28
April, 2026

A News 365Times Venture

28
Tuesday
April, 2026

A News 365Times Venture

Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!

Date:

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఒక భారీ అడ్వెంచర్ డ్రామాలో నటిస్తున్నారు. ‘వారణాసి’ టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రం మహేష్‌ను గ్లోబల్ ఐకాన్‌గా మార్చడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అయితే ఈ సినిమా తర్వాత మహేష్ తదుపరి లైనప్ గురించి వస్తున్న వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

రాజమౌళి తర్వాత మహేష్ బాబు సుదీర్ఘ గ్యాప్ తీసుకోకుండా, బ్యాక్-టు-బ్యాక్ మూడు సినిమాలను లైన్‌లో పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో ఊహించని బజ్ వినిపిస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, రాజమౌళి సినిమా పూర్తయిన వెంటనే మహేష్ తన తదుపరి చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై చేయనున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు ముగిశాయని, అడ్వాన్స్ కూడా చేతులు మారిందని టాక్ వినిపిస్తోంది. ఇది భారీ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతుందని సమాచారం. దీంతో పాటుగా సుకుమార్ లేదా సందీప్ రెడ్డి వంగా వంటి దర్శకులతో మహేష్ సినిమాలు ఉండే అవకాశం ఉందని రూమర్స్ వస్తున్నాయి.

అలాగే తన సొంత బ్యానర్ జి. మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్స్ పైన కూడా ఒక విభిన్నమైన కథను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నారట. జక్కన్న రాజమౌళి ఈ సినిమా షూటింగ్‌ను అత్యంత శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7, 2027న పాన్ వరల్డ్ లెవల్లో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. హాలీవుడ్ స్థాయి విజువల్స్ మహేష్ కొత్త లుక్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

യുദ്ധത്തിൽ ഇറാനോട് അനുഭാവം പ്രകടിപ്പിച്ചു; 69 പേരുടെ പൗരത്വം റദ്ദാക്കി ബഹ്‌റൈൻ

മനാമ: ഇറാനോട് അനുഭാവം പ്രകടിപ്പിച്ചുവെന്നും വിദേശ ശക്തികളെ സഹായിച്ചുവെന്നും ആരോപിച്ച് 69...

ಜಿಲ್ಲಾ ಖಜಾನೆ ಉಪನಿರ್ದೇಶಕರಿಗೆ ‘ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಸರ್ವೋತ್ತಮ ಸೇವಾ ಪ್ರಶಸ್ತಿ’: ಏ.30 ರಂದು ಪ್ರದಾನ

ಮಂಡ್ಯ,ಏಪ್ರಿಲ್,27,2026 (www.justkannada.in):  2026ನೇ ಸಾಲಿನ ಜಿಲ್ಲಾ ಮಟ್ಟದ ಸರ್ವೋತ್ತಮ ಸೇವಾ...

75 സീറ്റുകളുമായി അധികാരത്തിലേറും; എല്‍.ഡി.എഫിന് ഭരണത്തുടര്‍ച്ചയെന്ന് എന്‍.എസ്. മാധവന്‍

കോഴിക്കോട്: 2026 നിയമസഭാ തെരഞ്ഞെടുപ്പില്‍ ഇടതുപക്ഷത്തിന് ഭരണത്തുടര്‍ച്ചയെന്ന് എഴുത്തുകാരന്‍ എന്‍.എസ്. മാധവന്‍....