11
March, 2026

A News 365Times Venture

11
Wednesday
March, 2026

A News 365Times Venture

AP News: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఉగాది కానుకలుగా అన్నదాత సుఖీభవ, గృహ ప్రవేశాలు!

Date:

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 6వ జిల్లా కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులు, వివిధ శాఖల ప్రధాన కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పరిపాలన సహా పలు కీలక అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. సమావేశాన్ని ప్రారంభిస్తూ సీఎం చంద్రబాబు మాట్లాడారు.

‘కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ముఖ్యమైన విషయాలపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది ఆరో కలెక్టర్ల సమావేశం. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండింటిపై సమాన దృష్టి పెట్టుతూ ప్రజలకు గుడ్ గవర్నెన్స్ అందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు దీర్ఘకాలిక ఫలితాలను ఇస్తాయి, అవి పాజిటివ్ లేదా నెగెటివ్‌గా ఉండవచ్చు. రాష్ట్ర పరిపాలనను మెరుగుపరచేందుకు ప్రభుత్వం రూపొందించిన 10 ముఖ్య సూత్రాల ఆధారంగా సుపరిపాలనపై అధికారులు దృష్టి పెట్టాలి. వర్చువల్, ఫిజికల్ వర్క్ రెండింటినీ సమన్వయంతో నిర్వహించాల్సిన అవసరం ఉంది. నేను, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు అన్ని అంశాలపై సమగ్రంగా పర్యవేక్షణ చేస్తున్నాము’ అని సీఎం చంద్రబాబు అన్నారు.

Also Read: Jasprit Bumrah Records: ‘వన్స్ ఇన్ ఏ జనరేషన్ బౌలర్’.. మరీ ఇన్ని అరుదైన రికార్డులా బుమ్రా?

‘ఇవాళ, రేపు అన్ని విభాగాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చ జరుగుతుంది. జిల్లా స్థాయిలో అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించాలి. నేను సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వను, ముఖ్య విషయాలపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడమే నా లక్ష్యం. సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాము. ఈ నెల 13వ తేదీన అన్నదాత సుఖీభవ పథకం నిధులు రైతుల ఖాతాల్లో జమ అవుతాయి. అలాగే ఉగాది పండుగ సందర్భంగా 2 లక్షల 50 వేల ఇళ్లకు గృహ ప్రవేశాలు నిర్వహింస్తాం. అన్నదాత సుఖీభవ, గృహ ప్రవేశాలు ఉగాది కానుకలుగా ప్రజలకు అందించనున్నాము’ అని సీఎం చంద్రబాబు చెప్పారు.

అదే విధంగా విద్యుత్ రంగంలో ట్రూ డౌన్ చార్జీలను విధించి విద్యుత్ చార్జీలను తగ్గించగలిగామని సీఎం చంద్రబాబు చెప్పారు. ఈ నిర్ణయం ద్వారా వినియోగదారులకు ప్రత్యక్ష లాభం కలిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని తెలిపారు. రాష్ట్రంలో సమర్థవంతమైన పరిపాలన కోసం అధికారులు సమన్వయంతో పనిచేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు సూచించారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

`எங்கள் குடும்பம் இப்படி ஆனதற்கு திமுக கைக்கூலிகளும் ஒரு காரணம்..!' – அன்புமணி ராமதாஸ்

தங்கள் குடும்பம் இப்படி ஆனதற்கு திமுக கைக்கூலிகளும் ஒரு காரணம் என்று...

Heatwave Warning: మే నెల వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు.. ఎల్ నినోపై ఐఎండీ వార్నింగ్

దేశ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి ప్రారంభం నుంచే...

LPG ಸಿಲಿಂಡರ್ ಪೂರೈಕೆಯಲ್ಲಿ ವ್ಯತ್ಯಯ: ರಾಜಕೀಯ ಹೊರತುಪಡಿಸಿ ಕೆಲಸ ಮಾಡಬೇಕಿದೆ- ಗೃಹ ಸಚಿವ ಪರಮೇಶ್ವರ್

ಬೆಂಗಳೂರು,ಮಾರ್ಚ್,11,2026 (www.justkannada.in):  ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ ಭಾರತದ ಮೇಲೂ ಪರಿಣಾಮ ಬೀರಿದ್ದು...

അയ്യങ്കാളി ചിത്രത്തിന് മുന്നില്‍ മാലിന്യ സംഭരണി സ്ഥാപിച്ച് തിരുവനന്തപുരം കോര്‍പ്പറേഷന്‍; നീക്കം ചെയ്ത് പി.കെ.എസ് പ്രവര്‍ത്തകര്‍

തിരുവനന്തപുരം: കേരളത്തിന്റെ നവോത്ഥാന നായകന്‍ അയ്യങ്കാളിയുടെ ചിത്രത്തെ അവഹേളിക്കുന്ന നടപടിയുമായി ബി.ജെ.പി...