3
July, 2026

A News 365Times Venture

3
Friday
July, 2026

A News 365Times Venture

Rythu Bharosa: రైతులకు అలర్ట్.. నేడు మూడో విడత రైతు భరోసా నిధుల విడుదల!

Date:

Rythu Bharosa 3rd Installment Released Today: తెలంగాణ ప్రభుత్వం ‘రైతు భరోసా’ పథకం అమలును దశలవారీగా కొనసాగిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో రైతు భరోసా నిధులను అధికారికంగా విడుదల చేశారు. అనంతరం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా రెండు ఎకరాల లోపు భూమి కలిగిన 44.28 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2,482 కోట్లు ప్రభుత్వం నేరుగా జమ చేసింది. అనంతరం రెండో విడతలో మూడు ఎకరాల వరకు సాగుభూమి ఉన్న రైతులకు రైతు భరోసా సాయం అందించింది.

తాజాగా మూడో విడతలో భాగంగా 3 నుంచి 4 ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు రైతు భరోసా నిధులను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఈ విడతలో 6.39 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.1,330.32 కోట్లు నేరుగా జమ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఇప్పటివరకు మూడు విడతల్లో కలిపి రాష్ట్రంలోని 61.35 లక్షల మంది రైతులకు రూ.5,402.37 కోట్ల రైతు భరోసా సాయం అందించబడింది. అర్హులైన ప్రతి రైతుకు ప్రభుత్వం నిర్ణయించిన విధంగా నిధులు దశలవారీగా జమ చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.

రైతులకు వ్యవసాయ పెట్టుబడి భారం తగ్గించడం, సాగు కార్యకలాపాలకు ఆర్థికంగా అండగా నిలవడం లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తోంది. భూమి విస్తీర్ణాన్ని ఆధారంగా చేసుకుని విడతల వారీగా నిధులు విడుదల చేస్తుండటంతో మిగిలిన అర్హులైన రైతుల ఖాతాల్లో కూడా త్వరలోనే రైతు భరోసా సాయం జమ కానుంది. రైతుల పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 30 నెలల ప్రజాపాలనలో రైతు తలెత్తుకునేలా పాలన అందిస్తున్నామన్నారు. వ్యవసాయం దండగ కాదని, పండుగగా భావించే పరిస్థితిని ప్రభుత్వం కల్పిస్తోందని సీఎం పేర్కొన్నారు.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇന്‍സ്റ്റഗ്രാമിലെ കുട്ടികളുടെ അശ്ലീല പരസ്യങ്ങള്‍; ഞെട്ടിക്കുന്ന റിപ്പോര്‍ട്ടുമായി ബി.ബി.സി, മെറ്റയ്ക്ക് കേന്ദ്രത്തിന്റെ നോട്ടീസ്

ന്യൂദല്‍ഹി: ഇന്‍സ്റ്റഗ്രാം പ്ലാറ്റ്ഫോം വഴി കുട്ടികള്‍ക്കെതിരെയുള്ള ലൈംഗികാതിക്രമ ദൃശ്യങ്ങള്‍ പ്രോത്സാഹിപ്പിക്കുന്ന പരസ്യങ്ങള്‍...

`தவெக-வில் இணையச் சொல்லி என்னை வற்புறுத்தினார்கள்!'- கைதான அனிதா ராதாகிருஷ்ணன் `பகீர்' குற்றச்சாட்டு

தூத்துக்குடி மாவட்டம், திருச்செந்தூரில் கடந்த 20-ம் தேதி மறைந்த முன்னாள் முதல்வர்...

ನನಗೆ ಪ್ರಧಾನಿ ಆಗೋ ಆಸೆ ಇದೆ, ಆದ್ರೆ ಆಗಬೇಕಲ್ಲ? ಶಾಸಕ ಬಸವರಾಜ ರಾಯರೆಡ್ಡಿ ವ್ಯಂಗ್ಯ

ಕೊಪ್ಪಳ,ಜುಲೈ3,2026 (www.justkannada.in):  ಡಿಕೆ ಶಿವಕುಮಾರ್ ರಾಜ್ಯದ ಸಿಎಂ ಆಗಿ ಒಂದು...