9
September, 2026

A News 365Times Venture

9
Wednesday
September, 2026

A News 365Times Venture

Saudi Houthi Attack: సౌదీ అరేబియాపై హౌతీల భారీ దాడులు.. పాకిస్తాన్, టర్కీ ఏం చేస్తాయి.?

Date:

Saudi Houthi Attack: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తీవ్రంగా ఉన్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ఓవైపు జరుగుతుంటే, ఇరాన్ ప్రాక్సీ యెమెన్‌లోని హౌతీలు సౌదీ అరేబియాపై విరుచుకుపడుతున్నారు. హౌతీ తిరుగుబాటుదారులు సౌదీ దక్షిణ ప్రాంతాల్లో దాడులు చేశారు. ఖమీస్ ముషైత్, జజాన్, నజ్రాన్ నగరాల్లోని పౌర, ఆర్థిక కేంద్రాలను లక్ష్యంగా చేసుకున్న ఈ దాడుల్లో 73 మంది గాయపడినట్లు సౌదీ తెలిపింది. గాయపడిన వారికలో పిల్లలు, మహిళలు ఉన్నారు. ఇదే కాకుండా సౌదీ చమురు మౌలిక సదుపాయాలపై హౌతీలు భారీ దాడులు చేస్తున్నారు. క్షిపణులు, డ్రోన్లతో దాడులకు పాల్పడుతున్నారు.

అయితే, ఇటీవల సౌదీ అరేబియా, పాకిస్తాన్, టర్కీలు కలిసి ‘‘మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్’’ చేసుకున్నాయి. ఈ ఒప్పందంలో ఏ దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపై దాడిగానే పరిగణిస్తామని చెప్పాయి. కానీ, సౌదీ అరేబియాపై హౌతీలు దాడులు చేస్తున్నప్పటికీ ఈ రెండు దేశాల నుంచి పెద్దగా ప్రతిస్పందన కనిపించడం లేదు. పాకిస్తార్, టర్కీలు సౌదీకి ఎలాంటి భద్రత, సైనిక మద్దతు అందిస్తాయనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

హౌతీలు గత కొన్ని వారాలుగా సౌదీ అరేబియాపై దాడుల్ని తీవ్రం చేశారు. జూలైలో సౌదీ పోర్టులపై నౌకా దిగ్భంధం ప్రకటించిన తర్వాత రెడ్‌ సీలో సౌదీకి చెందిన నౌకల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు. అదే సమయంలో యెమెన్‌లో సౌదీ మద్దతు ఉన్న ప్రభుత్వ దళాలు, హౌతీల మధ్య పోరాటం కూడా ఉధృతమైంది. ఈ దాడులు కేవలం సౌదీ-హౌతీల వరకు మాత్రమే పరిమితమవుతాయా.? లేక మక్కా ఒప్పందంలో భాగంగా టర్కీ, పాకిస్తాన్ రంగంలోకి దిగుతాయా? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

KPSC ಹಗರಣ: ಜ್ಞಾನೇಂದ್ರ ಮತ್ತು ಕನ್ನಾಳೆಗೆ ನ್ಯಾಯಾಂಗ ಬಂಧನ

ಬೆಂಗಳೂರು,ಸೆಪ್ಟಂಬರ್,9,2026 (www.justkannada.in): ಪಶುವೈದ್ಯಾಧಿಕಾರಿಗಳ ನೇಮಕಾತಿಯಲ್ಲಿ ಅಕ್ರಮ ಹಗರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಐಎಎಸ್...

വഖഫ് ബോര്‍ഡ്: ഇടത് സര്‍ക്കാരിന്റെ മൂന്ന് വീഴ്ചകള്‍ പ്രശ്‌നമായി; അവര്‍ തെറ്റിധാരണ പടര്‍ത്തുന്നു: നാസര്‍ ഫൈസി കൂടത്തായി

കോഴിക്കോട്‌: വഖഫ് ബോര്‍ഡ് ഭേദഗതിയെ ചെറുക്കാനുള്ള അവസരങ്ങള്‍ കഴിഞ്ഞ എല്‍.ഡി.എഫ് സര്‍ക്കാര്‍...

‘அதுவே பழகிடும்’ ஹார்முஸ் நீர்ச்சந்தி மூடலைப் பழகிக்கொண்ட உலக நாடுகள்; இப்போது எப்படி சமாளிக்கின்றன?

அமெரிக்காவும், இஸ்ரேலும் நவீன ஆயுதங்கள், தொழில்நுட்பம் மிகுந்த ஏவுகணைகளை வைத்து, ஈரானை...

Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం

ఢిల్లీ జంతర్‌మంతర్‌లో జరిగిన విద్యార్థుల నిరసనలకు సంబంధించి గౌతమ్ బుద్ధ యూనివర్సిటీకి...