24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Mamata Banerjee: బెంగాల్‌లో మళ్లీ ఎన్నికలు, జ్ఞానేశ్ కుమార్‌ అరెస్టు.. మమత సంచలన డిమాండ్..

Date:

Mamata Banerjee: కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR)పై ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక నేపథ్యంలో ప్రతిపక్షాలు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు చేశాడు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి అనుకూలంగా మారిందని ఆరోపించారు. ఎస్ఐఆర్ జరిగిన రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని మమత డిమాండ్ చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ను అరెస్టు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.

‘‘బీజేపీ, జ్ఞానేశ్ కుమార్ కలిసి బెంగాల్ ఎన్నికల్ని దోచుకున్నారు. మీకు నైతిక బలం ఉంటే మా ఎన్నికల్ని తిరిగి ఇవ్వండి’’ అని ఆమె అన్నారు. ఎన్నికల ప్రక్రియలో ఎస్ఐఆర్ కీలక పాత్ర పోషించిందని, ఈ ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా పనిచేసిందని ఆమె ఆరోపించారు. ఎన్నికల సంఘం బీజేపీకి రక్షణ కల్పించిందని, సీఈసీని అరెస్ట్ చేయాలని, ఆయనకు పదవిలో కొనసాగేందుకు నైతిక అధికారం లేదని మమత అన్నారు.

జ్ఞానేశ్ కుమార్ పర్యవేక్షణలో ఎన్నికలు జరిగిన అన్ని ప్రాంతాల్లో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని మమత డిమాండ్ చేశారు. ఇది బెంగాల్‌కే పరిమితమైన డిమాండ్ కాదని, ఎస్ఐఆర్ నిర్వహించిన అన్ని రాష్ట్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని అన్నారు. తమ ఫిర్యాదులపై ప్రధాన న్యాయమూర్తిని ఆశ్రయించామని, సామాన్య ప్రజల గొంతును న్యాయవ్యవస్థ వినాలని ఆమె అన్నారు.

దీనికి ముందు, ఎస్ఐఆర్ ప్రక్రియపై ఈసీలో అంతర్గత విభేదాలు ఉన్నట్లు ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. అయితే, ఈ ఆరోపణల్ని ఎన్నికల సంఘం తప్పుపట్టింది. ఎస్ఐఆర్ సహా తుది నిర్ణయాలన్నీ ముగ్గురు కమిషనర్ల ఏకగ్రీవ ఆమోదంతో తీసుకున్నామని తెలిపింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ട്രംപ്-ഷി ധാരണയ്ക്ക് പിന്നാലെ ഏഷ്യയില്‍ സ്വാധീനം ശക്തമാക്കാന്‍ ചൈന

ബീജിങ്: അമേരിക്കന്‍ പ്രസിഡന്റ് ഡൊണാള്‍ഡ് ട്രംപും ചൈനീസ് പ്രസിഡന്റ് ഷി ജിന്‍പിങ്ങും...

“ஈரானைத் தவிர்க்க ‘IMEC’ பொருளாதாரப் பாதை" – முழு ஆதரவு தெரிவித்த ட்ரம்ப்

மத்திய கிழக்கு நாடுகளின் மீது ஈரான் நடத்தி வரும் கடல்வழித் தாக்குதல்களை...

കേരളത്തില്‍ സി.ജെ.പിയുടെ ഫ്യൂച്ചര്‍ പ്ലാന്‍: ഏതെല്ലാം വിഷയം ഏറ്റെടുക്കും, സ്‌കൂള്‍ ഠീക് കരോ എവിടെയെല്ലാം

കോക്രോച്ച് ജനതാ പാര്‍ട്ടി (സി.ജെ.പി) രാജ്യത്താകെ അവരുടെ പ്രവര്‍ത്തനം വ്യാപിപ്പിക്കാനൊരുങ്ങുകയാണ്. ഇതിന്റെ...

`நான் இருக்கேன்' கையில் முத்தமிட்டு ஆறுதல் சொன்ன விஜய்; உருகிய வி.எஸ்.பாபு… 10 நிமிட சந்திப்பு!

75 வயதாகும் வி.எஸ்.பாபுவுக்கு சமீபத்தில் மூச்சுத்திணறல் ஏற்பட்டு, சென்னை நெல்சன் மாணிக்கம்...