6
September, 2026

A News 365Times Venture

6
Sunday
September, 2026

A News 365Times Venture

India Won: పాకిస్థాన్ చిత్తు చిత్తు.. 8.4 ఓవర్లోనే టార్గెట్ ఛేదించిన టీమిండియా..

Date:

మహిళల ఆసియా కప్ 2026 లీగ్ దశలో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ జట్టును భారత బౌలర్లు తమ స్పిన్ జాలంతో తిరుగులేని దెబ్బతీశారు. ప్రారంభం నుంచే కచ్చితమైన లైన్ అండ్ లెంగ్త్‌తో విరుచుకుపడటంతో పాక్ బ్యాటర్లు క్రమం తప్పకుండా వికెట్లు సమర్పించుకున్నారు. దాంతో పాకిస్థాన్ జట్టు 18.1 ఓవర్లలో కేవలం 55 పరుగులకే కుప్పకూలి ఆలౌట్ అయింది.

భారత బౌలర్లలో స్పిన్నర్ శ్రీ చరణి 4 ఓవర్లలో కేవలం 7 పరుగులిచ్చి 3 వికెట్లు తీసి పాక్ టాప్, మిడిల్ ఆర్డర్‌ను దెబ్బతీసింది. మరో బౌలర్ ప్రేమ రావత్ 4 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు సాధించింది. ఆల్‌రౌండర్లు దీప్తి శర్మ 3.1 ఓవర్లలో 5 పరుగులకు 2 వికెట్లు, షఫాలీ వర్మ 3 ఓవర్లలో 10 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టారు. ఫీల్డర్ల అద్భుతమైన ఫీల్డింగ్, క్యాచ్‌లు, రన్ అవుట్ బౌలర్లకు చక్కటి సహకారాన్ని అందించాయి.

అనంతరం 56 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 8.4 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 57 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ షఫాలీ వర్మ (12), స్మృతి మంధాన (9), ప్రతీకా రావల్ (4) త్వరగా నిష్క్రమించినప్పటికీ, కెప్టెన్ హర్మాన్‌ప్రీత్ కౌర్ (18 నాటౌట్), దీప్తి శర్మ (12 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చారు. పాక్ బౌలర్లలో ఫాతిమా సనా 3 వికెట్లు సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం చాటిన భారత జట్టు టోర్నీలో తమ విజయపరంపరను దిగ్విజయంగా కొనసాగించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സ്വതന്ത്ര ഭരദ്വാജിന്റെ അറസ്റ്റിന് പിന്നാലെ ഹിന്ദു ദൈവങ്ങളെ അധിക്ഷേപിച്ചെന്നാരോപിച്ച് നിഷു ആസാദിനും പിതാവിനുമെതിരെ പരാതി

ന്യൂദല്‍ഹി: ഹിന്ദുത്വ ഇന്‍ഫ്‌ലുവന്‍സര്‍ സ്വതന്ത്ര ഭരദ്വാജിന്റെ അറസ്റ്റിന് പിന്നാലെ സോഷ്യല്‍ മീഡിയയിലൂടെ...

"தோல்வியடைந்த ஒரு சமூகம் எப்படியிருக்கும்?" – செக்கோவ்வின் வரிகளை நினைவூட்டிய சிந்தனைச் செல்வன்

2026 சட்டமன்றத் தேர்தலில் திமுக கூட்டணியில் இடம்பெற்ற விசிக, தேர்தலுக்குப்...

Perni Nani: స్పోర్ట్స్ కోటానే కాదు.. వికలాంగులు, ఓసీ, బీసీ కోటాల్లోనూ అక్రమాలు.. డీఎస్సీపై పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు

Perni Nani: డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ...

ಮಾಸಾಶನ ವೃದ್ಧಾಪ್ಯ ವೇತನ ನೀಡುತ್ತಿಲ್ಲ: ಬಡವರಿಂದ ಸರ್ಕಾರ ದೂರ ಸಾಗುತ್ತಿದೆ- ಬಿವೈ ವಿಜಯೇಂದ್ರ

ರಾಯಚೂರು,ಸೆಪ್ಟಂಬರ್,4,2026 (www.justkannada.in):  ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ನೇತೃತ್ವದ ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರ ಬಡವರಿಂದ...