21
September, 2026

A News 365Times Venture

21
Monday
September, 2026

A News 365Times Venture

Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు

Date:

Off The Record: పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ఇక్కడి నుంచి హ్యాట్రిక్‌ కొట్టారాయన. తొలి నుంచి టీడీపీలోనే ఉన్నప్పటికీ 2014లో ఫస్ట్‌టైం పోటీ చేసే అవకాశం వచ్చింది. బొడ్డు ఫ్యామిలీ సైకిల్‌ దిగేసి ఫ్యాన్ పంచన చేరడంతో చినరాజప్పకు ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. తొలిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ… 2014 నుంచి 19 వరకు ఉన్న టిడిపి ప్రభుత్వంలో హోం మంత్రిగా ,డిప్యూటీ సీఎంగా రాజప్పకు బాగానే కలిసి వచ్చింది.. అయితే సామాజిక సమీకరణాల దృష్ట్యా ఆయనకు ఈసారి అమాత్య యోగం దక్కలేదు. కాకినాడ జిల్లా నుంచి జనసేన తరపున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహించడంతో ఈ విడత జిల్లాలో టిడిపి నేతలకు అవకాశం దక్కలేదు. ఈ క్రమంలో… ఇటీవల పార్టీ పరంగా కూడా భారీ మార్పులు జరిగాయి. ఆ సందర్భంగా పొలిట్ బ్యూరోలో ఉన్న రాజప్పను ఆ పదవి నుంచి తప్పించేశారు. దాంతో… గతంలో పెద్ద పదవులు అనుభవించిన రాజప్పను పార్టీ చిన్నవాడిని చేసేసిందని అనుకుంటున్నారట అనుచరులు.. మరోవైపు ఆయనకు మళ్ళీ పోటీ చేసే అవకాశం ఉండకపోవచ్చనే చర్చ కూడా మొదలైంది. పార్టీలో యువత, మహిళలకు ప్రాధాన్యత పెరుగుతోంది కాబట్టి… లాస్ట్‌ ఛాన్స్‌గా తనకు ఈసారి పునర్‌వ్యవస్థీకరణలో తనకు మంత్రి పదవి ఇవ్వాలని అడుగుతున్నారట నిమ్మకాయల. అందుకోసం తెగ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

తొలి నుంచి పార్టీలో ఉన్నాను కాబట్టి హ్యాపీ రిటైర్మెంట్ ఇవ్వాలంటూ టీడీపీ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారట. కాపు కోటాలో అవకాశం రాకపోతే…. కనీసం విధేయత కోటాలో అయినా ఇవ్వాలంటూ మొరపెట్టుకుంటున్నట్టు తెలిసింది. కానీ… అట్నుంచి అంత సీన్‌ లేదన్న సమాధానమే వినిపిస్తోందట. ఈసారి జిల్లా నుంచి పార్టీ పొలిట్ బ్యూరోలో రాజప్పను తప్పించి అదే సామాజిక వర్గానికి చెందిన జ్యోతుల నెహ్రూకి అవకాశం ఇచ్చారు. మంత్రి పదవి ఇచ్చే విషయంలో పోటీ రాకుండా… పెద్దలు అలాంటి నిర్ణయం తీసుకున్నట్టు రాజప్ప వర్గం పైకి చెప్పుకుంటున్నా….జరుగుతున్న పరిణామాలతో ఆయన మాత్రం అంత కంఫర్ట్ గా లేరన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మంత్రులుగా రెండేళ్లు పూర్తి చేశారు, సామాజిక సమీకరణలు అంటూ సీనియర్ల నోళ్లు నొక్కేశారు… యంగ్ టీమ్ ఏం ఉద్ధరించిందో చెప్పాలని అంటున్నట్టు తెలిసింది. అలాగే… మరికొన్ని విషయాలను కూడా గుర్తు చేస్తున్నారట మాజీ హోం మంత్రి. గత ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతగా అరెస్ట్‌ అయినప్పుడు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు సీఎం చంద్రబాబు. ఆ సమయంలో టీడీపీ వ్యవహారాలన్నీ రాజమండ్రి కేంద్రంగానే నడిచాయి.. పార్టీ తరపున ఒక క్యాంపు కూడా ఏర్పాటు చేశారు. అప్పుడు తనను క్యాంప్ ఇంఛార్జిగా ఉండమన్నారని, చంద్రబాబు జైల్లో ఉంటే తాను ఇంటి ముఖం కూడా చూడకుండా రాజమండ్రిలోనే ఉన్నానంటూ గతాన్ని గుర్తు చేస్తున్నారట రాజప్ప.

