22
August, 2026

A News 365Times Venture

22
Saturday
August, 2026

A News 365Times Venture

TGSRTC Offer: బంపర్ ఆఫర్ ప్రకటించిన తెలంగాణ ఆర్టీసీ.. టికెట్ బుకింగ్స్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటన..

Date:

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రయాణికులకు ఆర్ధిక భారాన్ని తగ్గించడంతో పాటు ముందస్తు రిజర్వేషన్‌ను ప్రోత్సహించేందుకు ఒక ప్రత్యేకమైన ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు తమ రాకపోకల టికెట్లను ఒకేసారి బుక్ చేసుకోవడం ద్వారా తిరుగు ప్రయాణం (రిటర్న్ జర్నీ) టికెట్‌పై 10 శాతం తగ్గింపును పొందవచ్చు. దూరప్రాంతాలకు ప్రయాణించే వారికి, అలాగే వారాంతాల్లో కుటుంబంతో కలిసే వెళ్లేవారికి ఈ ఆఫర్ ఎంతో ప్రయోజనకరంగా మారింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు , ప్రయాణికులను ఆకట్టుకునేందుకు సంస్థ ఈ ప్రత్యేక పథకాన్ని డిజైన్ చేసింది.

ఈ ఆఫర్‌ను పొందడానికి ప్రయాణికులు TGSRTC అధికారిక వెబ్‌సైట్ www.tgsrtcbus.in ద్వారా లేదా మొబైల్ యాప్ ఉపయోగించి ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవలసి ఉంటుంది. వెళ్లేందుకు, తిరిగి రావడానికి ఒకేసారి టికెట్లను రిజర్వ్ చేసినప్పుడు మాత్రమే వర్తించే ఈ ఆఫర్ ద్వారా ప్రయాణికులు తమ ప్రయాణ ఖర్చులపై మంచి ఆదా చేసుకోవచ్చు. ప్రయాణ తేదీలను ముందుగానే ప్లాన్ చేసుకునే వారికి సీట్ల లభ్యత సమస్య లేకుండా, తక్కువ ధరలోనే టికెట్ దొరికే సౌకర్యం కలగడమే కాకుండా గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకునే వీలు కలుగుతుంది.

టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన సందేహాల నివారణకు లేదా సమాచారం కోసం సంస్థ హెల్ప్‌లైన్ నంబర్లు 040-69440000, 040-23450033 లను కూడా అందుబాటులో ఉంచింది. ప్రైవేట్ వాహన ప్రయాణాల కన్నా భద్రత, సౌకర్యం అధికంగా ఉండే ఆర్టీసీ బస్సుల సేవలను వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. రాబోయే పండుగలు, సెలవుల సీజన్‌లో ప్రయాణించే వారు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఈ ముందస్తు బుకింగ్ 10 శాతం డిస్కౌంట్ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడానికి ఆర్టీసీ తీసుకుంటున్న ఈ చర్యకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಅರ್ಜುನ ಅವಧೂತಗೆ ನೀಡಿದ್ದ ಗನ್‌ಮ್ಯಾನ್ ಭದ್ರತೆ ವಾಪಸ್

ಮೈಸೂರು,ಆಗಸ್ಟ್,21,2026 (www.justkannada.in):  ಅರ್ಜುನ ಅವಧೂತಗೆ ಭದ್ರತೆ ಮತ್ತು ಆತ್ಮರಕ್ಷಣೆ ದೃಷ್ಟಿಯಿಂದ...

ആരാണ് പഞ്ചസാര ഉപയോഗിക്കുന്നത്; എല്ലാവര്‍ക്കും ശുഖറല്ലേ:പഞ്ചസാര വിലകറ്റത്തില്‍ വിവാദ മറുപടിയുമായി ബിഹാര്‍ മന്ത്രി

പട്‌ന: പഞ്ചസാര വിലകയറ്റത്തെക്കുറിച്ചുള്ള ബിഹാര്‍ മന്ത്രിയുടെ മറുപടി വിവാദത്തില്‍. പഞ്ചസാരയുടെ വില...

FIR பதிவு செய்ய 8 மணி நேர போராட்டம்: ‘நீதிக்கான பிரேக்’ எங்கிருந்து போடப்பட்டது? – ராகுல் காந்தி

நீட் வினாத்தாள் கசிவை எதிர்த்து டெல்லி ஜந்தர் மந்தரில் மாணவர்கள் கிட்டத்தட்ட...

500 KPS ಶಾಲೆಗಳ ಅಭಿವೃದ್ಧಿಗೆ 1,750 ಕೋಟಿ ರೂ. ಎಡಿಬಿ ನೆರವು; ಮಹತ್ವದ ಒಪ್ಪಂದಕ್ಕೆ ಸಹಿ

ಬೆಂಗಳೂರು, ಆಕ್ಟೋಬರ್,21,2026 (www.justkannada.in): ರಾಜ್ಯದ ಶಿಕ್ಷಣ ಕ್ಷೇತ್ರದಲ್ಲಿ ಇಂದು ಮಹತ್ವದ...