5
June, 2026

A News 365Times Venture

5
Friday
June, 2026

A News 365Times Venture

Virat Kohli Injured: టీమిండియాకు భారీ షాక్.. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు కోహ్లీ దూరం.!

Date:

Virat Kohli Injured: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. జూన్ 13 నుంచి 20 వరకు భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుండగా.. ఈ సిరీస్‌ కు కోహ్లీ అందుబాటులో ఉండరు. ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు తరఫున ఆడిన కోహ్లీ ఈ గాయానికి గురైనట్లు తెలుస్తోంది. ఫైనల్లో 42 బంతుల్లో 75 పరుగులు చేసి అజేయంగా నిలిచిన కోహ్లీ, జట్టును వరుసగా రెండో టైటిల్ గెలిచేలా చేశాడు. అయితే మ్యాచ్ చివరి దశలో పరుగులు తీసే సమయంలో అసౌకర్యంగా కనిపించిన కోహ్లీ, అప్పటికే హ్యామ్‌స్ట్రింగ్ సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.

ఐపీఎల్ 2026 సీజన్‌లో కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 16 మ్యాచ్‌ల్లో 675 పరుగులు సాధించాడు. ఈ ఫామ్‌ను ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌లోనూ కొనసాగించి.. 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో తన అవకాశాలను మరింత బలపర్చుకోవాలని కోహ్లీ భావించాడు. అయితే గాయం అతని ప్రణాళికలకు అడ్డంకిగా మారింది. భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ 2027 వన్డే ప్రపంచకప్ సన్నాహకాలకు తొలి అడుగుగా భావిస్తున్నారు. జూన్ 6 నుంచి ఒక టెస్ట్ మ్యాచ్‌తో పాటు మూడు వన్డేల సిరీస్ జరగనుంది. టెస్ట్, వన్డే జట్లకు శుబ్ మన్ గిల్ నాయకత్వం వహించనున్నాడు.

వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ, కోహ్లీ మళ్లీ భారత జెర్సీలో కనిపించాల్సి ఉండగా.. ఇప్పుడు కోహ్లీ గాయంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అతని స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనే దానిపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ జూన్ 6న న్యూ చండీగఢ్‌లో జరిగే ఏకైక టెస్టుతో ప్రారంభమవుతుంది. అనంతరం జూన్ 13న ధర్మశాలలో తొలి వన్డే, జూన్ 17న లక్నోలో రెండో వన్డే, జూన్ 20న చెన్నైలో మూడో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അമേരിക്കൻ സൈനിക രഹസ്യങ്ങൾ ഇസ്രഈലിലേക്ക്? നിർണായക നീക്കത്തിന് പിന്നിൽ ‘നെതന്യാഹു പ്ലാൻ’; കത്ത് പുറത്ത്

ടെൽ അവീവ്: അമേരിക്കയും ഇസ്രഈലും തമ്മിലുള്ള സൈനിക ബന്ധം പുനർനിർമിക്കാനുള്ള നീക്കത്തിന്...

இந்தியா கூட்டணி: “காங்கிரஸ் பங்கேற்கும் கூட்டத்தில் திமுக பங்கேற்காது" – திமுக திட்டவட்ட அறிவிப்பு!

5 மாநில தேர்தல் முடிவுகளுக்குப் பிறகு, காங்கிரஸ் தலைமையில் 'இந்தியா' கூட்டணிக்...

Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?

Story Board: తెలంగాణ ఏర్పాటై పన్నెండేళ్లు గడిచింది. ఉద్యమ ఆకాంక్షలు ఏ...

ಸಿಎಂ ಬದಲಾವಣೆ: ಹೈಕಮಾಂಡ್ ನಿರ್ಧಾರಕ್ಕೆ ಎಲ್ಲರೂ ಒಪ್ಪಿದ್ದಾರೆ- ಕೆ.ಎನ್ ರಾಜಣ್ಣ

ಬೆಂಗಳೂರು,ಜೂನ್,4,2026 (www.justkannada.in): ಸಿಎಂ ಬದಲಾವಣೆ ಆಗುವುದಿಲ್ಲ ಎಂಬ ನಿರೀಕ್ಷೆ ಇತ್ತು....