5
October, 2026

A News 365Times Venture

5
Monday
October, 2026

A News 365Times Venture

Vijayawada Durga Temple: దుర్గమ్మ భక్తులకు గుడ్‌న్యూస్.. ఇక ఓటీపీ ఎంటర్ చేస్తే చేతికి దుర్గమ్మ లడ్డూ

Date:

Vijayawada Durga Temple: విజయవాడ ఇంద్రకిలాద్రి శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం ఆలయ అధికారులు ఒక తీపి కబురు అందించారు. దసరా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం దుర్గమ్మ ఆలయంలో సరికొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. భక్తులు లడ్డూ ప్రసాదం కోసం గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ప్రత్యేకంగా లడ్డూ ఏటీఎం మిషన్లను ఏర్పాటు చేయనున్నారు.

ఈ నూతన విధానంలో భక్తులు ముందుగా ఆన్‌లైన్ ద్వారా లడ్డూ ప్రసాదాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బుకింగ్ పూర్తి కాగానే భక్తుడి మొబైల్ ఫోన్‌కు ఒక ఓటీపీ (OTP) వస్తుంది. ఏటీఎం మిషన్ వద్దకు వెళ్లి ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే నేరుగా లడ్డూ ప్రసాదం చేతికి అందుతుంది. ఈ మిషన్ల ద్వారా ఒక వ్యక్తి ఒక్కోసారికి ఒకటి నుంచి ఆరు లడ్డూల వరకు పొందే వెసులుబాటు ఉంటుంది. దసరా సమయానికి ఆలయంలో మొత్తం 6 ఏటీఎం మిషన్లను అందుబాటులోకి తేనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి ఏటా దసరా ఉత్సవాల సమయంలో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తుంటారు. ఈ సమయంలో దాదాపు 30 లక్షల నుండి 35 లక్షలకు పైగా లడ్డూ ప్రసాదం విక్రయాలు జరుగుతాయి. ఈ ఏడాది భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉండటంతో, రద్దీని నియంత్రించి ప్రసాద విక్రయాలను వేగవంతం చేసేందుకు ఈ డిజిటల్ ఏటీఎం విధానం ఎంతగానో తోడ్పడనుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్...

ತಿಪ್ಪಯ್ಯನ ಕೆರೆಗೆ ಕಲುಷಿತ ನೀರು ಸೇರ್ಪಡೆ ತಡೆಗೆ ಆಗ್ರಹ: ಬೃಹತ್ ಪ್ರತಿಭಟನೆ

ಮೈಸೂರು,ಅಕ್ಟೋಬರ್,5,2026 (www.justkannada.in): ಚಾಮುಂಡಿ ಬೆಟ್ಟದ ತಪ್ಪಲಲ್ಲಿರುವ ಸರ್ದಾರ್ ವಲ್ಲಭಭಾಯಿ ಪಟೇಲ್...

കേരളത്തിലെ സാനിട്ടറി മാലിന്യസംസ്‌കരണം ഒരു ചെറിയ പ്രശ്നമല്ല ; സ്ത്രീകളെ കൂടുതലായി ബാധിക്കുന്നത്: സർക്കാർ പരിഹാരമുണ്ടാക്കണമെന്ന് മാലാ പാർവ്വതി

കേരളത്തിലെ സാനിട്ടറി മാലിന്യസംസ്കരണത്തിന് സർക്കാർ നയം രൂപീകരിക്കണമെന്ന് അഭിനേതാവും സാമൂഹ്യ പ്രവർത്തകയുമായ...

புதுச்சேரி தட்டாஞ்சாவடி இடைத்தேர்தல்: அனல் பறந்த இறுதிகட்ட பிரசாரம்!

துணை ராணுவத்தினர் அணிவகுப்பு துணை ராணுவத்தினர் அணிவகுப்பு Source link