10
June, 2026

A News 365Times Venture

10
Wednesday
June, 2026

A News 365Times Venture

Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!

Date:

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో నేడు రాజకీయంగా రెండు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు ముఖ్యమైన అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అలాగే, ప్రధానిగా జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును అధిగమించి సుదీర్ఘ కాలం పదవిలో కొనసాగుతున్న నరేంద్ర మోడీని కేంద్ర క్యాబినెట్ సభ్యులు ప్రత్యేకంగా సన్మానించనున్నారు. దీంతో ఈ సమావేశానికి మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

ఆ కార్యక్రమం తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి ఢిల్లీలోని భారత మండపంలో ఎన్డీఏ (జాతీయ ప్రజాస్వామ్య కూటమి) కీలక సమావేశం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ముఖ్య నేతలు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. ప్రధానిగా నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తయిన నేపథ్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటివరకు తీసుకున్న కీలక నిర్ణయాలు, సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించనున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

കരയുന്ന കുട്ടികളുടെ ശബ്ദം, സഹായത്തിനായി നിലവിളിക്കുന്ന സ്ത്രീകള്‍; ലെബനനില്‍ ഇസ്രഈലി ഡ്രോണുകളുടെ പുതിയ തന്ത്രം

ബെയ്‌റൂട്ട്: വ്യോമാക്രമണങ്ങള്‍ക്കും മിസൈല്‍ വര്‍ഷങ്ങള്‍ക്കും പുറമേ, സാധാരണക്കാരെ ലക്ഷ്യമിട്ടുള്ള ക്രൂരമായ പുതിയ...

பொள்ளாச்சி பாலியல் வழக்கில் குற்றம்சாட்டப்பட்ட ‘பார்’ நாகராஜ் தவெக-வில் இணைந்தாரா?

கோவை மாவட்டம் பொள்ளாச்சியில் கடந்த 2019-ம் ஆண்டில் இளம் பெண்களை வீடியோ...

Narendra Modi: ‘జవహర్ లాల్ నెహ్రూ’ను అధిగమించిన నరేంద్ర మోడీ.. అత్యధిక కాలం ప్రధానిగా.!

Narendra Modi: ప్రధానిగా నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. నేటితో...

ದೀರ್ಘಾವಧಿ ಪ್ರಧಾನಿ: ನೆಹರು ದಾಖಲೆ ಮುರಿದು ಹೊಸ ಇತಿಹಾಸ ಬರೆದ ಪಿಎಂ ಮೋದಿ

ನವದೆಹಲಿ, ಜೂನ್ ,10,2026 (www.justkannada.in)  ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು ದೇಶದ...