28
June, 2026

A News 365Times Venture

28
Sunday
June, 2026

A News 365Times Venture

Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!

Date:

తెలిసీతెలియని వయసులో కొందరు పిల్లలు ఏం చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. వ్యామోహమో.. లేదంటే బడాయి కోసమో.. లేదంటే సినిమాల ప్రభావమో తెలియదు గానీ.. మీసాలు కూడా రాని వయసులోనే ప్రేమలో పడుతున్నారు. అంతటితో ఆగుతున్నారంటే అది లేదు. ప్రేయసిని మెప్పించేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.

ఓ మైనర్‌కు ప్రియురాలు ఉంది. ఐఫోన్ బహుమతి ఇవ్వాలని ఆమె కోరింది. అంతే తడువుగా చేతిలో చిల్లుగవ్వ లేకపోయినా కొనిస్తానని మాటిచ్చాడు. అయితే ప్రేయసికి ఎలాగైనా ఐఫోన్ కొనాలని పూనుకున్నాడు. బుర్రకు పదునుపెట్టి భారీ దోపిడీకి స్కెచ్ గీశాడు. దీనికి తన స్నేహితుల సాయం కోరాడు. అంతే తడువుగా ఓ గిడ్డంగిలో రూ.12 లక్షల విలువైన సామాగ్రి దొంగిలించారు. పాపం పండి అడ్డంగా దొరికిపోయారు.

నాగ్‌పూర్‌లోని లకడ్‌గంజ్ ప్రాంతానికి చెందిన రాహుల్ జైచంద్‌కు కల్మానా ప్రాంతంలో ‘రాహుల్ సిరామిక్స్ ప్రైవేటు లిమిటెడ్’’ పేరుతో టైల్, శానిటరీ వేర్, సిపి ఫిట్టింగ్స్ గిడ్డంగి ఉంది. అయితే మే 27-28 తేదీల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు పైకప్పు రేకుల షీట్లను తొలగించి రూ.12 లక్షల విలువైన అత్యంత ఖరీదైన శానిటరీ ఉత్పత్తులను దొంగలించారు. దీంతో రాహుల్ జైచంద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీరియస్‌గా తీసుకున్న కలమ్నా పోలీసుల దర్యాప్తు బృందం.. సీసీటీవీ కెమెరాలను జల్లెడ పట్టారు. మొత్తానికి మైనర్ దొంగలను పట్టుకున్నారు. కేవలం 12 గంటల్లోనే దొంగతనాన్ని ఛేదించారు.

పోలీసులు షాక్


ఈ కేసులో ప్రధాన అనుమానితుడితో పాటు ఇద్దరు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మైనర్లను క్షుణ్ణంగా విచారించగా నేరాన్ని ఒప్పుకున్నారు. దొంగతనానికి చెప్పిన కారణం తెలుసుకుని పోలీసులు సైతం దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్రేయసికి ఖరీదైన ఐఫోన్ కొనివ్వాలనుకున్నామని, అందుకు తమకు డబ్బు అత్యవసరమని ఒప్పుకున్నారు. ఆ కోరికతోనే గిడ్డంగిని లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. దొంగిలించిన విలాసవంతమైన డిజైనర్ కుళాయిలను ఒక వీధి వ్యాపారికి కేవలం 20,000 రూపాయలకే అమ్మినట్లు మైనర్లు చెప్పారు. వస్తువులను కొనుగోలు చేసిన ప్రధాన నిందితుడు.. 38 ఏళ్ల ఇర్ఫాన్ అలీ అలియాస్ ఇమ్ము రంజాన్ అలీని పోలీసులు అరెస్టు చేయగా.. ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం నిందితుల నుంచి రూ. 6.5 లక్షల విలువైన విలాసవంతమైన డిజైనర్ ట్యాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

YouTube Shorts‌లో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!

YouTube Shorts‌: ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన వీడియో షేరింగ్ ప్లాట్‌ఫామ్...

ಪ್ರೇಯಸಿಗೆ ಚಾಕು ಇರಿತ:  ಕಾರು ಸ್ಫೋಟಿಸಿಕೊಂಡು ಪಾಗಲ್ ಪ್ರೇಮಿ ಆತ್ಮಹತ್ಯೆ

ತುಮಕೂರು,ಜೂನ್,27,2026 (www.justkannada.in):  ತನ್ನ ಪ್ರೇಯಸಿಯನ್ನು ಅಪಹರಿಸಿದ ಪಾಗಲ್ ಪ್ರೇಮಿಯೊಬ್ಬ ಆಕೆಗೆ...

മുഖ്യമന്ത്രിയുടെ നിര്‍ദേശമില്ലാതെയാണ് വി.സി നിയമനമെന്ന് വിശ്വസിക്കുന്ന യു.ഡി.എഫ് അണികളും വിസ്മയത്തിന്റെ ഇരകള്‍: എസ്.എഫ്.ഐ

തിരുവനന്തപുരം: കാര്‍ഷിക സര്‍വകലാശാല വൈസ് ചാന്‍സിലറായി ബി.ജെ.പി അനുകൂല സംഘടനാ നേതാവിനെ...

Congress: மாணிக்கம் தாகூர் தலைவராக நியமனம்; தமிழ்நாடு காங்கிரஸ் கமிட்டியில் அதிரடி மாற்றம்!

தமிழ்நாடு காங்கிரஸ் தலைவராக மாணிக்கம் தாகூர் நியமிக்கப்பட்டுள்ளார். இதற்கு முன் செல்வப்பெருந்தகை...