21
August, 2026

A News 365Times Venture

21
Friday
August, 2026

A News 365Times Venture

Vizag Job Fraud: విశాఖలో కిలాడీ లేడీ.. నిరుద్యోగులకు కుచ్చుటోపీ!

Date:

యూరప్ దేశాల్లో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి భారీగా వసూలు చేసి.. బోర్డు తిప్పేసిన ఘటన విశాఖలో వెలుగు చూసింది. సౌజన్య అనే కిలాడీ లేడీ ఫ్లయింగ్ బోర్డర్స్ అనే సంస్థ ద్వారా విదేశాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన నిరుద్యోగులకు కుచ్చుటోపి పెట్టింది. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5 లక్షలు రూపాయలు చొప్పున వసూలు చేసి మోసగించింది. నెలలు గడుస్తున్నా ఉద్యోగాల రాకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

ఇప్పటి వరకు 18 మంది బాధితులు సుమారు రూ.65 లక్షలు వరకు మోసపోయినట్లు ద్వారకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సర్చ్ వారంటీతో కృష్ణాజిల్లా పెనమలూరు మండలం తాడిగడప లోని సౌజన్య ఇంటికి విశాఖ పోలీసులు వెళ్లారు. సౌజన్యను అరెస్టు చేసి విశాఖకు తీసుకువచ్చారు. నిందితురాలు సౌజన్యపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ కేసులు ఉన్నట్లు తెలిపారు. వందలాది మందిని మోసం చేసి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు సమాచారం. ఇంకా ఎవరైనా బాధితులు ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు విశాఖ పోలీసులు. కిలాడీ లేడిని కోర్టుకు తరలించారు పోలీసులు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮಂಡ್ಯ ಕೃಷಿ ವಿವಿಯ ಕೃಷಿ ವಿಜ್ಞಾನ ಕೇಂದ್ರದ ಸಹಾಯಕ ಹುದ್ದೆಗೆ ತೃತೀಯ ಲಿಂಗಿ ಆಯ್ಕೆ

ಮಂಡ್ಯ,ಆಗಸ್ಟ್, 21,2026 (www.justkannada.in): ತೃತೀಯ ಲಿಂಗಿ ಮೈನಾ ಹೆಚ್. ಅವರು...

ഓപ്പറേഷന്‍ തൂഫാന്‍: അറസ്റ്റില്‍ എറണാകുളം മുന്നില്‍; കേസുകളില്‍ കോഴിക്കോട് ഒന്നാമത്

  തിരുവനന്തപുരം: സംസ്ഥാനത്ത് ലഹരിക്കെതിരായ ശക്തമായ നടപടികളുമായി മുന്നേറുന്ന ഓപ്പറേഷന്‍ തൂഫാന്റെ...

'227 எம்.எல்.ஏக்கள்; 396 கார்கள்; ரூ.89 கோடி; யாரிடமெல்லாம் கார் இல்லை? – MLA's Cars Detailed Report

சட்டமன்ற உறுப்பினர்கள் அத்தனை பேருக்கும் கார் கொடுக்கப்போவதாக அறிவித்திருக்கிறார் முதல்வர் விஜய்....

ಬಿ.ನಾಗೇಂದ್ರ ರಾಜೀನಾಮೆಗೆ ಆಗ್ರಹ:  ಕಪ್ಪು ಟೀ ಶರ್ಟ್ ಧರಿಸಿ BJP-JDS ಶಾಸಕರ ಪ್ರತಿಭಟನೆ

ಬೆಂಗಳೂರು,ಆಗಸ್ಟ್,21,2026 (www.justkannada.in): ಸಚಿವ ಬಿ.ನಾಗೇಂದ್ರ ರಾಜೀನಾಮೆಗೆ ಆಗ್ರಹಿಸಿ ಬಿಜೆಪಿ-ಜೆಡಿಎಸ್ ಶಾಸಕರು...