21
May, 2026

A News 365Times Venture

21
Thursday
May, 2026

A News 365Times Venture

Gulab Lassi Recipe: హీట్‌కు చెక్‌ పెట్టే షాహీ గులాబ్ లస్సీ.. ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి..!

Date:

Gulab Lassi Recipe: వేసవి కాలంలో మండే ఎండలు, వడగాల్పుల నుంచి ఉపశమనం పొందాలంటే చల్లటి పానీయాలే ఉత్తమ మార్గం. అలాంటి వాటిలో లస్సీకి ప్రత్యేక స్థానం ఉంది. అయితే ప్రతిరోజూ అదే సాధారణ లస్సీ తాగి విసిగిపోయారా? అయితే ఈసారి రుచికరమైన, సువాసనభరితమైన షాహీ గులాబ్ లస్సీని ట్రై చేయండి. గులాబీ రేకుల సువాసన, రోజ్ సిరప్ తీపి, మీగడ క్రీమీనెస్ కలిసిన ఈ పింక్ లస్సీ ఒక్కసారి తాగితే మళ్లీ మళ్లీ కావాలనిపిస్తుంది.

ఇంటికి వచ్చే అతిథులకు లేదా పిల్లలకు కొత్తగా ఏదైనా స్పెషల్‌గా ఇవ్వాలనుకుంటే ఈ గులాబ్ లస్సీ అద్భుతమైన ఎంపిక. అందమైన గులాబీ రంగుతో పాటు రాజసంగా కనిపించే ఈ లస్సీ వేసవి వేడిని తగ్గించడమే కాకుండా శరీరానికి చల్లదనాన్ని కూడా అందిస్తుంది. మండుటెండల్లో ఇది ఉత్తమ ఎంపికగా కూడా చెప్పవచ్చు..

షాహీ గులాబ్ లస్సీకి కావలసిన పదార్థాలు
* తాజా చిక్కటి పెరుగు – 2 కప్పులు
* రూహ్ అఫ్జా లేదా రోజ్ సిరప్ – 3 నుంచి 4 టేబుల్ స్పూన్లు
* చల్లటి చిక్కటి పాలు – ¼ కప్పు
* పంచదార లేదా పొడి పంచదార – రుచికి తగినంత
* గులాబీ నీరు – అర టీస్పూన్
* తాజా మీగడ – 2 టేబుల్ స్పూన్లు
* సన్నగా తరిగిన జీడిపప్పు, బాదం, పిస్తా – 2 టీస్పూన్లు
* ఎండిన లేదా తాజా గులాబీ రేకులు – అలంకరణ కోసం
* ఐస్ క్యూబ్స్ – అవసరమైనంత

తయారీ విధానం
ముందుగా ఒక బ్లెండర్ జార్‌లో తాజా చిక్కటి పెరుగును వేసుకోవాలి. అందులో చల్లటి పాలు, రోజ్ సిరప్ లేదా రూహ్ అఫ్జా, పంచదార, గులాబీ నీరు కలపాలి. తరువాత దీన్ని మిక్సర్‌లో 10 నుంచి 15 సెకన్ల పాటు మాత్రమే తిప్పాలి లేదా కవ్వంతో బాగా చిలకాలి. ఎక్కువసేపు బ్లెండ్ చేస్తే పెరుగు నీరుగా మారే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకుని దాని అంచులపై చెంచాతో కొద్దిగా రోజ్ సిరప్ జల్లాలి. దీంతో గ్లాస్ అందంగా కనిపిస్తుంది. తరువాత గ్లాస్‌లో 2 నుంచి 3 ఐస్ క్యూబ్స్ వేయాలి. తయారైన చిక్కటి గులాబీ రంగు లస్సీని గ్లాసులో పోసి, పైన ఒక చెంచా చల్లటి మీగడ వేయాలి. తరువాత తరిగిన బాదం, జీడిపప్పు, పిస్తా పప్పులతో అలంకరించాలి. చివరగా గులాబీ రేకులు చల్లి చల్లగా సర్వ్ చేస్తే రుచికరమైన షాహీ గులాబ్ లస్సీ సిద్ధం. ఈ ప్రత్యేక లస్సీ వేసవిలో శరీరానికి తక్షణ చల్లదనాన్ని అందించడమే కాకుండా, అతిథులను కూడా ఆకట్టుకునే అద్భుతమైన డ్రింక్‌గా నిలుస్తుంది.. వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പശ്ചിമേഷ്യൻ പ്രതിസന്ധി: ഹൈക്കോടതികളോട് ഓൺലൈനായി വാദം കേൾക്കാൻ ആവശ്യപ്പെട്ട് ചീഫ് ജസ്റ്റിസ്

ന്യൂദൽഹി: പശ്ചിമേഷ്യയിലെ സംഘർഷം മൂലം ഇന്ധന പ്രതിസന്ധി അനുഭവിക്കുന്നതിനാൽ രാജ്യത്തെ ഹൈക്കോടതികൾക്ക്...

“நான் ஆசிரமத்துக்குப் போகிறேன்… இனி அங்குதான் இருப்பேன்!" – பிரசாந்த் கிஷோரின் அதிரடி முடிவு

தேர்தல் வியூகவகுப்பாளரும், ஜன சுராஜ் கட்சியின் நிறுவனருமான பிரசாந்த் கிஷோர், பாட்னாவின்...

Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీకి బిగ్ షాక్.. “ఎక్స్” అకౌంట్ నిలిపివేత..

Cockroach Janata Party: ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్...

ದ್ವಿತೀಯ ಪಿಯುಸಿ ಪರೀಕ್ಷೆ-2 ಫಲಿತಾಂಶ ಪ್ರಕಟ

ಬೆಂಗಳೂರು,ಮೇ,21,2026 (www.justkannada.in): ದ್ವಿತೀಯ ಪಿಯುಸಿ ಪರೀಕ್ಷೆ-2  ಫಲಿತಾಂಶವನ್ನು ಇಂದು ಶಿಕ್ಷಣ...