18
August, 2026

A News 365Times Venture

18
Tuesday
August, 2026

A News 365Times Venture

Google Security: పాస్‌వర్డ్ మరిచిపోయారా?.. ఇకపై ఒక్క ‘సెల్ఫీ వీడియో’తో అకౌంట్ రికవర్!

Date:

Google: జీమెయిల్ పాస్‌వర్డ్ మరిచిపోవడం, సరిగ్గా అదే సమయంలో రికవరీకి ఇచ్చిన ఫోన్ నంబర్ లేదా ప్రత్యామ్నాయ ఈమెయిల్ అందుబాటులో లేకపోవడం ఎవరికైనా పెద్ద చిక్కులనే తెచ్చిపెడుతుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో యూజర్లకు ఊరటనిచ్చేందుకు గూగుల్ ఓ సరికొత్త వినూత్న ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అదే ‘సెల్ఫీ వీడియో’ సెక్యూరిటీ ఆప్షన్. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు ఒక చిన్న వీడియో రికార్డ్ చేసి అకౌంట్‌ను సులభంగా రికవర్ చేసుకోవచ్చు. భవిష్యత్తులో సాధారణ సైన్-ఇన్ పద్ధతులు అందుబాటులో లేనప్పుడు లేదా పాస్‌వర్డ్ గుర్తులేనప్పుడు ఖాతాపై మళ్లీ యాక్సెస్ సాధించడానికి ఈ వీడియో సెల్ఫీ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుందని గూగుల్ తన బ్లాగ్‌పోస్ట్‌లో వెల్లడించింది.

ఈ ఫీచర్ పనిచేసే విధానం కూడా చాలా సులభంగా, భద్రంగా ఉంటుంది. ముందుగా సెటప్ ప్రక్రియలో భాగంగా యూజర్లు తమ ఫోన్ సెల్ఫీ కెమెరా సాయంతో ఒక చిన్న వీడియో రికార్డ్ చేయాల్సి ఉంటుంది. ఆ వీడియో భవిష్యత్ అవసరాల కోసం గూగుల్ వద్ద ఒక రెఫరెన్స్‌గా సేవ్ అవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైనా ‘ఫర్గెట్ పాస్‌వర్డ్’ అని నొక్కినప్పుడు లేదా సాధారణ పద్ధతుల్లో సైన్-ఇన్ కానప్పుడు, గూగుల్ మిమ్మల్ని ఒక లైవ్ వీడియో తీయమని అడుగుతుంది. ముందే సేవ్ చేసిన రెఫరెన్స్ వీడియోతో ఈ లైవ్ వీడియోను సరిపోల్చి అకౌంట్‌ను ఆథెంటికేట్ చేస్తుంది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయమేమిటంటే.. ముందే రికార్డ్ చేసిన వీడియోలు లేదా ఫోటోలను ఇందులో వాడటానికి కుదరదు. కేవలం అప్పటికప్పుడు లైవ్‌లో తీసే వీడియోను మాత్రమే సిస్టమ్ అంగీకరిస్తుంది. అత్యంత బహుళ మల్టిపుల్ సెక్యూరిటీ లేయర్స్ పనిచేసే ఈ టెక్నాలజీ, డీప్‌ఫేక్ వీడియోలను సైతం సులభంగా పసిగట్టి అసలైన యూజర్‌కే ఖాతా దక్కేలా పూర్తి రక్షణ కల్పిస్తుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

സി.ജെ.പി പ്രതിഷേധിക്കാരുടെ മുഖം തിരിച്ചറിയാന്‍ ഫേഷ്യല്‍ റെഗഗനിഷന്‍ സാങ്കേതിക വിദ്യ ഉപയോഗിച്ചെന്ന് സമ്മതിച്ച് ദല്‍ഹി പൊലീസ്

ന്യൂദല്‍ഹി: ജന്തര്‍ മന്ദറില്‍ നടന്ന വിദ്യാര്‍ത്ഥി പ്രതിഷേധത്തിനിടെ മുഖം തിരിച്ചറിയല്‍ സാങ്കേതികവിദ്യ...

காவலர் தாக்கப்பட்ட விவகாரம்:“Public Nuisance-ஐ தட்டிக் கேட்பதில் தவறில்லையே" – நயினார் நாகேந்திரன்

தஞ்சாவூரில் நேற்று விசிக-வினர் சாலமறியல் போராட்டத்தில் ஈடுபட்டனர். அதனால் அந்த வழியில்...

നീറ്റ് പ്രതിഷേധത്തിനിടെ AK-47 ഉപയോഗിച്ച് വെടിവെച്ച സംഭവം; സുപ്രീം കോടതിയിൽ ബീഹാർ പൊലീസിന്റെ സത്യവാങ്മൂലം

സിവാൻ: നീറ്റ്-യുജി പരീക്ഷാ ക്രമക്കേടുകൾക്കെതിരെ ബീഹാറിൽ നടന്ന പ്രതിഷേധത്തിനിടെ സിവാനിൽ പൊലീസുകാരൻ...