28
September, 2026

A News 365Times Venture

28
Monday
September, 2026

A News 365Times Venture

AP Assembly: ఈ నెల 17వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

Date:

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణకు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శనివారం అధికారిక నోటిఫికేషన్ జారీ చేశారు. గవర్నర్ ప్రకటన ప్రకారం, 17వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానుండగా, ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. ఇది ఏపీ శాసనసభకు 50వ వర్షాకాల సమావేశం కావడం విశేషం. సమావేశాల తొలిరోజైన 17వ తేదీ ఉదయాన్నే ఉభయ సభల బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) సమావేశం కానుంది. ఈ భేటీలో సభను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి, ఏ ఏ అంశాలపై చర్చించాలి అనే అజెండాను ఖరారు చేయనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ వర్షాకాల సమావేశాలు నాలుగు రోజుల పాటు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పలు కీలక ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించడంతో పాటు, ప్రభుత్వం ప్రవేశపెట్టే పలు ముఖ్యమైన బిల్లులకు ఉభయ సభలు ఆమోదం తెలపనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ವಿಶ್ವ ಪ್ರವಾಸೋದ್ಯಮ ದಿನ: ಅವತಿ ಬೆಟ್ಟಕ್ಕೆ ಚಾರಣ, ಸ್ವಚ್ಚತಾ ಕಾರ್ಯ ಅಭಿಯಾನ

ಬೆಂಗಳೂರು ಗ್ರಾಮಾಂತರ, ಸೆಪ್ಟಂಬರ್,28,2026 (www.justkannada.in): ವಿಶ್ವ ಪ್ರವಾಸೋದ್ಯಮ ದಿನದ ಅಂಗವಾಗಿ...

നിര്‍ഭയ കേസിന്റെ ആവര്‍ത്തനം; ദല്‍ഹിയിലെ പീഡനക്കേസുകളില്‍ സ്വമേധയാ കേസ് എടുത്ത് സുപ്രീം കോടതി

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹി എന്‍.സി.ആര്‍ മേഖലയില്‍ തുടര്‍ച്ചയായി റിപ്പോര്‍ട്ട് ചെയ്യുന്ന ലൈംഗികാതിക്രമ കേസുകളില്‍...

ஜெம் வீரமணி: 'விஜய், ஆதவ் , சி.டி.ஆருக்கு சம்மன் அனுப்பி விசாரிக்க வேண்டும்' – டி.ஆர் பாலு புகார்

ஜெம் வீரமணி தொடர்பான போக்சோ வழக்கில், திராவிட முன்னேற்றக் கழகத்தின் மீது...

Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..

తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో...