27
August, 2026

A News 365Times Venture

27
Thursday
August, 2026

A News 365Times Venture

Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్‌లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!

Date:

కర్ణాటకలో ఓ న్యాయమూర్తికి షాకింగ్ ఘటన ఎదురైంది. ఆస్పత్రిలోని ఓ గదిలో ప్రియురాలితో అధికారి పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. ఈ పరిణామం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

అక్రమ ఖాతాలకు సంబంధించిన కేసులో లోకాయుక్త పోలీసులు శ్రీరంగపట్నంలోని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ (ADLR)గా పనిచేస్తున్న మహమ్మద్ హుస్సేన్‌ను అరెస్టు చేశారు. అయితే సదరు అధికారిని జైలుకు తరలించాల్సి ఉండగా.. ఆస్పత్రిలో ప్రత్యేక గదిలో ఉంచారు. అయితే మండ్య జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సి. చంద్రశేఖర్ ఆకస్మికంగా ఎంఐఎంఎస్ ఆస్పత్రిని తనిఖీ చేశారు. అయితే ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించిన న్యాయమూర్తికి.. హుస్సేన్‌ ఉన్న గదిని కూడా పరిశీలించారు. అయితే ఆ గదిలో ఓ యువతి కనిపించడం కలకలం రేపింది. ఎందుకు ఇక్కడ ఉన్నావని అడిగితే తాను సదరు అధికారి ప్రియురాలినని చెప్పడంతో అంతా షాక్‌కు గురయ్యారు. దీంతో హుస్సేన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను జడ్జి ప్రశ్నించారు. అయితే ఆస్పత్రిలో చికిత్స పొందాల్సినంత తీవ్రమైన అనారోగ్యం లేదన్న విషయం తర్వాత వెలుగులోకి వచ్చింది.

జైలు నుంచి హుస్సేన్‌ను ఆస్పత్రికి తరలించడానికి గల కారణాలను కూడా న్యాయమూర్తి జైలు అధికారులను ప్రశ్నించారు. జైలు వైద్యుడి సిఫారసు మేరకే హుస్సేన్‌ను ఆస్పత్రిలో చేర్పించినట్లు అధికారులు చెప్పినట్లు సమాచారం. జైలు నుంచి ఆస్పత్రికి హుస్సేన్‌ను తరలించిన విషయం కోర్టుకు తెలియజేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయితే కోర్టుకు సమాచారం ఇవ్వలేదని ఓ జైలు అధికారి అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇకపై ఇలాంటి విషయాలను కోర్టు దృష్టికి తీసుకువస్తామని అధికారి చెప్పినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై న్యాయమూర్తి జైలు అధికారులను మందలించారు. హుస్సేన్ ఆస్పత్రిలో చేరడం, అక్కడ ఉన్న పరిస్థితులపై జైలు అధికారులు, వైద్యాధికారులు పూర్తి వివరాలతో నివేదికలు సమర్పించాలని ఆదేశించారు. ఈ ఘటనపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ರಾಯಚೂರು ಐ.ಐ.ಐ.ಟಿಯಲ್ಲಿ 12 ಕೋಟಿ ರೂ. ವೆಚ್ಚದಲ್ಲಿ AI ಉತ್ಕೃಷ್ಟತಾ ಕೇಂದ್ರ ಸ್ಥಾಪನೆ-ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,26,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಪರಿಪೂರ್ಣ ಕೈಗಾರಿಕಾ ಬೆಳವಣಿಗೆ ಸಾಧಿಸಲು ಸರಕಾರ...

മാഡിസണ്‍ സ്‌ക്വയറില്‍ ആര്‍.എസ്.എസ് വേണ്ട; ന്യൂയോര്‍ക്കിൽ 48 സംഘടനകളുടെ സംയുക്ത യോഗം

ന്യൂയോര്‍ക്ക്: ന്യൂയോര്‍ക്കില്‍ ആര്‍.എസ്.എസ് തലവന്‍ മോഹന്‍ ഭാഗവത് പങ്കെടുക്കുന്ന പരിപാടി നിര്‍ത്തിവയ്ക്കണമെന്ന്...

குப்பை இருக்கும் இடம் தேடி… மதுரையை மாற்ற, களத்தில் இறங்கிய மாநகராட்சி ஆணையர் | Photo Album

மதுரை: விபத்தில் உயிரிழந்த காவலர்; குடும்பத்துக்காக ஒன்றிணைந்து ரூ.22 லட்சம் திரட்டிய...

Nepal Floods: నేపాల్ వరదలపై తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. సీఎం రేవంత్‌ ఆదేశాలతో ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు

Nepal Floods: నేపాల్‌లో వరదలకు సంబంధించిన దృశ్యాలు చూస్తేనే షాక్‌ అయ్యే...