నాడు వైసీపీలో ఉన్న ఆనం ,పార్థసారథి, సుభాష్ వంటి వారు ప్రస్తుతం క్యాబినెట్‌లో ఉన్నారు. కానీ… నాకు మాత్రం అవకాశం ఇవ్వలేదంటూ తెగ ఫీలైపోతున్నట్టు తెలుస్తోంది. అసలు రాజకీయాలంటేనే ఇంతే. ఎంత కష్టపడ్డా బూడిదలో పోసిన పన్నీరు చేసేస్తారంటూ నిర్వేదపు మాటలు మాట్లాడుతున్నారట. మరోవైపు ఒక వర్గం మాత్రం చినరాజప్పకు పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారట.. ప్రతి సందర్భంలోనూ అందరికీ కలిసి రాదంటూ గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు పదవి రానంత మాత్రాన అంత పెదవి విరుపు పనికిరాదని సెటైర్లు వేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పెడితే పెళ్లి పెట్టకపోతే చావు కోరడం మంచి పద్ధతి కాదంటూ చిన రాజప్పకు కౌంటర్స్ వేస్తున్నారు. ఇక ఆయన సైడ్ అయి సర్దుకోవడం బెటర్ అని స్మూత్ గా ఆయింట్మెంట్ రాసేస్తున్నారట ొకందరు. మొత్తానికి చినరాజప్ప పెద్ద పదవి కోసం గట్టిగానే లాబీయింగ్ చేస్తున్నారు.. ఈసారికి అలా కానిచ్చేసి నన్ను గుర్తించండి ప్లీజ్ అంటున్నారు.. పార్టీ నుంచి మాత్రం సైడ్ చేసే సూచనలే కనిపిస్తున్నాయి.. ఆ 52 డేస్ సెంటిమెంట్ డైలాగ్ తో మరోసారి పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు చినరాజప్ప.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഹിന്ദു സംസ്‌കാരത്തെ അപമാനിക്കുന്നതും പാരമ്പര്യത്തെ തകര്‍ക്കുന്നതും; ഹിന്ദു വര്‍ഗീയതയ്‌ക്കെതിരായ ഹാമിദ് അന്‍സാരിയുടെ പരാമര്‍ശത്തിനെതിരെ യോഗി

ന്യൂഡല്‍ഹി: മുന്‍ ഉപരാഷ്ട്രപതി ഹമീദ് അന്‍സാരിയുടെ ‘ഹിന്ദു വര്‍ഗീയത’യുമായി ബന്ധപ്പെട്ട പരാമര്‍ശങ്ങള്‍ക്കെതിരെ...

`இன்னும் பழைய அரசாங்கத்தையே குறைச் சொல்லிக்கொண்டிருப்பதில் நியாயமில்லை' – விஜய்யை சாடிய எல்.முருகன்

மத்திய இணை அமைச்சர் எல்.முருகன், வேலூரில் செய்தியாளர்களைச் சந்தித்தார். அப்போது அவர்...

Praful Hinge: SRH పేసర్ ప్రఫుల్ హింగేకు అరుదైన అవకాశం.. భారత్ ‘ఏ’ జట్టులోకి ఎంట్రీ..

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడి ఒక్కరోజే సంచలనంగా మారిన యువ...

ಗಣೇಶೋತ್ಸವವನ್ನು ರಾಜಕೀಯ ಸಂಘರ್ಷದ ವೇದಿಕೆಯನ್ನಾಗಿಸಬಾರದು: ಎಚ್.ಎ. ವೆಂಕಟೇಶ್

  ಮೈಸೂರು, SEP.20,2026: ರಾಜ್ಯದಲ್ಲಿ ಗಣೇಶೋತ್ಸವ ಹಾಗೂ ವಿಸರ್ಜನಾ ಮೆರವಣಿಗೆಗಳ ಸಂದರ್ಭದಲ್ಲಿ...