பெற்ற...

ರಾಜ್ಯದ ಮಠಗಳು, ಸ್ವಾಮೀಜಿಗಳ ಬಗ್ಗೆ ನನಗೆ ಅಪಾರವಾದ ಗೌರವವಿದೆ: ಸಿಎಂ ಡಿ.ಕೆ ಶಿವಕುಮಾರ್

ಬೆಂಗಳೂರು, ಅಕ್ಟೋಬರ್,6,2026 (www.justkannada.in): “ರಾಜ್ಯದ ಮಠಗಳು, ಸ್ವಾಮೀಜಿಗಳ ಬಗ್ಗೆ ನನಗೆ...

വോട്ടര്‍പട്ടികയില്‍ നിന്ന് പേരുകള്‍ നീക്കാന്‍ വ്യാജമായി ഫോം-7 സമര്‍പ്പിച്ചു; തെലങ്കാനയില്‍ ബി.ജെ.പി ഏജന്റിനെതിരെ എഫ്.ഐ.ആര്‍

ഹൈദരാബാദ്: വോട്ടര്‍പട്ടികയില്‍ നിന്ന് പേരുകള്‍ നീക്കം ചെയ്യുന്നതിനായി വ്യാജമായി ഫോം ഏഴ്...