12
May, 2026

A News 365Times Venture

12
Tuesday
May, 2026

A News 365Times Venture

Viral Road Accident: అరె బాబు.. బైకును అక్కడ ఎలా పార్క్ చేశావయ్యా.!

Date:

Road Accident: కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సరీ-డెల్టా సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఓ మోటార్‌సైకిల్ ట్రాఫిక్ సిగ్నల్ పైకి ఎగిరి వేలాడుతూ కనిపించడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ ప్రమాదంలో బైక్ రైడర్ తీవ్రంగా గాయపడగా, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు స్థానికులు. పోలీసుల సమాచారం ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్కాట్ రోడ్, 72వ అవెన్యూ, 120వ స్ట్రీట్ జంక్షన్ వద్ద కారు-బైక్ ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో మోటార్‌సైకిల్ గాల్లోకి ఎగిరి ట్రాఫిక్ సిగ్నల్ పోల్‌కు చిక్కుకుని వేలాడుతూ నిలిచిపోయింది.

ఈ విచిత్ర దృశ్యానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రోడ్డుపై ప్రయాణిస్తున్నవారు ఒక్కసారిగా ఆగి పైకి వేలాడుతున్న బైక్‌ను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అత్యవసర సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తీసుకుని బైక్‌ను కిందికి దించే ప్రయత్నాలు చేపట్టారు. ఇక ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికుడు విలియం చాన్ మాట్లాడుతూ.. మొదట రోడ్డుమధ్యలో ధ్వంసమైన కారును చూశానని, తర్వాత పైకి చూసి ట్రాఫిక్ సిగ్నల్‌కు వేలాడుతున్న బైక్‌ను చూసి షాక్ అయ్యానని తెలిపాడు.

డెల్టా పోలీస్ విభాగం తెలిపిన వివరాల ప్రకారం.. బైక్ రైడర్‌కు తీవ్ర గాయాలు అయినప్పటికీ ప్రాణాపాయం లేదని వెల్లడించారు. కారులో ఉన్న డ్రైవర్‌కు ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. ప్రమాదం తర్వాత స్కాట్ రోడ్‌ను 70వ అవెన్యూ నుంచి 72వ అవెన్యూ వరకు పూర్తిగా మూసివేశారు. రోడ్డుపై పడిన శిథిలాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు అధికారులు గంటల పాటు శ్రమించారు. ఇక వీడియోలు, ఫోటోలు చూసిన వారు అసలు ఆ బైకు అంత ఎత్తులో నిలబెట్టావ్ బాస్ అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

മുഖ്യമന്ത്രി പ്രഖ്യാപനം: പുറത്തിറങ്ങാന്‍ കഴിയാത്ത അവസ്ഥയെന്ന് ടി.വി. ഇബ്രാഹിം; കോണ്‍ഗ്രസിനെതിരെ കടുത്ത അതൃപ്തി

തിരുവനന്തപുരം: കേരളത്തില്‍ നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ യു.ഡി.എഫ് മികച്ച വിജയം കൈവരിച്ചിട്ടും മുഖ്യമന്ത്രി...

”ஆளுங்கட்சியில் இருப்பதுதான் சேஃப்”- அமமுக-வில் இருந்து நீக்கம்; பொங்கிய எஸ்.காமராஜ்!

அதிமுக கூட்டணியில் அமமுக சார்பில் மன்னார்குடியில் போட்டியிட்டு வெற்றி பெற்றவர் எஸ்.காமராஜ்....

CM Vijay: జ్యోతిష్యుడికి కీలక పోస్టు.. సీఎం విజయ్ వైఖరిపై మిత్రపక్షాల్లో ఆగ్రహం..

CM Vijay: తమిళనాడులో మరో వివాదం రాజుకుంది. జ్యోతిష్యుడు, విజయ్ వ్యక్తిగత...

ಸಾರಿಗೆ ನೌಕರರಿಗೆ ಗುಡ್ ನ್ಯೂಸ್ : ಶೇ.12.5 ರಷ್ಟು ವೇತನ ಹೆಚ್ಚಳ ಮಾಡಿ ಆದೇಶ

ಬೆಂಗಳೂರು,ಮೇ,12,2026 (www.justkannada.in):  ವೇತನ ಪರಿಷ್ಕರಣೆಗೆ  ಆಗ್ರಹಿಸಿ ಪ್ರತಿಭಟನೆಗೆ ಮುಂದಾಗಿದದ ಸಾರಿಗೆ...