19
April, 2026

A News 365Times Venture

19
Sunday
April, 2026

A News 365Times Venture

SRH vs CSK: కాటేరమ్మ కొడుకుల కసివేట.. సీఎస్‌కేపై ఎస్‌ఆర్‌హెచ్ సూపర్ విక్టరీ..

Date:

SRH vs CSK: సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) మధ్య చివరి ఓవర్ వరకు ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ విజయం సాధించింది. వరుసగా వికెట్లు పడటంతో సీఎస్‌కే కుప్పకూలింది. సంజు శామ్సన్, శివమ్ దూబే రాణించలేకపోయారు. 18 ఏళ్ల ఆయుష్ మహాత్రే (30), మాథ్యూ షార్ట్(34) మినహా ఎవ్వరూ 30 పరుగులు సైతం చేయలేకపోయారు. ఆయుష్ మహాత్రే మంచి ఇన్నింగ్స్ ఆడగా.. గాయం కారణంగా మధ్యలోనే వెనుదిరిగాడు. ఎట్టకేలకు ఎస్‌ఆర్‌హెచ్ 10 పరుగుల తేడాతో గెలిచింది. చివర్లో జేమీ ఓవర్టన్ ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. చివరి ఓవర్‌లో ప్రఫుల్ హింజ్ మరోసారి నిరూపించుకున్నాడు. లాస్ట్ ఓవర్‌లో ఆరు బాల్స్‌లో 18 రన్స్ కొట్టాల్సి ఉండగా.. బౌలర్ ప్రఫుల్ హింజ్ అద్భుతంగా కట్టడి చేశాడు. ఈషాన్ మలింగా మూడు వికెట్లు పడగొట్టగా.. నితీష్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశాడు. శివాంగ్ కుమార్, సాకిబ్ హుస్సేన్, ప్రఫుల్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

READ MORE: Abhishek Sharma: వేగంలో సెహ్వాగ్‌నే మించిపోయాడు.. ఐపీఎల్‌లో అభిషేక్ శర్మ సరికొత్త చరిత్ర!

మరోవైపు.. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌ఆర్‌హెచ్ 194 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 15 బంతుల్లో సంచలనాత్మక అర్ధశతకం సాధించాడు. 6 ఫోర్లు, 4 సిక్సర్లులతో 59 పరుగులు పూర్తి చేశాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ 39 బంతుల్లో 59 పరుగులు చేసి అర్ధశతకం సాధించాడు. ట్రావిస్ హెడ్ (23), నితీష్ కుమార్ రెడ్డి(12), సలీల్ అరోరా (13), శివాంగ్ కుమార్ (12) రన్స్ చేశారు. జేమీ ఓవర్‌టన్, అన్షుల్ కంబోజ్ మూడు వికెట్లు పడగొట్టగా, ముఖేష్ చౌదరి రెండు వికెట్లు పడగొట్టాడు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

രാജ്യത്തെ സ്ത്രീകളോട് മാപ്പുചോദിക്കുന്നു; പ്രതിപക്ഷത്തിന് തക്കതായ ശിക്ഷ ലഭിക്കും; രാജ്യത്തെ അഭിസംബോധന ചെയ്ത് പ്രധാനമന്ത്രി

ന്യൂദൽഹി: മണ്ഡല പുനർനിർണയ, വനിതാ സംവരണ ബില്ലുകൾ പരാജയപെട്ടതിന് പിന്നാലെ രാജ്യത്തെ...

Delimitation: "மதுரை கோடை வெயிலில் வெள்ளைச் சட்டைக்கு மீண்டும் மாறியதில் மகிழ்ச்சி" – PTR

நேற்று நாடாளுமன்றத்தில் தொகுதி மறுவரையறை மசோதா தோல்வி அடைந்ததையொட்டி, தமிழ்நாடு தகவல்...

Yuzvendra Chahal: ‘క్యూట్’ మెసేజ్ వివాదం.. చాహల్ తానియా ఛటర్జీపై పరువు నష్టం దావా వేసిన చాహల్

భారత క్రికెట్ జట్టు లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ప్రస్తుతం పంజాబ్...

ಮಹಿಳಾ ಮೀಸಲಾತಿಗೆ ನಮ್ಮ ವಿರೋಧವಿಲ್ಲ: ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಬೆಂಗಳೂರು, ಏಪ್ರಿಲ್ ,18,2026 (www.justkannada.in): ಮಹಿಳಾ ಮೀಸಲಾತಿಗೆ ನಮ್ಮ ವಿರೋಧವಿಲ್ಲ...