7
May, 2026

A News 365Times Venture

7
Thursday
May, 2026

A News 365Times Venture

Bus Fitness Certificates: స్కూల్ బస్సులపై ప్రత్యేక తనిఖీలు.. వందల సంఖ్యలో ఫిట్‌నెస్ లేని బస్సులు!

Date:

తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్, కాలేజీ బస్సులపై రవాణా శాఖ ప్రత్యేక తనిఖీలు చేపట్టింది. రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 108 బస్సులను అధికారులు పరిశీలించారు. ఈ తనిఖీలలో భద్రతా ప్రమాణాలు, పత్రాల సక్రమత వంటి అంశాలను సమగ్రంగా పరిశీలిస్తున్నారు. తనిఖీల సందర్భంగా లోపాలు గుర్తించిన వాహనాలకు నోటీసులు జారీ చేసిన అధికారులు.. ఫిట్‌నెస్ లేని బస్సులను తక్షణమే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.

ఈ నెల 15లోపు సంబంధిత వాహనాలను తిరిగి ఇన్‌స్పెక్షన్‌కు హాజరుచేసి.. ATS సెంటర్‌లో ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పొందడం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. జిల్లాలో మొత్తం 1705 స్కూల్ బస్సులు ఉండగా.. వాటిలో 1318 బస్సులకు మాత్రమే ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన 387 బస్సులు ఫిట్‌నెస్ లేనివిగా గుర్తించారు. విద్యార్థుల భద్రత దృష్ట్యా అన్ని స్కూల్, కాలేజీ యాజమాన్యాలు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా రవాణా అధికారి ఆర్. సురేష్ సూచించారు. రవాణా శాఖకు పూర్తి సహకారం అందించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

 

 

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ടി.വി.കെയുമായുള്ള സഖ്യം ബി.ജെ.പിയെ തടയാന്‍; ഡി.എം.കെയുമായുള്ള ബന്ധം അവസാനിച്ചിട്ടില്ല: മാണിക്കം ടാഗോര്‍

  ചെന്നൈ: തമിഴ്നാട് രാഷ്ട്രീയത്തിലെ പുതിയ സാഹചര്യത്തില്‍ വിജയ്‌യുടെ തമിഴക വെട്രി...

'ஆயிரம் ஆண்டுகளாய் புறக்கணிக்கப்பட்டவர்களை.!' – திருமாவுக்கு முதல்வர் பதவி கேட்கும் சிந்தனைச்செல்வன்

தவெக தலைவர் ஆட்சி அமைக்கப்போகிறாரா... அதிமுக பொதுச்செயலாளர் கே.பழனிசாமி ஆட்சி அமைக்க...

ಸಿಎಂ ಬದಲಾವಣೆ ಗೊಂದಲ: ಹೈಕಮಾಂಡ್  ಅತಿಬೇಗ ನಿರ್ಧಾರ ಕೈಗೊಳ್ಳಲಿ- ಕೆ.ಎನ್ ರಾಜಣ್ಣ

ಮೈಸೂರು,ಮೇ,7,2026 (www.justkannada.in): ಸಿಎಂ ಬದಲಾವಣೆ ಗೊಂದಲ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ  ಹೈಕಮಾಂಡ್...