22
August, 2026

A News 365Times Venture

22
Saturday
August, 2026

A News 365Times Venture

Arjun Reedy Ice Scene: ‘ఐస్ వేసుకునే సీన్’ రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!

Date:

Arjun Reedy Scene: టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అయితే, ఈ సినిమా విడుదల కావడానికి ముందు కథా చర్చల సమయంలో ఎదురైన విచిత్రమైన అనుభవాలను సందీప్ సోదరుడు, నిర్మాత ప్రణయ్ రెడ్డి వంగా (Pranay Reddy Vanga) తాజాగా NTV పాడ్‌కాస్ట్‌లో గుర్తుచేసుకున్నారు.

ఈ పాడ్‌కాస్ట్‌లో ఆయన మాట్లాడుతూ.. సందీప్ రెడ్డి వంగా ‘అర్జున్ రెడ్డి’ కథను సిద్ధం చేసుకుని సినిమా తీయడానికి దాదాపు 6 నుండి 7 ఏళ్ల పాటు తీవ్రంగా ప్రయత్నించారు. ఆ సమయంలో చాలామంది నిర్మాతలు, నటీనటులకు కథను వినిపించారు. సినిమా ప్రారంభంలో తీవ్రమైన నిరాశ, విరహంలో ఉన్న హీరో (అర్జున్ రెడ్డి) తన కోరికను చల్లార్చుకోలేక ప్యాంటులో ఐస్ ముక్కలు (Ice cubes) వేసుకునే ఒక బోల్డ్ సీన్ ఉంటుంది. సినిమా కథ నెరేషన్ ఇచ్చేటప్పుడు ఈ సీన్ (ఐస్ వేసుకునే సీన్) రాగానే చాలామంది నిర్మాతలు తట్టుకోలేక “ఇక కథ ఆపేయండి.. మనం మాట్లాడాల్సింది ఏమీ లేదు” అని నెరేషన్ మధ్యలోనే ఆపేయమనేవారని తెలిపారు.

అప్పటివరకు తెలుగు తెరపై ఇలాంటి రా & బోల్డ్ క్యారెక్టరైజేషన్‌ను ఎవరూ చూడలేదు. దీంతో చాలామంది ఈ సీన్స్ చూసి రిస్క్ చేయడానికి భయపడి వెనకడుగు వేశారు. కానీ సందీప్ రెడ్డి తన కథ, పాత్రల తీరుపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. బయట నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడంతో, చివరకు వారి కుటుంబానికి చెందిన మామిడి తోటను అమ్మి, భద్రాకాళి పిక్చర్స్ బ్యానర్‌పై ప్రణయ్ రెడ్డి వంగా స్వయంగా నిర్మించారు. ఆ తర్వాత థియేటర్లలో విడుదలైన ‘అర్జున్ రెడ్డి’ ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో, ఇండియన్ సినిమాలో ఎలాంటి ట్రెండ్‌ను సెట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఏ సీన్ చూసి కథనే వినడానికి నిరాకరించారో, అదే నేచురల్ అండ్ బోల్డ్ అప్రోచ్ సందీప్ రెడ్డి వంగాను నేడు దేశంలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా నిలబెట్టిందని ప్రణయ్ రెడ్డి వంగా పేర్కొన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അത് അദ്ദേഹത്തിന്റെ വ്യക്തിഗത വിവരങ്ങള്‍: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണറുടെ യാത്രാവിവരങ്ങള്‍ പുറത്ത് വിടാന്‍ വിസമ്മതിച്ച് തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന്‍

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാര്‍ നടത്തിയ ഔദ്യോഗിക സന്ദര്‍ശനങ്ങളുടെ...

புதுச்சேரி: `இனி ஹெல்மெட் அணிவது கட்டாயம்!' – காவல்துறை தலைமை அதிரடி உத்தரவு

புதுச்சேரியில் கடந்த 15 ஆண்டுகளாக இருசக்கர வாகன விபத்துகளின் எண்ணிக்கை அதிகரித்து...

Spirit: ‘స్పిరిట్’లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?

Spirit: రెబల్ స్టార్ ప్రభాస్, సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా...

ಕೆಪಿಎಸ್ ಸಿ ಅಧ್ಯಕ್ಷರ ಅಮಾನತಿಗೆ ರಾಜ್ಯಪಾಲರಿಗೆ ಶಿಫಾರಸ್ಸು ಮಾಡಲು ಸಂಪುಟ ಸಭೆಯಲ್ಲಿ ತೀರ್ಮಾನ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,21,2026 (www.justkannada.in): ಕೆಪಿಎಸ್ ಸಿ ಅಧ್ಯಕ್ಷ ಶಿವಶಂಕರಪ್ಪ ಸಾಹುಕಾರ್ ಅವರನ್ನ...