22
April, 2026

A News 365Times Venture

22
Wednesday
April, 2026

A News 365Times Venture

Flight: గాల్లో ఉండగా విమానంలో కుదుపులు.. వెక్కి వెక్కి ఏడ్చిన ప్రయాణికులు.. వీడియో వైరల్

Date:

విమాన ప్రయాణం అంటే ఎవరికైనా సరదానే. కానీ ప్రయాణంలో ఒడిదుడుకులు ఎదురైతే ఎలా ఉంటుంది. కళ్ల ముందు చావు భీతి కనిపిస్తుంది. అచ్చం అలాంటి భయమే ఎదురైంది. విమానంలో గాల్లో ఉండగా సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా కుదుపులు ఏర్పడడంతో బెంబేలెత్తిపోయిన ప్రయాణికులు అరుపులు, కేకలతో వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌కు చెందిన IC3401 విమానం హైదరాబాద్ నుంచి హుబ్లీకి వెళ్తోంది. హుబ్లీకి దగ్గర పడుతున్న సమయంలో ఒక్కసారిగా విమానంలో సంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఒక్కసారిగా విమానం అదుపు తప్పింది. గగనతలంలో ఉండగా కుదుపులు ఏర్పడ్డాయి. దీంతో ఏం జరుగుతుందో తెలియక ప్రయాణికులు హడలెత్తిపోయారు. కొందరు గట్టిగా సీట్లను పట్టుకోగా.. మరికొందరు కేకలు వేశారు. ఇంకొందరు ఏడ్చేశారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వణికిపోయారు. కొందరి ప్రయాణికుల్లో చావు ముఖం కనిపించింది. మొత్తానికి 4 గంటల పాటు గాల్లో చక్కర్లు కొట్టాక.. బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో బతుకు జీవుడా అంటూ గుండెలు అరచేతిలో పెట్టుకుని కిందకు దిగి ఊపిరి పీల్చుకున్నారు.

అదృష్టవశాత్తు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులందరూ సురక్షితంగా దిగేశారు. కానీ ప్రయాణికుల్లో మాత్రం తీవ్ర భయాందోళనలు కనిపించాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

నివేదికల ప్రకారం… ఫ్లై91 ఎయిర్‌లైన్స్ విమానం ఆదివారం మధ్యాహ్నం సుమారు 3 గంటలకు హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరింది. ఇది సాయంత్రం 4:30 గంటలకు హుబ్బళ్లిలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే, విమానం హుబ్బళ్లిని సమీపిస్తుండగా సాంకేతిక సమస్య తలెత్తడంతో పైలట్లు ల్యాండింగ్ ప్రణాళికను మార్చుకోవలసి వచ్చింది.

Fe

విమానం ముండ్‌గోడ్, దావణగెరె, శివమొగ్గ వంటి ప్రాంతాలపై దాదాపు నాలుగు గంటల పాటు చక్కర్లు కొడుతూ గాలిలోనే ఉంది. ఈ సమయంలోనే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చి సురక్షితంగా ల్యాండ్ చేసేందుకు పైలట్లు ప్రయత్నించారు. రాత్రి 7:30 గంటల ప్రాంతంలో బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దించేశారు. ఆ సమయంలో విమానంలోని ప్రయాణికుల ఉద్రిక్త పరిస్థితులను కొందరు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా ప్రయాణికుల బంధువులు.. ఫ్లై91 ఎయిర్‌లైన్స్‌పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి సమాచారం లేదా అప్‌డేట్‌లు ఇవ్వలేదని.. సమాచార లోపం, నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.

 

View this post on Instagram

 

A post shared by News18.com (@cnnnews18)


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എന്തിനാണ് തീകൊണ്ട് കളിക്കുന്ന ഇത്തരം പൂരങ്ങള്‍; വെടിക്കെട്ട് ദുരന്തത്തില്‍ ആര്‍. ശ്രീലേഖ

തിരുവനന്തപുരം: തൃശ്ശൂര്‍മുണ്ടത്തിക്കോട് വെടിക്കെട്ട് അപകടത്തിന്റെ പശ്ചാത്തലത്തില്‍ പൂരങ്ങളിലെ അപകടകരമായ ആഘോഷങ്ങള്‍ക്കെതിരെ വിമര്‍ശനവുമായി...

தமிழகத்தில் பறக்கும் படை வேட்டையில் சிக்கியது இத்தனை கோடிகளா? – அர்ச்சனா பட்நாயக் வெளியிட்ட தகவல்

தமிழ்நாட்டில் இதுவரை பறிமுதல் செய்யப்பட்ட பரிசுப்பொருட்கள் மற்றும் பணம் குறித்த விவரங்களை...

Kharge vs BJP: మోడీ టెర్రరిస్ట్.. ఖర్గే వ్యాఖ్యలపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

ప్రధాని మోడీని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు...

ಪ್ರಧಾನಿ ಮೋದಿ ವಿರುದ್ದ ಆಕ್ಷೇಪಾರ್ಹ ಹೇಳಿಕೆ: ಖರ್ಗೆ ಅವರನ್ನ ವಜಾ ಮಾಡಿ-ಆರ್.ಅಶೋಕ್

ಬೆಂಗಳೂರು,ಏಪ್ರಿಲ್,22,2026 (www.justkannada.in): ಪ್ರಧಾನಿ ಮೋದಿ ಅವರ ಬಗ್ಗೆ ಅಕ್ಷೇಪಾರ್ಹ ಹೇಳಿಕೆ...