22
September, 2026

A News 365Times Venture

22
Tuesday
September, 2026

A News 365Times Venture

Onion Rice Recipe: అమ్మల కష్టానికి ఫుల్ స్టాప్.. ఉదయాన్నే హడావిడి లేకుండా 10నిమిషాల్లో టేస్టీ, హెల్తీ లంచ్ బాక్స్ రెసిపీ..

Date:

Onion Rice Recipe: ప్రతిరోజూ ఉదయం పిల్లల లంచ్ బాక్స్ కోసం తల్లులు పడే కష్టాలు వర్ణనాతీతం. పోషకాహారం, రుచి, కొత్తదనం, సమయం, పిల్లల ఇష్టాయిష్టాలను బ్యాలెన్స్ చేయడం వారికి పెద్ద సవాలుగా మారుతుంది. రోజూ ఏం పెట్టాలి? అనే ఆలోచన, ఒకే రకమైన ఆహారం పెడితే పిల్లలు తినకపోవడం, బాక్స్ ఖాళీ చేయకపోవడం వంటివి తరచూ జరుగుతుంటాయి. పిల్లలను నిద్రలేపి, తయారీ చేసి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ సిద్ధం చేయడానికి టైమ్ సరిగ్గా సరిపోదు. అలాంటి వాళ్ల కోసం ఓ మంచి రెసిపీని తీసుకొచ్చాం. ఉదయాన్నే హడావిడిలేకుండా 10నిమిషాల్లో చేసుకొనే లంచ్ బాక్స్ రెసిపీల్లో ఉల్లిపాయ అన్నం (Onion Rice) ఒకటి. దీన్ని ఎంతో ఈజీగా, తక్కువ సమయంలో చేసుకోగలం. రుచి కూడా అద్భుతంగా ఉంటుంది. మీ పిల్లలు టిఫిన్ బాక్స్ ఖాళీ చేయడం పక్కా! ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

READ MORE: Supreme Court: మహాభారతం పోరాటంలాగా ఉంది.. విడాకులిస్తూ సుప్రీంకోర్టు అసహనం

కావలసిన పదార్థాలు:
అన్నం: ఒక పెద్ద కప్పు (ముందే వండినది)
ఉల్లిపాయలు: 2 పెద్దవి (పొడవుగా కోసిన ముక్కలు)
పచ్చిమిర్చి: 2-3
మసాలా దినుసులు: ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు
రుచికి సరిపడా: ఉప్పు, చిటికెడు పసుపు, కారం
నూనె లేదా నెయ్యి: సరిపడా

తయారీ విధానం:
పోపు పెట్టడం: ముందుగా బాణలిలో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఆపై కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు సన్నగా, పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి. ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అన్నానికి అంత మంచి రుచి వస్తుంది.ఉల్లిపాయలు వేగాక అందులో పసుపు, ఉప్పు, కారం వేసి కలపాలి. ఇప్పుడు ముందే వండి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసి, మసాలాలన్నీ అన్నానికి బాగా పట్టేలా మెల్లగా కలుపుకోవాలి. రెండు నిమిషాల పాటు తక్కువ మంట మీద వేడి చేసి, చివరగా కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి ఆనియన్ రైస్ సిద్ధం! ఈ ఉల్లిపాయ అన్నాన్ని చల్లని రైతా (పెరుగు పచ్చడి), అప్పడం లేదా ఆవకాయతో కలిపి తింటే అమృతంలా ఉంటుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

தாராபுரம்: திமுக நிர்வாகிகள் வீட்டில் ரூ.48 லட்சம் பறிமுதல்| தீவிர விசாரணையில் தேர்தல் பறக்கும் படை!

திருப்பூர் மாவட்டம் தாராபுரம் (தனி) தொகுதியில் அக்டோபர்- 6- ம் தேதி...

Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు

Telangana 22A Land List: తెలంగాణలో సంచలనంగా మారింది 22A.. రాష్ట్రంలో...

ദല്‍ഹി എസ്.ഐ.ആര്‍: വോട്ടര്‍മാര്‍ക്ക് നല്‍കിയ നോട്ടീസുകള്‍ യന്ത്രനിര്‍മിതമെന്ന് സുപ്രീം കോടതി

ന്യൂദല്‍ഹി: ദല്‍ഹിയിലെ വോട്ടര്‍ പട്ടിക പ്രത്യേക തീവ്രപരിഷ്‌കരണവുമായി (എസ്.ഐ.ആര്‍) ബന്ധപ്പെട്ട് വോട്ടര്‍മാര്‍ക്ക്...

ஜெம் வீரமணி வழக்கு: "திமுக-வும், தவெக-வும் வாதிட்டுக் கொண்டு காலந்தாழ்த்தாமல்..!"- வானதி சீனிவாசன்

"ஜெம் நிறுவனர் வீரமணி மீதான வழக்கில் திமுக-வும், ஆளுங்கட்சியான தவெக-வும் ஒருவருக்கொருவர்...