16
April, 2026

A News 365Times Venture

16
Thursday
April, 2026

A News 365Times Venture

Saving Account: మీ బ్యాంక్ ఖాతాల్లో నిరంతరం డబ్బులు వేస్తున్నారా..? ఐటీ నోటీసులొస్తాయ్..

Date:

బ్యాంకులో ఎంత డబ్బు దాచుకుంటే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావు? మన సంపాదనలో కొంత భాగాన్ని భవిష్యత్తు అవసరాల కోసం బ్యాంకులో జమ చేయడం సహజం. అయితే, ఎంత మొత్తానికి మించి జమ చేస్తే ట్యాక్స్ కట్టాలి లేదా ప్రభుత్వానికి లెక్క చెప్పాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

పొదుపు ఖాతా, కరెంట్ ఖాతా..
సాధారణంగా ఒక ఆర్థిక సంవత్సరంలో మీ సేవింగ్స్ అకౌంట్‌లో రూ.10 లక్షల వరకు నగదు జమ చేసుకోవచ్చు. అంతకు మించి జమ చేస్తే.. బ్యాంకులు ఆ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు నివేదిస్తాయి. అదే మీరు వ్యాపారాల కోసం వాడే కరెంట్ అకౌంట్ అయితే.. ఈ పరిమితి రూ.50 లక్షల వరకు ఉంటుంది.

మీరు జమ చేసే డబ్బు రూ.10 లక్షల లోపే ఉన్నా, అది పన్ను పరిధిలోకి రాదని గ్యారెంటీ లేదు. ఒకవేళ మీ వార్షిక ఆదాయం తక్కువ ఉండి, అకౌంట్లో ఎక్కువ డబ్బు జమ అయితే అధికారులు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే అవకాశం ఉంటుంది. మీ దగ్గర సరైన ఆధారాలు ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

పాన్ కార్డు (PAN Card): ఒకే రోజులో రూ.50,000 లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేయాలంటే ఖచ్చితంగా పాన్ కార్డు వివరాలు ఇవ్వాలి. ఇది పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలను ట్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది.

వడ్డీపై పన్ను: మీ సేవింగ్స్ అకౌంట్లో ఉన్న డబ్బుపై వచ్చే వడ్డీ రూ.10,000 లోపు ఉంటే పన్ను మినహాయింపు ఉంటుంది. అంతకు మించి వచ్చే వడ్డీని మీ మొత్తం ఆదాయానికి కలిపి, మీ ట్యాక్స్ స్లాబ్ ప్రకారం పన్ను విధిస్తారు.

క్రెడిట్ కార్డ్ బిల్లులు: క్రెడిట్ కార్డ్ బిల్లును నగదు రూపంలో రూ.1 లక్ష కంటే ఎక్కువ చెల్లించినా అది ఆదాయపు పన్ను శాఖ దృష్టికి వెళ్తుంది.

Also Read:RCB Vs LSG: నిప్పులు చెరిగిన ఆర్సీబీ బౌలర్లు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన LSG..

పెద్ద మొత్తంలో నగదును బ్యాంకులో జమ చేయడం నేరం కాదు, కానీ ఆ డబ్బుకు సరైన లెక్క ఉండాలి. ఒకవేళ ఆ డబ్బు ఎలా వచ్చిందో మీరు నిరూపించలేకపోతే, దానిని ‘లెక్క చూపని ఆదాయం’గా పరిగణించి భారీగా జరిమానాలు వేసే అవకాశం ఉంది. కాబట్టి, సాధ్యమైనంత వరకు నగదు లావాదేవీల కంటే ఆన్‌లైన్ బదిలీలు (UPI, NEFT) లేదా చెక్కుల ద్వారా లావాదేవీలు చేయడం సురక్షితం. దీనివల్ల పారదర్శకత ఉంటుంది.. అనవసరమైన విచారణల నుంచి తప్పించుకోవచ్చు. మీరు పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన రశీదులు లేదా ఆధారాలను భద్రపరుచుకోవడం మంచిది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പ്ലൂട്ടോയെ വീണ്ടുമൊരു ഗ്രഹമാക്കണം, നാസയക്ക് കത്തയച്ച് പത്ത് വയസുകാരി; ഞങ്ങളത് പരിശോധിക്കുകയാണെന്ന മറുപടിയുമായി നാസ

  വാഷിങ്ടണ്‍: പ്ലൂട്ടോയെ വീണ്ടുമൊരു ഗ്രഹമാക്കാന്‍ നാസയ്ക്ക് കത്തയച്ച് പത്ത് വയസുകാരി...

மத்திய கிழக்கில் அமெரிக்க ராணுவ தளங்களை டார்கெட் செய்த ஈரான் படை; 'நண்பனாக' உதவிய சீன செயற்கைக்கோள்

அமெரிக்காவும், இஸ்ரேலும் தங்கள் மீது தாக்குதல் நடத்தியபோது, ஈரான் கொடுத்த பதிலடி...

Tirupati Crime: తిరుపతిలో దారుణం.. 40 ఏళ్లుగా 10 అంకణాల స్థల వివాదం.. గొంతుకోసి హత్య

Tirupati Crime: చిన్నపాటి స్థల వివాదం ఓ వ్యక్తి నిండు ప్రాణాలు...

ಇಲವಾಲದಲ್ಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ಥೀಮ್ ಪಾರ್ಕ್ ನಿರ್ಮಾಣ: ಸಚಿವ ಡಾ.ಹೆಚ್.ಸಿ.ಮಹದೇವಪ್ಪ

ಮೈಸೂರು, ಏಪ್ರಿಲ್,14,2026 (www.justkannada.in): ತಾಲ್ಲೂಕಿನ ಇಲವಾಲ ಹೋಬಳಿಯಲ್ಲಿ ಸಂವಿಧಾನ ಶಿಲ್ಪಿ...