12
March, 2026

A News 365Times Venture

12
Thursday
March, 2026

A News 365Times Venture

American Airlines: జస్ట్ 30 సెకన్లు హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో ప్లే.. ఎయిర్‌లైన్స్ రూల్స్ బ్రేక్ చేసిన మహిళకు షాక్

Date:

అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో హెడ్‌ఫోన్స్ లేకుండా వీడియో ప్లే చేసిన మహిళను సిబ్బంది విమానం నుంచి దించేశారు. మయామి నుంచి టాంపా వెళ్లే అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్‌లో ఒక మహిళ హెడ్‌ఫోన్స్ ఉపయోగించకుండా తన ఫోన్‌లో వీడియోను లౌడ్‌గా ప్లే చేసింది. ఫ్లైట్ అటెండెంట్లు రెండుసార్లు హెడ్‌ఫోన్స్ ఉపయోగించమని లేదా వీడియో ఆపమని అడిగినా, ఆమె అందుకు సహకరించలేదు. వీడియో ప్లే చేసినందుకు సిబ్బంది ఆమెను హెచ్చరించిన తర్వాత కూడా ఆమె వాదనలు చేస్తూ, తిట్టడం మొదలుపెట్టింది. “నేను 30 సెకన్లు మాత్రమే 50% వాల్యూమ్‌లో వీడియో ప్లే చేశాను, అందుకే నన్ను దింపేస్తున్నారా?” అంటూ ఆమె అరిచింది. “పోలీసులను పిలవండి” అని కూడా ఆమె సవాలు విసిరింది.

Also Read:Telegram: యూజర్లకు అలర్ట్! టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు.. ఎందుకంటే?

ఆ తర్వాత పోలీసులు విమానంలోకి వచ్చి ఆమెను బలవంతంగా దింపేశారు. ఆమె బయటికి వెళ్తుంటే ఇతర ప్రయాణికులు చప్పట్లు కొట్టారు. కొందరు సాక్షులు ఆమె మద్యం సేవించినట్లు (డ్రంక్) చెప్పారు. ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా షేర్ అయింది. అమెరికన్ ఎయిర్‌లైన్స్‌లో అధికారికంగా హెడ్‌ఫోన్స్ తప్పనిసరి అనే రూల్ లేకపోయినా, ఇతర ప్రయాణికులకు ఇబ్బంది కలిగించకుండా ఉండాలనే నియమాలు ఉన్నాయి. ఇటీవల యునైటెడ్ ఎయిర్‌లైన్స్ వంటి ఇతర ఎయిర్‌లైన్స్ కూడా ఫోన్‌లో ఆడియో/వీడియోలకు హెడ్‌ఫోన్స్ తప్పనిసరి చేస్తున్నాయి. ఈ ఘటన ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణికుల ప్రవర్తనపై చర్చలకు దారితీసింది.


Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Off The Record: వాసుపల్లి వ్యవహారం వైసీపీ నాయకత్వానికి తలపోటైందా?

Off The Record: వాసుపల్లి గణేష్ కుమార్….విశాఖ దక్షిణ నియోజకవర్గ మాజీ...

ಜೋಡಿ ಕೊಲೆ:  ಅರೋಪಿಗೆ ಜೀವಾವಧಿ ಶಿಕ್ಷೆ, ದಂಡ ವಿಧಿಸಿದ ಮೈಸೂರು ಕೋರ್ಟ್

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in): ಜಮೀನಿನಲ್ಲಿ ವ್ಯವಸಾಯ ಮಾಡುವ ವಿಚಾರಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ತನ್ನ...

അമിത് ഷാ ചര്‍ച്ച ചെയ്യേണ്ടത് സ്പീക്കറുടെ ഭരണഘടനാവിരുദ്ധമായ പെരുമാറ്റം; രാഹുല്‍ ഗാന്ധിയെ കുറിച്ചല്ല: കെ.സി. വേണുഗോപാല്‍

ന്യൂദല്‍ഹി: ആഭ്യന്തരമന്ത്രി അമിത് ഷാക്കെതിരെ രൂക്ഷവിമര്‍ശനവുമായി എ.ഐ.സി.സി ജനറല്‍ സെക്രട്ടറി കെ.സി....

`4 தொகுதிகள்; 3-ல் உதயசூரியன் சின்னம்' – மதிமுக-வை சரிகட்டிய திமுக!

2026 சட்டமன்றத் தேர்தலுக்கான தொகுதி பங்கீட்டு பேச்சுவார்த்தை தி.மு.க கூட்டணிக்குள் வேகமெடுக்க...