10
September, 2026

A News 365Times Venture

10
Thursday
September, 2026

A News 365Times Venture

Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..

Date:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా ఒక ద్రోణి కొనసాగుతుండటంతో పాటు, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న కోస్తాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. ఈ వాతావరణ పరిణామాల ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే వాతావరణం నెలకొంది.

ముఖ్యంగా రేపు శ్రీకాకుళం, విజయనగరం , పార్వతీపురం మన్యం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, నెల్లూరు, చిత్తూరు , తిరుపతి జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆకస్మికంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, అలాగే పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

ఇప్పటికే మంగళవారం రోజున రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 52.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, ఏలూరు జిల్లా పెరికగూడెంలో 31.3 మిల్లీమీటర్లు, పెంటపాడులో 27.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు, గుంటూరు జిల్లా పండ్రపాడు ప్రాంతాల్లో 24 మిల్లీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. వర్ష సూచన ఉన్న నేపథ్యంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, వాహనదారులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని హెచ్చరించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സ്ലൊവേനിയയില്‍ ആദ്യമായി ഇസ്രഈല്‍ എംബസി തുറന്നു; തലസ്ഥാനത്ത്‌ വന്‍ പ്രതിഷേധം

ലുബ്ലിയാന: സ്ലൊവേനിയന്‍ തലസ്ഥാനമായ ലുബ്ലിയാനയില്‍ ഇസ്രഈലിന്റെ എംബസി തുറക്കുന്നതില്‍ വന്‍ പ്രതിഷേധം....

'புதின் முயற்சி, தென்னாப்பிரிக்கா என்ட்ரி, மன்மோகன் சிங் யோசனை' – 'BRICS' கதையைப் பகிர்ந்த காங்கிரஸ்

வருகிற செப்டம்பர் 12, 13 தேதிகளில், BRICS மாநாடு புதுடெல்லியில் நடக்கவிருக்கிறது....

Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..

Sweet Atukulu Recipe: పండుగలు, విశేష పూజా దినాల్లో దేవుడికి నైవేద్యం...

ಸಚಿವ ಸತೀಶ್ ಜಾರಕಿಹೊಳಿಗೆ ಇಡಿ ಶಾಕ್: ಮನೆ, ಕಚೇರಿ ಸೇರಿ 18 ಕಡೆಗಳಲ್ಲಿ ದಾಳಿ, ಪರಿಶೀಲನೆ

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್,9,2026 (www.justkannada.in):  ಲೋಕೋಪಯೋಗಿ ಸಚಿವ ಸತೀಶ್​ ಜಾರಕಿಹೊಳಿ ಅವರಿಗೆ ಜಾರಿ...