9
October, 2026

A News 365Times Venture

9
Friday
October, 2026

A News 365Times Venture

Indian Railways: RAC టికెట్‌కు పూర్తి ఛార్జీ ఎందుకు?.. అసలు కారణం చెప్పిన రైల్వే శాఖ

Date:

Indian Railways: రైలు ప్రయాణాల్లో చాలామందికి RAC (Reservation Against Cancellation) టికెట్లు వస్తుంటాయి. ఈ టికెట్‌తో ప్రయాణికులకు పూర్తి బెర్త్ కాకుండా సగం బెర్త్ లేదా కూర్చునే సౌకర్యం మాత్రమే లభిస్తుంది. దీంతో “సగం బెర్త్ ఇస్తే పూర్తి స్లీపర్ లేదా ఏసీ ఛార్జీ ఎందుకు వసూలు చేస్తున్నారు?” అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. తాజాగా ఈ ప్రశ్నకు భారతీయ రైల్వే స్పష్టమైన వివరణ ఇచ్చింది.

రైల్వే శాఖ తెలిపిన వివరాల ప్రకారం, RAC విధానం ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించబడింది. ధృవీకరించిన టికెట్ కలిగిన ప్రయాణికుడు తన టికెట్‌ను రద్దు చేసుకున్నా లేదా ప్రయాణానికి హాజరుకాకపోయినా, ఆ ఖాళీ బెర్త్‌ను వెంటనే RAC ప్రయాణికుడికి కేటాయించేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. అందువల్ల RAC టికెట్ కలిగిన వ్యక్తికి ప్రయాణ హక్కుతో పాటు, పూర్తి బెర్త్ పొందే అవకాశం కూడా ఉంటుంది.

లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు సమాధానంగా రైల్వే మంత్రి RAC వ్యవస్థ గురించి వివరించారు. సాధారణంగా ఒక స్లీపర్ బెర్త్‌ను ఇద్దరు RAC ప్రయాణికులకు కేటాయిస్తారు. అయితే ప్రయాణానికి ముందు లేదా ప్రయాణం మధ్యలో కన్ఫర్మ్ టికెట్ ఉన్న వ్యక్తి బెర్త్ ఖాళీ అయితే, ఆ బెర్త్‌ను RAC ప్రయాణికుడికి పూర్తిగా కేటాయిస్తారు. ఈ కారణంగానే RAC టికెట్ హోల్డర్ల నుంచి పూర్తి స్లీపర్ లేదా ఏసీ కోచ్ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఎందుకంటే వారికి అదే కోచ్‌లో ప్రయాణించే హక్కు ఉండటంతో పాటు, ఎప్పుడైనా పూర్తి బెర్త్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ RAC టికెట్‌పై ప్రయాణించడానికి ఆసక్తి లేకపోతే, ప్రయాణికులు రైల్వే నిబంధనల ప్రకారం టికెట్‌ను రద్దు చేసుకుని రీఫండ్ పొందవచ్చని అధికారులు తెలిపారు.

ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో రైల్వే శాఖ ప్రత్యేక చర్యలు కూడా చేపడుతోంది. డిమాండ్‌ను నిరంతరం పరిశీలిస్తూ అవసరమైన రైళ్లకు అదనపు కోచ్‌లు జోడించడం, ప్రత్యేక రైళ్లను నడపడం జరుగుతోంది. ముఖ్యంగా హోలీ, వేసవి సెలవులు, దుర్గాపూజ, దీపావళి, ఛత్ వంటి పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లను నడిపి లక్షలాది మంది ప్రయాణికులకు సౌకర్యం కల్పిస్తున్నట్లు రైల్వే తెలిపింది. అలాగే సాధారణ రైళ్లలో కూడా అదనపు కోచ్‌లను శాశ్వతంగా పెంచుతున్నట్లు వెల్లడించింది. గణాంకాల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో 872 అదనపు కోచ్‌లు, 2024-25లో అక్టోబర్ వరకు మరో 664 కోచ్‌లు శాశ్వతంగా జోడించారు. భవిష్యత్తులో కూడా ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా కోచ్‌ల సంఖ్యను పెంచడం, ప్రత్యేక రైళ్లను నడపడం కొనసాగుతుందని భారతీయ రైల్వే స్పష్టం చేసింది.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സര്‍ക്കാര്‍ പ്രവൃത്തിച്ചത് നിയമോപദേശപ്രകാരം; ഹൈക്കോടതി വിധി തിരിച്ചടിയല്ല: രമേശ് ചെന്നിത്തല

തിരുവനന്തപുരം: സി.എം.ആര്‍.എല്‍എക്‌സാലോജിക് സാമ്പത്തിക ഇടപാട് കേസില്‍ പിണറായി വിജയനെതിരായ വിധി പരിശോധിച്ച്...

"JD வான்ஸ் பேச்சு தேவையற்றது; இது இரு நாடுகளுக்கும் உதவாது"- அமெரிக்க அரசு மீது இந்தியா நேரடி தாக்கு

நிகழ்ச்சி ஒன்றில் பேசிய அமெரிக்காவின் துணை அதிபர் ஜே.டி. வான்ஸ்...

OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?

OTR: తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలకు బీఆర్‌ఎస్‌...

സംഘർഷം അവസാനിപ്പിക്കാൻ ഇറാൻ ശ്രമിക്കുന്നു, തെറ്റ് അവരുടേതല്ല: പുടിൻ

തുർക്ക്മെനിസ്ഥാൻ: അമേരിക്ക അടിച്ചേൽപ്പിച്ച യുദ്ധം ചർച്ചകളിലൂടെ സമാധാനപരമായി അവസാനിപ്പിക്കാൻ ഇറാൻ ആത്മാർത്ഥമായി...