21
May, 2026

A News 365Times Venture

21
Thursday
May, 2026

A News 365Times Venture

KKR Vs MI: కేకేఆర్ బౌలర్ల ధాటికి ముంబై విలవిల.. కోల్‌కతా టార్గెట్ ఎంతంటే..

Date:

ఐపీఎల్ 2026 లీగ్ దశలో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరుగుతున్న 65వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ ముగిసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్.. కేకేఆర్ బౌలర్ల అద్భుత ప్రదర్శన, బ్యాక్ టు బ్యాక్ వికెట్లు కోల్పోవడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయ లక్ష్యం 148 పరుగులుగా నమోదైంది.

మొదట్లో వర్షం కారణంగా మ్యాచ్ కాసేపు ఆగిపోయే సమయానికి 4 వికెట్లకు 57 పరుగులతో కష్టాల్లో పడ్డ ముంబైని మిడిలార్డర్ బ్యాటర్లు ఆదుకునే ప్రయత్నం చేశారు. కెప్టెన్ హార్దిక్ పాండ్యా 27 బంతుల్లో 26 పరుగులు చేయగా, తిలక్ వర్మ 32 బంతుల్లో 20 పరుగులు చేసి కాస్త నెమ్మదిగా ఆడారు. అయితే చివర్లో కార్బిన్ బోష్ కేవలం 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడంతో ముంబై ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. విల్ జాక్స్ (14), దీపక్ చాహర్ (10) పరుగులు చేశారు. కేకేఆర్ బౌలర్లలో కేమరూన్ గ్రీన్, సౌరభ్ దూబే, కార్తీక్ త్యాగి తలో రెండు వికెట్లు పడగొట్టి ముంబైని కట్టడి చేశారు. ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే కేకేఆర్‌కు ఈ 148 పరుగుల ఛేజింగ్ అత్యంత కీలకం కానుంది.

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

14 വർഷങ്ങൾക്ക് ശേഷം ഇങ്ങനെയൊന്ന് ആദ്യം; വമ്പൻ നാണക്കേടിൽ തിലക്

ഐ.പി.എല്ലിൽ കൊൽക്കത്ത നൈറ്റ് റൈഡേഴ്സും മുംബൈ ഇന്ത്യൻസും ഈഡൻ ഗാർഡൻസിൽ ഏറ്റുമുട്ടുകയാണ്....

'ரஹ்மான் கலி' டு 'ராம் கலி' : 80 ஆண்டுகளுக்குப் பின் பழைய பாரம்பர்யத்தை மீட்டெடுக்கும் பாகிஸ்தான்!

பாகிஸ்தான் அரசு தன் நாட்டின் பழமையை பாதுகாக்கும் வகையில் தன் நாட்டின்...

ಇಡೀ ದೇಶವನ್ನೇ ಮುಳುಗಿಸಿ ಬಿಟ್ಟಲ್ರಿ- ಮೋದಿ ವಿರುದ್ದ ಸಚಿವ ಸಂತೋಷ್ ಲಾಡ್ ಕಿಡಿ

ಬೆಂಗಳೂರು,ಮೇ,20,2026 (www.justkannada.in): ಪಾಕಿಸ್ತಾನಕ್ಕಿಂತ ಕೆಟ್ಟ ಪರಿಸ್ಥಿತಿಯಲ್ಲಿ ಭಾರತದ ಕರೆನ್ಸಿ ಇದೆ....