16
July, 2026

A News 365Times Venture

16
Thursday
July, 2026

A News 365Times Venture

TG TET 2026 Results: టెట్ ఫలితాల్లో షాకింగ్.. పాఠాలు చెప్పే ప్రభుత్వ టీచర్లలో 62 శాతం మంది ఫెయిల్!

Date:

TG TET 2026 Results: తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET) జూన్-2026 ఫలితాలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధన ప్రమాణాలపై సరికొత్త చర్చకు తెరలేపాయి. విద్యాశాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం, ప్రస్తుతం విధుల్లో ఉంటూ ఈ పరీక్ష రాసిన ప్రభుత్వ ఉపాధ్యాయులలో అత్యధికులు ఉత్తీర్ణత సాధించలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 23,623 మంది ఇన్-సర్వీస్ (ప్రభుత్వ, కేజీబీవీ కాంట్రాక్టు) ఉపాధ్యాయులు హాజరుకాగా.. వారిలో కేవలం 8,809 మంది మాత్రమే అర్హత సాధించారు. మిగిలిన 14,814 మంది ఉపాధ్యాయులు ఫెయిల్ అయ్యారు. అంటే ప్రస్తుతం పిల్లలకు పాఠాలు చెప్తున్న టీచర్ల ఉత్తీర్ణత శాతం కేవలం 37.29% గానే నమోదైంది. మరోవైపు, ఇదే పరీక్ష రాసిన నిరుద్యోగ అభ్యర్థుల ఉత్తీర్ణత శాతం 45.66% గా ఉంది. అంటే నిరుద్యోగులతో పోలిస్తే విధుల్లో ఉన్న ఉపాధ్యాయుల ఉత్తీర్ణత 8.37% తక్కువగా ఉండటం గమనార్హం. గత టెట్ పరీక్షతో పోల్చినా ఈసారి ఫలితాలు బాగా క్షీణించాయి. గతంలో 65,605 మంది ఇన్-సర్వీస్ టీచర్లు పరీక్ష రాయగా 57.76% (37,893 మంది) పాసయ్యారు. కానీ ఈసారి ఆ స్థాయి ఫలితాలు నమోదు కాలేదు.

సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో పెరిగిన ఉత్కంఠ:

ప్రస్తుతం ఉద్యోగాల్లో కొనసాగుతున్న టీచర్లు తమ కొలువులు కాపాడుకోవాలంటే రాబోయే రెండేళ్లలో (ఆగస్టు 2028 లోపు) కచ్చితంగా టెట్ పాస్ కావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈ నిబంధన కారణంగానే టీచర్లు ఈ పరీక్ష రాయాల్సి వచ్చింది. అయితే, ఈ ఫలితాల నేపథ్యంలో ఫెయిల్ అయిన ఉపాధ్యాయుల కోసం విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. వారికి మరో అవకాశం కల్పిస్తూ.. ఈ ఏడాది సెప్టెంబర్ 7 నుంచి 11 వరకు ప్రత్యేక టెట్ (Special TET) పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూలై 21న విడుదల కానుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യു.എസ് സൈനികരുടെ മൊബൈല്‍ ഫോണ്‍ വിവരങ്ങള്‍ ഇറാന്‍ ചോര്‍ത്തിയതായി വെളിപ്പെടുത്തല്‍

ന്യൂയോര്‍ക്ക്: യു.എസ് സൈനികോദ്യോഗസ്ഥരെ ലക്ഷ്യമിട്ട് ഇറാന്റെ സൈബര്‍ ആക്രമണം നടന്നതായി ഗവേഷണ...

Mudragada Funeral: ముద్రగడకు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నాయకుడు ముద్రగడ పద్మనాభంకు ప్రభుత్వ...

ಇನ್ಮುಂದೆ 15 ನಿಮಿಷಗಳಲ್ಲಿ ಸ್ಥಳಕ್ಕೆ 108 ಆ್ಯಂಬುಲೆನ್ಸ್: ಹೊಸ ಪ್ರಯತ್ನಕ್ಕೆ ಮುಂದಾದ ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ

ಬೆಂಗಳೂರು,ಜುಲೈ,15,2026 (www.justkannada.in):  ದೇಶದಲ್ಲೇ ರಾಜ್ಯದ ಆರೋಗ್ಯ ಇಲಾಖೆ ಹೊಸ ಪ್ರಯತ್ನಕ್ಕೆ...