6
October, 2026

A News 365Times Venture

6
Tuesday
October, 2026

A News 365Times Venture

IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

Date:

IAF:  ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో ఫైటర్ జెట్ స్వ్కాడ్రన్ల సంఖ్య మరింత తగ్గకుడా ఉండాలంటే ప్రతీ ఏడాది భారత్‌కు 36 నుంచి 40 కొత్త యుద్ధ విమానాలు అవసమరని ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ అన్నారు. ఇది సుమారు రెండు ఫైటర్ స్వ్కాడ్రన్లకు సమానమని చెప్పారు. ప్రస్తుతం ఈ లోటును పూడ్చుకుంటూనే కొత్తగా మరిన్ని యుద్ధవిమానాలను చేర్చాల్సి ఉంటుందని చెప్పారు.

ఎయిర్‌ఫోర్స్ డేకు ముందు నిర్వహించిన వార్షిక మీడియా సమావేశంలో ఏపీ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రక్షణ రంగంలోని ప్రాజెక్టుల్లో జాప్యం వైమానికదళ కార్యాచరణ సామర్థ్యంపై పడుతోందని ఆయన అన్నారు. టెక్నికల్ డిలే అంటే టెక్నాలజీని తిరస్కరించడమే అని అన్నారు. అభివృద్ధి, ఉత్పత్తి ప్రక్రియలు ఎక్కువ కాలం కొనసాగితే, అప్పటికే ప్రత్యర్థులు ఆ టెక్నాలజీని అధిగమించే అవకాశం ఉందని అన్నారు.

ఫైటర్ జెట్ స్వ్కా్డ్రన్ల కొరతను అధిగమించేందుకు తేజస్ Mk-1A, తేజస్ Mk-2, 114 విమానాల MRFA ప్రాజెక్ట్, AMCA వంటి కార్యక్రమాలు అవసరమని అన్నారు. AMCA లేదా ఇతర ప్రాజెక్టుల్లో జాప్యం ఏర్పడితే ప్రత్యామ్నాయ యుద్ధ విమానాల వైపు చూడాల్సి వస్తోందని ఆయన అన్నారు. రష్యా తయారీ 5వ జనరేషన్ Su-57పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. 114 రాఫెల్ జెట్ల కొనుగోలు ఒప్పందం ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఖరారయ్యే అవకాశం ఉదని అన్నారు. ధర, ఇతర కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నట్లు చెప్పారు.

పాకిస్తాన్-చైనా 5వ తరం యుద్ధ విమానాల విషయంలో సహకారం భారత్‌కు ఆందోళన కలిగించే అంశమని అన్నారు. ఇదే సమయంలో ఆయా విమానాలను పాకిస్తాన్ తన యుద్ధవ్యవస్థలతో పూర్తిస్థాయిలో అనుసంధానం చేసుకోకపోతే లాభం ఉండదని చెప్పారు. థియేటర్ కమాండ్‌ల ఏర్పాటుపై ఎయిర్‌ఫోర్స్ వ్యతిరేకంగా లేదని, అయితే దాన్ని ఎలా, ఏ క్రమంలో అమలు చేయాలన్న దానిపై జాగ్రత్తగా పరిశీలించాల్సి ఉందని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎదురైన అనుభవాల తర్వాత ఈ అంశంపై చర్చల్లో మార్పు వచ్చిందని తెలిపారు.

ఎయిర్‌ఫోర్స్ ఆధునీకీకరణలో ఏఐ, డ్రోన్లు, లాయిటరింగ్ మ్యూనిషన్స్, అంతరిక్ష సామర్థ్యాలు కీలకంగా మారుతున్నాయని, ప్రత్యేక డ్రోన్ ఫోర్స్ ఏర్పాటు చేయడం కన్నా డ్రోన్లను ప్రస్తుత యుద్ధ వ్యవస్థతో సమన్వయం చేయడం అవసరమని ఐఏఎఫ్ భావిస్తోంది. ప్రస్తుతం భారత వైమానిక దళం ఫైటర్ స్క్వాడ్రన్ల కొరత ఏదుర్కొంటోంది. భారత్‌కు మొత్తం 42 స్వ్కాడ్రన్ల యుద్ధ విమానాలు అవసరం. ప్రస్తుతం భారత్ వద్ద 29 ఉన్నాయి. సాధారణంగా ఒక్క స్వ్కాడ్రన్‌లో 18 యుద్ధ విమానాలు ఉంటాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

MYSORE PALACE: ನಟಿ ಕಾಜಲ್ ಅಗರ್ವಾಲ್ ಭೇಟಿ; ಅರಮನೆ ವೈಭವಕ್ಕೆ ಮನಸೋತ ನಟಿ

  ಮೈಸೂರು, ಅ.5: ದಕ್ಷಿಣ ಭಾರತದ ಖ್ಯಾತ ಚಿತ್ರನಟಿ ಕಾಜಲ್ ಅಗರ್ವಾಲ್...

‘വോട്ട് ബച്ചാവോ ദേശ് ബച്ചാവോ’; ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ കോണ്‍ഗ്രസിന്റെ രാജ്യവ്യാപക പ്രക്ഷോഭം ഒക്ടോബര്‍ 10 മുതല്‍

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ പ്രതിഷേധം ശക്തമാക്കി കോണ്‍ഗ്രസ്....

“முதல்வர் விஜய் சென்ற மாட்டுவண்டியை ஓட்டிச் சென்றவர் யார்?" – ஆர்.எஸ்.பாரதி கேள்வி

திமுக தலைவர் மு.க.ஸ்டாலின், எதிர்க்கட்சித் தலைவர் உதயநிதி ஸ்டாலின் ஆகியோர் மீது...

Special Train: శ్రీశైలం, తిరుమల భక్తులతో సోమనాథ్‌కు ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే

ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నుంచి గుజరాత్‌లోని సోమనాథ్ క్షేత్రానికి ‘సోమనాథ్ స్వాభిమాన్...