12
July, 2026

A News 365Times Venture

12
Sunday
July, 2026

A News 365Times Venture

Ambati Rambabu: రావణ్‌పై యూఏపీఏ కేసు అన్యాయం.. పోరాటానికి మా మద్దతు

Date:

Ambati Rambabu: ప్రశ్న రావణ్‌పై నమోదైన యూఏపీఏ కేసును తీవ్రంగా తప్పుబట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ఆయనపై కేసు నమోదు చేయడం పూర్తిగా అన్యాయమని, అణచివేత ధోరణిలో భాగంగానే ఈ చర్యలు చేపట్టారని ఆరోపించారు. రావణ్‌కు ఒక కేసులో బెయిల్ లభించిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయడం, చివరకు యూఏపీఏ కింద కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.

రిమాండ్‌కు పంపిన అనంతరం దర్యాప్తు ప్రారంభించడం, ఇంట్లో సోదాలు నిర్వహించడం ద్వారా కేసుకు అవసరమైన ఆధారాలను సేకరించే ప్రయత్నం జరుగుతోందని అంబటి రాంబాబు విమర్శించారు. పోలీస్ స్టేషన్‌లో ఉన్న రావణ్‌పై దాడి యత్నం జరిగినప్పటికీ సంబంధిత వారిపై చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. రావణ్ సిద్ధాంతాలతో తమకు ఏకీభావం లేదని, ఆయన గతంలో వైసీపీని విమర్శించిన విషయాన్ని గుర్తుచేసిన అంబటి.. అయినప్పటికీ అన్యాయమైన చట్టాలను ప్రయోగించి ఎవరినైనా అణచివేయడాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. పోలీసు హింసకు బలైన బాధితులకు అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.

సాయికృష్ణ, క్రాంతి కుమార్ లు చనిపోతే మేం వారికి అండగా నిలిచామన్నారు అంబటి.. రౌడీషీటర్లకు మద్దతిస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు.. మేం రౌడీ షీటర్లకు కాదు.. చనిపోయిన వారికి మాత్రమే మద్దతిస్తున్నాం అన్నారు.. దుర్మార్గంగా పోలీసుల హింసకు బలైపోయిన వారికి మద్దతిస్తే తప్పా? అని ప్రశ్నించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എസ്. ജാനകി അന്തരിച്ചു

മൈസൂരു:  വിഖ്യാത ഗായിക എസ്. ജാനകി അന്തരിച്ചു. മൈസൂരുവിലെ താമസസ്ഥലത്തായിരുന്നു അന്ത്യം....

`3,084 ஏக்கர் கோயில் நிலமா? பாஜக-வின் அப்பட்டமான பொய்; இதுதான் நடந்தது..!'- எம்.பி ஜோதிமணி விளக்கம்

கோவை பீளமேடு பா.ஜ.க அலுவலகத்தில் மாநில பா.ஜ.க தலைவர் நயினார் நாகேந்திரன்...

INS Mahendragiri: విశాఖలో ఐఎన్‌ఎస్ మహేంద్రగిరి జాతికి అంకితం.. రాజ్‌నాథ్‌ కీలక వ్యాఖ్యలు

INS Mahendragiri: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ విశాఖపట్నంలో ఆధునిక యుద్ధనౌక...

ಲೋಕ ಅದಾಲತ್‌ ನಲ್ಲಿ ಮಾನವೀಯತೆ: ವಿಕಲಚೇತನ ವ್ಯಕ್ತಿಯ 8 ಲಕ್ಷ ರೂ. ಬ್ಯಾಂಕ್ ಸಾಲ ಕೇವಲ 15,000 ರೂ.ಗೆ ಇತ್ಯರ್ಥ!

​ಚಿಕ್ಕಮಗಳೂರು,ಜುಲೈ,11,2026 (www.justkannada.in):  ಇಲ್ಲಿನ ಜಿಲ್ಲಾ ಕಾನೂನು ಸೇವೆಗಳ ಪ್ರಾಧಿಕಾರ  ಹಮ್ಮಿಕೊಂಡಿದ್ದ...