29
July, 2026

A News 365Times Venture

29
Wednesday
July, 2026

A News 365Times Venture

Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్‌గా మారిన తండ్రి

Date:

టూర్‌కు వెళ్దాం అంటే ఆ పిల్లలు సంతోషంతో తండ్రి వెంట వెళ్లారు. ప్రాజెక్టు అందాలను చూపించి సెల్ఫీలు దిగుతుంటే సంబర పడ్డారు. గోరు ముద్దలు తినిపించి పిల్లలతో కొన్ని గంటల పాటు సరదాగా గడిపిన ఆ తండ్రి.. అంతలోనే విలన్‌గా మారాడు. పిల్లలను డ్యాంలో తోసేసి తాను బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి వరకు అమ్మ ఊసు లేకుండా నాన్నతో గడిపిన ఆ చిన్నారులు విగత జీవులుగా మారారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట నుంచి వచ్చి.. నిజాం సాగర్‌లో శవాలుగా మారారు. ఈ ఘటన రెండు జిల్లాల్లో తీవ్ర విషాదం నింపింది.

సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలానికి చెందిన బోయి కృష్ణ, తన భార్యా పిల్లలతో కలిసి పఠాన్‌చెరులో మూడు నెలలుగా నివాసం ఉంటున్నాడు. వీరికి 9 ఏళ్ల కొడుకు రక్షిత్, ఐదేళ్ల కూతురు అనన్య ఉన్నారు. కృష్ణ పెయింటర్‌గా పని చేయడంతో పాటు వాచ్ మెన్‌గా పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య సవిత కూలి పనులు చేస్తోంది. ఐతే భార్య భర్తల మధ్య కొంత కాలంగా మనస్పర్థలు వచ్చాయి. కుటుంబ కలహాలతో భార్య భర్తలు మాట్లాడుకోవడం మానేశారు.

నువ్వు వద్దు అంటూ భార్య.. భర్తతో చెప్పడంతో .. మనస్థాపం చెందిన కృష్ణ… తన కొడుకు, కూతురుతో పాటు టూర్ వెళ్దాం అంటూ నిన్న ఉదయం ద్విచక్ర వాహనంపై నిజాం సాగర్ ప్రాజెక్టుకు చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతంలో పిల్లలతో సరదాగా గడిపాడు కృష్ణ. గోరు ముద్దలు పెట్టాడు. పిల్లలతో సెల్ఫీలు దిగాడు. తెప్పపై నీళ్లు ఉన్న ప్రాంతానికి కొడుకు రక్షిత్, కూతురు అనన్యను తీసుకెళ్లాడు. అదును చూసి.. ఆ పిల్లలను నిజాం సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ ప్రాంతాలలో తోసేశాడు. ఆపై తాను దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు బంధువులు ఫోన్ చేస్తే జాగ్రత అంటూ… కృష్ణ ఫోన్ కట్ చేశాడు.

ఇద్దరు పిల్లలతో కలిసి తండ్రి బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. పిల్లలను వెంట పెట్టుకుని వెళ్ళిన భర్త ఇంటికి రాకపోవడంతో భార్య ఆందోళన చెంది పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంధువుల ఫోన్‌కు సెల్ఫీ ఫోటోలు పంపడంతో.. నిజాం సాగర్‌లో ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ప్రాజెక్టు దగ్గర బైక్ పార్క్ చేసి చెప్పులు విడిచి .. ఉండటంతో ప్రాజెక్టులో పడి చనిపోయారా అనే అనుమానంతో గజ ఈతగాళ్లతో వెతికించారు. ఒక్కో మృతదేహం విగత జీవులుగా బయట పడటంతో ఆ తల్లి గుండె తరుక్కుపోయింది. బంధువుల రోదనలు మిన్నంటాయి. గంట వ్యవధిలో ముగ్గురి మృతదేహాలు బయటకు తెచ్చారు ఈతగాళ్లు. దీంతో నిజాం సాగర్ ప్రాంతం మృతుల బంధువుల రోదనతో మారుమోగింది.

భార్య భర్త మధ్య జరిగిన గొడవలతో మనస్థాపం చెందిన భర్త తన ఇద్దరు పిల్లలు రక్షిత్, అనన్య తో కలిసి బయటకు వెళ్లి వస్తామని చెప్పి విగత జీవులుగా మారారని చిన్నారుల తల్లి రోదించింది. కృష్ణ తన ఇద్దరు పిల్లలతో ప్రాజెక్ట్ వద్ద దిగిన ఫోటోలు వీడియోలు పలువురికి వాట్సాప్ చేసిన అనంతరం డ్యామ్ లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు పిల్లల్ని ప్రాజెక్టు‌లోకి తోసి.. తాను బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం సృష్టించింది. రెండు జిల్లాల్లో విషాదం నింపింది. భార్య భర్తల గొడవలతో.. భర్త ఇద్దరు పిల్లలు మృతి చెందగా.. భర్త, పిల్లలను కోల్పోయి భార్య రోడ్డున పడింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Supreme Court: కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్.. పోస్ట్-ఫాక్టో పర్యావరణ అనుమతులకు బ్రేక్

Supreme Court: పర్యావరణ అనుమతుల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక...

ತಮಿಳುನಾಡಿಗೆ ನೀರು ಬಿಟ್ಟರೇ ಬೀದಿಗಿಳಿದು ಹೋರಾಟ- ಶಾಸಕ ದರ್ಶನ್ ಪುಟ್ಟಣ್ಣಯ್ಯ ಎಚ್ಚರಿಕೆ

ಮಂಡ್ಯ,ಜುಲೈ,29,2026 (www.justkannada.in):  ರಾಜ್ಯದಲ್ಲಿ ಕುಡಿಯುವ ನೀರಿಗೂ ಕೊರತೆ ಇದ್ದರೂ ತಮಿಳುನಾಡಿಗೆ...

പെണ്‍കുട്ടികള്‍ എന്ന് ഞാന്‍ പറഞ്ഞിട്ടില്ല: മക്കള്‍ക്ക് പകര്‍ന്ന് കൊടുക്കണം എന്നാണ് പറഞ്ഞത്, ഇതില്‍ എന്ത് സ്ത്രീ വിരുദ്ധത: വിശദീകരണവുമായി മുഖ്യമന്ത്രി

തിരുവനന്തപുരം: പാചകവുമായി ബന്ധപ്പെട്ട് താന്‍ സ്ത്രീവിരുദ്ധമായ പരമാര്‍ശം നടത്തിയിട്ടില്ലെന്ന് മുഖ്യമന്ത്രി വി.ഡി...

அமெரிக்க தளத்தில் ஈரான் தாக்குதல், ட்ரம்ப்-நெதன்யாகு, ஜெலன்ஸ்கி மீட், ஈராக் தாக்குதல் ஏன்?|#AllInOne

ஈரான் போர், அதிபர்கள் சந்திப்பு உள்ளிட்ட முக்கிய உலக செய்திகளை இங்கே...