29
September, 2026

A News 365Times Venture

29
Tuesday
September, 2026

A News 365Times Venture

Ajinkya Rahane-IND vs SL: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్‌లో అజింక్య రహానే ఎంట్రీ? ఇక్కడే అసలైన ట్విస్ట్

Date:

Ajinkya Rahane-IND vs SL: భారత్, శ్రీలంక జట్ల మధ్య ఆగస్టు 15 (శనివారం) నుంచి రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ సమరానికి తెరలేవనుంది. గాల్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో బరిలోకి దిగుతున్న టీమిండియా, పర్యటనను విజయంతో ఘనంగా ప్రారంభించాలని పట్టుదలతో ఉంది. ఆగస్టు 15 నుంచి 27 వరకు సాగే ఈ సిరీస్ క్రికెట్ ప్రేమికులకు మంచి వినోదాన్ని పంచనుంది. ఈ టెస్ట్ సిరీస్‌లో ఒక ప్రత్యేక ఆకర్షణ అభిమానులను అలరించబోతోంది. ఇన్నాళ్లూ తన అద్భుత బ్యాటింగ్‌తో ప్రత్యర్థులను కంగారు పెట్టిన భారత మాజీ టెస్టు కెప్టెన్ అజింక్య రహానే, ఇప్పుడు పూర్తిగా కొత్త అవతారంలో కనిపించనున్నాడు. దాదాపు 18 ఏళ్ల సుదీర్ఘ ఫస్ట్ క్లాస్ కెరీర్‌కు వీడ్కోలు పలికిన రహానే, ఇప్పుడు మైదానంలో బ్యాట్ పక్కనపెట్టి కామెంట్రీ బాక్స్‌లో మైక్ పట్టేందుకు సిద్ధమయ్యాడు. తన క్రికెట్ ప్రయాణంలో తొలిసారి వ్యాఖ్యాతగా మారి అభిమానులకు తన గళంతో కొత్త అనుభూతిని అందించనున్నాడు. భారత్-శ్రీలంక సిరీస్ ప్రత్యక్ష ప్రసారాన్ని టీవీల్లో సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా సోనీ లివ్ (Sony LIV) యాప్‌లో తిలకించవచ్చు.

టీమిండియా తరఫున క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడల్లా అపద్బాంధవుడిలా ఆదుకుని జట్టును విజయతీరాలకు చేర్చిన ఘనత రహానేది. భారతదేశం తరఫున 85 టెస్టు మ్యాచ్‌లు ఆడిన అతడు 5,077 పరుగులు సాధించాడు. ఇందులో 12 అద్భుతమైన సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు ఉన్నాయి. మైదానంలో కెప్టెన్‌గా, సీనియర్ ప్లేయర్‌గా ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. ఇక, ఈ కొత్త బాధ్యతపై రహానే ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. టెస్టు క్రికెట్ అనేది ఆటలోనే అత్యుత్తమ రూపు అని పేర్కొన్న రహానే, ఇన్నాళ్లూ దేశం కోసం మైదానంలో పోరాడిన తర్వాత, ఇప్పుడు అదే ఆటను ఒక కొత్త కోణం నుంచి చూడటం తనకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాడు. మ్యాచ్‌లో కెప్టెన్లు తీసుకునే వ్యూహాత్మక నిర్ణయాలు, ఆటను మలుపు తిప్పే చిన్న చిన్న క్షణాలు, టెస్ట్ క్రికెట్‌లోని లోతైన విషయాలను వీక్షకులతో పంచుకోవడానికి ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని స్పష్టం చేశాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇത് വോട്ട് ചോരി; ദല്‍ഹി ബെല എസ്‌റ്റേറ്റിലെ 728 വോട്ടര്‍മാരില്‍ 727 പേരെ എസ്.ഐ.ആറില്‍ നീക്കം ചെയ്തതിനെതിരെ രാഹുല്‍

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയിലെ ബെല എസ്റ്റേറ്റിലെ 728 വോട്ടര്‍മാരില്‍ 727 പേരുടെയും പേരുകള്‍...

மீனாட்சி அம்மன் கோவிலில் தரிசனம்; அறங்காவலர் குழு தலைவர் ருக்மணி காலில் விழுந்து வணங்கிய முதல்வர்!

தமிழக முதலமைச்சர் ஜோசப் விஜய் மதுரை அரசு ராஜாஜி மருத்துவமனையில் தாய்மாமன்...

WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..

మహిళా ప్రీమియం లీగ్ 2027 సీజన్‌కు సంబంధించి డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్...

ಕೊಲೆ ಮತ್ತು ಸಂಚು ಪ್ರಕರಣ: ಇಬ್ಬರು ಆರೋಪಿಗಳಿಗೆ ಜೀವಾವಧಿ ಶಿಕ್ಷೆ

  ಬೆಂಗಳೂರು, ಸೆ.28, 2026: ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ನಡೆದ ಸಂಚಲನ ಮೂಡಿಸಿದ್ದ ಕೊಲೆ...