1
October, 2026

A News 365Times Venture

1
Thursday
October, 2026

A News 365Times Venture

AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..

Date:

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యులకు ఊరట కల్గిస్తూ ఉల్లిపాయల ధరల నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి ధరలు కిలో రూ.60 నుంచి రూ.70 వరకు పెరిగిపోవడంతో ప్రజలు పడుతున్న ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని రైతు బజార్ల ద్వారా సబ్సిడీపై కేజీ ఉల్లిని రూ.35కే అందించాలని నిర్ణయించారు.

ధరల స్థిరీకరణలో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. తొలి దశలో భాగంగా విజయవాడలోని ఏపీఐఐసీ రైతుబజార్‌లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ రాయితీ ఉల్లి విక్రయ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ రాయితీ ద్వారా ప్రతి కుటుంబానికి ప్రయోజనం చేకూరేలా నిబంధనలు రూపొందించారు. ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డును ప్రాతిపదికగా తీసుకుని ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల చొప్పున సబ్సిడీ ఉల్లిపాయలను అందజేస్తారు. తొలుత ప్రధాన నగరాల్లో ఈ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి, ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌ను బట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాలు, మండల కేంద్రాల్లోని రైతు బజార్లకు ఈ విక్రయాలను విస్తరించనున్నారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన NCCF సహకారంతో ఈ ఉల్లిపాయలను సేకరించి పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉల్లి ధరల భారం నుంచి ప్రజలను రక్షించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే మిగతా నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు కూడా తగిన చర్యలు తీసుకోనున్నట్లు మంత్రులు స్పష్టం చేశారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಬಿಜೆಪಿ ಸರ್ಕಾರಗಳ ಅನಾಹುತಗಳಿಂದಾಗಿಯೇ ಆರ್ಥಿಕ ಇಲಾಖೆ  ನಮಗೆ ಪತ್ರ ಬರೆದಿದ್ದಾರೆ: ಸಿಎಂ ಡಿ. ಕೆ ಶಿವಕುಮಾರ್

ಚಾಮರಾಜನಗರ, ಸೆಪ್ಟಂಬರ್‌,30,2026 (www.justkannada.in) ಯಡಿಯೂರಪ್ಪನವರು ಬಜೆಟ್ ಮೀರಿ ಯೋಜನೆಗಳ ಕಾಮಗಾರಿ...

തിരുവനന്തപുരത്തെ സംഘര്‍ഷം; സംസ്ഥാന വ്യാപക പഠിപ്പ് മുടക്ക് പ്രഖ്യാപിച്ച് എസ്.എഫ്.ഐ

തിരുവനന്തപുരം: തിരുവനന്തപുരത്തുണ്ടായ സംഘര്‍ഷത്തിന്റെ പശ്ചാത്തലത്തില്‍ എസ്.എഫ്.ഐ പഠിപ്പ് മുടക്ക് പ്രഖ്യാപിച്ചു. നാളെ...

INDIA BLOC: “மீண்டும் வாக்குச்சீட்டு தேர்தல் முறையைக் கொண்டுவர வேண்டும்!" – மல்லிகார்ஜுன கார்கே

டெல்லியில் இன்று (30-ம் தேதி) நடைபெற்ற 'இந்தியா கூட்டணி' தலைவர்களின்...

ಮೈಸೂರು ದಸರಾ: ಭದ್ರತೆ ಮತ್ತಷ್ಟು ಬಿಗಿ; 6 ಸಾವಿರಕ್ಕೂ ಅಧಿಕ ಪೊಲೀಸರ ನಿಯೋಜನೆಗೆ ಸಿದ್ಧತೆ

ಮೈಸೂರು,ಸೆಪ್ಟಂಬರ್‌,30,2026 () ವಿಶ್ವವಿಖ್ಯಾತ ಮೈಸೂರು ದಸರಾ ಮಹೋತ್ಸವದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಪೊಲೀಸ್...