6
July, 2026

A News 365Times Venture

6
Monday
July, 2026

A News 365Times Venture

TG Police Recruitment: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 7,437 పోలీస్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ రెడీ!

Date:

TG Police Recruitment 2026: తెలంగాణలో ఖాళీగా ఉన్న పోలీస్ పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు త్వరలోనే తీపి కబురు అందించనుంది. రాష్ట్ర పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న మొత్తం 7,437 పోస్టుల భర్తీకి సంబంధించి భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసేందుకు రిక్రూట్మెంట్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఇందుకు సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ (Draft Notification) సైతం ఇప్పటికే సిద్ధమైంది. ఈ భారీ నియామక ప్రక్రియను పక్కా ప్రణాళికతో పూర్తి చేసేందుకు బోర్డు కసరత్తు ముమ్మరం చేసింది.

ఈ మొత్తం 7,437 పోస్టులలో వివిధ విభాగాలకు సంబంధించిన ఖాళీలను భర్తీ చేయనున్నారు. అందులో అత్యధికంగా 3,697 సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, 1,052 ఏఆర్ (AR) కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. వీటితో పాటు యువత ఎంతగానో ఎదురుచూసే 148 సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ (SI) పోస్టులను సైతం ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అలాగే, భద్రతా విభాగమైన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) లో అత్యధికంగా 1,380 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి. పోలీస్ శాఖతో పాటు జైళ్ల శాఖ, ఫైర్ (అగ్నిమాపక) డిపార్ట్‌మెంట్‌లకు సంబంధించిన వార్డెన్ల పోస్టులను కూడా ఈ సింగిల్ నోటిఫికేషన్ పరిధిలోనే భర్తీ చేసేందుకు బోర్డు తుది నిర్ణయం తీసుకుంది. నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన డ్రాఫ్ట్ కాపీని రిక్రూట్మెంట్ బోర్డు ఇప్పటికే క్షుణ్ణంగా పరిశీలించిందని, అన్నీ సవ్యంగా ఉన్నందున చాలా త్వరలోనే అధికారికంగా నోటిఫికేషన్‌ను జారీ చేస్తామని తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు అధికారికంగా ప్రకటించారు. ఈ ప్రకటనతో రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ ఉద్యోగాల కోసం తీవ్రంగా శ్రమిస్తూ, కోచింగ్ తీసుకుంటున్న వేలాది మంది అభ్యర్థుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വഖഫ് ബോര്‍ഡില്‍ ഹിന്ദു അംഗങ്ങളെ നിയമിച്ച് മധ്യപ്രദേശ് സര്‍ക്കാര്‍; വഖഫ് നിയമഭേദഗതിയിലെ വിവാദ വ്യവസ്ഥ നടപ്പിലാക്കുന്ന ആദ്യ സംസ്ഥാനം

  ഭോപ്പാല്‍: ചരിത്രത്തിലാധ്യമായി വഖഫ് ബോര്‍ഡില്‍ രണ്ട് ഹിന്ദു അംഗങ്ങളെ ഉള്‍പ്പെടുത്തി...

தமிழ்நாடு அரசு போக்குவரத்து கழகத்துக்கு 2,000 புதிய மின்சார ஏசி பேருந்துகள்! – விரைவில் டெண்டர்

தமிழ்நாட்டில் பொதுப் போக்குவரத்து சேவையை மேம்படுத்தும் நடவடிக்கைகளின் ஒரு பகுதியாக, தமிழ்நாடு...

മുന്‍ കോളനികള്‍ ബ്രിട്ടന് നഷ്ടപരിഹാരം നല്‍കണമെന്ന് മുന്‍ ആഭ്യന്തര മന്ത്രി; ഈ രാജ്യങ്ങള്‍ വളരാന്‍ കാരണം ബ്രിട്ടനെന്നും വാദം, പ്രതിഷേധം

ലണ്ടന്‍: ബ്രിട്ടന്റെ മുന്‍ കോളനികള്‍ ബ്രിട്ടന് തിരിച്ച് നഷ്ടപരിഹാരം നല്‍കണമെന്ന് മുന്‍...

`தற்கொலையை ஆணவக் கொலையாக திரித்துக் கூறி சிலர் ஆதாயம் தேட முயல்கிறார்கள்!' – அன்புமணி ராமதாஸ்

மேகதாது அணை திட்டத்திற்கு எதிராக தீவிரமாக களமாடி வரும் பாட்டாளி மக்கள்...