4
September, 2026

A News 365Times Venture

4
Friday
September, 2026

A News 365Times Venture

Konda Surekha: నేనేం తప్పు చేశాను.. కాంగ్రెస్ అధిష్టానంతో యుద్ధానికి సిద్ధమవుతున్న మంత్రి సురేఖ!

Date:

Konda Surekha vs Congress High Command: తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరింత ఆసక్తికరంగా మారింది. తనను మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని మంత్రి సురేఖ స్పష్టం చేశారు. తాను ఏ తప్పు చేయలేదని, రాజీనామా చేసే అవసరం ఏముందని ప్రశ్నించారు. మంత్రి సురేఖ వ్యాఖ్యలు చూస్తే.. కాంగ్రెస్ అధిష్టానంతో ఆమె యుద్ధానికి దిగుతున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై ఢిల్లీలో కాంగ్రెస్‌ అగ్రనేత మల్లికార్జున ఖర్గేతో చర్చించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రస్తుత పరిణామాలపై ఆయనకు లిఖితపూర్వకంగా లేఖ అందజేశానని వెల్లడించారు. తనకు సహకరించాలని ఖర్గేను కోరగా.. సమస్యను పరిశీలిస్తామని ఆయన చెప్పినట్లు సురేఖ పేర్కొన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా లేఖ పంపించినట్లు మంత్రి సురేఖ చెప్పారు.

తనను రాజీనామా చేయాలని హైకమాండ్‌ నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశం రాలేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ‘నేను ఏం తప్పు చేశాను?, ఎందుకు రాజీనామా చేయాలి?’ అంటూ ప్రశ్నించారు. తన కూతురు సుస్మిత చేసిన వ్యాఖ్యలను తన వ్యాఖ్యలుగా పరిగణించడం సరికాదన్నారు. సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలని, వాటికి తనకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. అయితే కూతురు వ్యాఖ్యలను కూడా పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపైనే కాంగ్రెస్‌ హైకమాండ్‌, రాష్ట్ర నాయకత్వం మధ్య చర్చ జరిగినట్లు సమాచారం.

మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన వెంటనే మంత్రి సురేఖ బర్తరఫ్‌కు సంబంధించిన లేఖను లోక్‌భవన్‌కు పంపించే అవకాశం ఉంది. బర్తరఫ్‌ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాలపై కూడా కాంగ్రెస్‌ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాలకు సంబంధించి సీఎం రేవంత్‌, పీసీసీ అధ్యక్షుడు ముఖేష్‌ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ సహా పలువురు సీనియర్‌ నేతల నుంచి అధిష్ఠానం ఇప్పటికే అభిప్రాయాలను సేకరించింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mahesh Kumar Goud: కొండా సురేఖ బర్తరఫ్‌పై తొలిసారి స్పందించిన పీసీసీ చీఫ్‌!

తెలంగాణ కాంగ్రెస్‌లో కొండా సురేఖ ఎపిసోడ్‌పై పీసీసీ చీఫ్‌ మహేష్‌ కుమార్‌...

റെക്കോഡുകൾ ഭേദിച്ച് അതിശക്തമായ എൽ നിനോ വരുന്നു; 2027 വരെ തുടരുമെന്ന് ലോക കാലാവസ്ഥാ സംഘടന

ജനീവ: വരും മാസങ്ങളിൽ എൽ നിനോ അസാധാരണമായ തോതിൽ ശക്തമാകുമെന്നും 2027...

“உக்ரைனுக்கு வழங்கிய ராணுவ உதவிகள் செலவை ஐரோப்பிய நாடுகள் வழங்க வேண்டும்" – அதிபர் ட்ரம்ப்

உக்ரைனுக்கு அமெரிக்கா இதுவரை வழங்கிய ராணுவ உதவிகள் மற்றும் வெடிமருந்துகளுக்கான செலவை...

എം.എല്‍.എയുടെ കത്ത് പ്രകാരം ഉദ്യോഗസ്ഥന് ട്രാന്‍സ്ഫര്‍: ആലപ്പുഴ ഫിഷറീസ് ഉദ്യോഗസ്ഥന്റെ സ്ഥലം മാറ്റം വിവാദത്തില്‍

ആലപ്പുഴ: ആലപ്പുഴ ഫിഷറീസ് ഡെപ്യൂട്ടി ഡയറക്ടര്‍ വി. പ്രശാന്തിന്റെ സ്ഥലം മാറ്റം...