25
May, 2026

A News 365Times Venture

25
Monday
May, 2026

A News 365Times Venture

NEET UG 2026 Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్ ప్రక్రియ ప్రారంభం.. చివరి తేదీ మే 27..

Date:

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే ‘నీట్ యూజీ 2026’ పరీక్ష వివాదాల నడుమ ఒక కీలక నిర్ణయానికి వచ్చింది. గత మే 3న దేశవిదేశాల్లోని వందలాది నగరాల్లో దాదాపు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. అయితే, పరీక్ష జరిగిన వెంటనే పేపర్ లీక్ ఆరోపణలు, ఇతర అక్రమాలు వెలుగుచూడటంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఈ వ్యవహారంపై సీబీఐ (CBI) దర్యాప్తు కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో పారదర్శకతను కాపాడటానికి పాత పరీక్షను రద్దు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA), జూన్ 21న తిరిగి పరీక్ష (Re-exam) నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలోనే అభ్యర్థుల ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఫీజు రీఫండ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించింది.

నీట్ యూజీ 2026 అభ్యర్థుల కోసం ఎన్‌టీఏ అధికారిక రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో ప్రత్యేక రీఫండ్ లింక్‌ను అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను ఉపయోగించి దీనిని యాక్సెస్ చేయవచ్చు. అభ్యర్థులు తమ రీఫండ్ మొత్తాన్ని పొందడానికి పోర్టల్‌లో ఖచ్చితంగా నమోదు చేయాల్సిన వివరాలు ఏవంటే.. బ్యాంక్ అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సీ (IFSC) కోడ్, బ్యాంక్ పేరు, క్యాన్సిల్ చెక్ ఫొటో కాపీ కచ్చితంగా ఉండాలి.

బ్యాంక్ వివరాలను సమర్పించడానికి మే 22 నుంచి మే 27, 2026 వరకు సమయం కేటాయించారు. మే 27వ తేదీ రాత్రి 11:50 గంటలకు ఈ పోర్టల్ లింక్ ముగుస్తుంది. వివరాలు ఒకసారి సమర్పించిన తర్వాత మార్పులకు అవకాశం ఉండదు. దేశవ్యాప్తంగా 551 నగరాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో గతంలో జరిగిన పరీక్ష రద్దయినందున, జూన్ 21న తిరిగి కొత్తగా పరీక్షను నిర్వహించనున్నారు. అక్రమాల వల్ల నష్టపోయిన అర్హులైన విద్యార్థులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం ఈ రీ-ఎగ్జామ్, ఫీజు రీఫండ్ నిర్ణయం తీసుకుంది. అభ్యర్థులు గడువు ముగిసేలోపు తమ బ్యాంక్ వివరాలను సరిచూసుకుని సమర్పించాలని అధికారులు సూచించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മധു കൊലപാതകം: 12 പ്രതികളുടെ ശിക്ഷ ജീവപര്യന്തമാക്കി വര്‍ധിപ്പിച്ചു

കൊച്ചി: അട്ടപ്പാടിയില്‍, ആള്‍ക്കൂട്ട ആക്രമണത്തില്‍ ആദിവാസി യുവാവ് മധു കൊല്ലപ്പെട്ട കേസില്‍...

மேகதாது: `தமிழர்களுக்கு எந்த வகையிலும் துரோகம் இழைக்கக் கூடாது என்பதில்…' – அமைச்சர் பி.விஸ்வநாதன்

தமிழ்நாட்டின் புதிய உயர்கல்வித்துறை அமைச்சராகப் பொறுப்பேற்றுள்ள காங்கிரஸ் கட்சியின் பி.விஸ்வநாதன், மதுரை...

ಇಂಧನ ಬೆಲೆ ಏರಿಕೆ: ಪ್ರಧಾನಿ ಮೋದಿಯಿಂಧ ಜನಸಾಮಾನ್ಯರ ಲೂಟಿ- ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು, ಮೇ, 25,2026 (www.justkannada.in):  ಮೋದಿಯವರು ಪ್ರಧಾನಿ ಆದ ಬಳಿಕ...

യു.എസ് ഉപരോധത്തെ അതിജീവിക്കാന്‍ ചൈനീസ് സഹായം; ക്യൂബയിലേക്ക് ആദ്യഘട്ട അരി വിഹിതമെത്തി, നന്ദിയറിയിച്ച് പ്രസിഡന്റ്

  ഹവാന: അമേരിക്കന്‍ ഉപരോധത്തെത്തുടര്‍ന്ന് രാജ്യം കടുത്ത സാമ്പത്തിക പ്രതിസന്ധി നേരിടുന്ന...