11
July, 2026

A News 365Times Venture

11
Saturday
July, 2026

A News 365Times Venture

Jangaon: మద్యం మత్తులో హల్‌చల్.. బస్టాండ్ నుంచి ఆర్టీసీ అద్దె బస్సును ఎత్తుకెళ్లిన వ్యక్తి

Date:

Jangaon: జనగామ జిల్లాలో మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన నిర్వాకం కలకలం రేపింది. జనగామ ఆర్టీసీ బస్టాండ్‌లో నిలిపి ఉంచిన అద్దె బస్సును ఎవరికి తెలియకుండా స్టార్ట్ చేసి తీసుకెళ్లాడు. సుమారు 21 కిలోమీటర్లు బస్సును నడిపించి చివరకు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ఘటనతో ప్రయాణికులు, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

పోలీసుల వివరాల ప్రకారం.. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ వాహనంలోనే తాళాలు వదిలేసి ఇంటికి వెళ్లాడు. ఇదే అవకాశంగా భావించిన పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన డోజర్ డ్రైవర్ జిట్టబోయిన వెంకన్న మద్యం మత్తులో బస్సును స్టార్ట్ చేసి అక్కడి నుంచి సూర్యాపేట వైపు తీసుకెళ్లాడు. జనగామ నుంచి బస్సును నడిపిస్తూ వెళ్లిన వెంకన్న, దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌గేట్ సమీపానికి చేరుకున్నాడు. అక్కడ బస్సు అదుపు తప్పి సిమెంట్ దిమ్మెను ఢీకొట్టింది. ప్రమాదాన్ని గమనించిన టోల్‌గేట్ సిబ్బంది అనుమానంతో వెంటనే దేవరుప్పుల పోలీసులకు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న దేవరుప్పుల పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని నిందితుడు వెంకన్నను బస్సుతో సహా అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతడిని జనగామ పోలీసులకు అప్పగించారు. అద్దె బస్సు యజమాని గంట గోపికృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు జనగామ సీఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేశారు. నిందితుడు మద్యం మత్తులోనే బస్సును ఎత్తుకెళ్లాడా.? ఘటనకు దారితీసిన పూర్తి పరిస్థితులు ఏంటి.? అనే అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യമന്ത്രിയെ സന്ദര്‍ശിച്ച് ആര്‍.വി ബാബുവും ശശികലയും; ആവശ്യങ്ങള്‍ മുഖ്യമന്ത്രി അനുഭാവപൂര്‍വം കേട്ടെന്ന് ആര്‍.വി ബാബു

തിരുവനന്തപുരം: മുഖ്യമന്ത്രി വി.ഡി. സതീശന് വിവിധ ആവശ്യങ്ങള്‍ ഉന്നയിച്ചുള്ള നിവേദനം നല്‍കിയതായി...

"தென்னிந்தியர்களும் வட இந்திய மொழி ஒன்றை கற்றுக்கொள்ள வேண்டும்"- ஆளுநர் அர்லேகர் பேச்சு

காசி தமிழ் சங்கமம் 4.0 நிகழ்ச்சிக்கு ஏற்பாடு செய்தவர்களை பாராட்டும் நிகழ்ச்சி...

Gen Z ಪೀಳಿಗೆಗೆ ಇತಿಹಾಸ ಪರಿಚಯಿಸಲಿ “ಮೈಸೂರು ದಸರಾ” : ಡಿಸಿಎಂ ಜಿ. ಪರಮೇಶ್ವರ್ ಸಲಹೆ.

  ಬೆಂಗಳೂರು, ಜು.10: ನಾಡಿನ ಪರಂಪರೆ, ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಇತಿಹಾಸವನ್ನು ಮುಂದಿನ...