15
May, 2026

A News 365Times Venture

15
Friday
May, 2026

A News 365Times Venture

T20 World Cup 2026: దూబే మెరుపులు.. నెదర్లాండ్స్‌పై టీమిండియా విజయం..

Date:

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్‌ 2026లో భారత్‌ విజయాల పరంపర కొనసాగుతోంది.. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 17 పరుగుల తేడాతో నెదర్లాండ్స్‌పై విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ వరుసగా నాలుగో గెలుపును నమోదు చేసి టోర్నీలో తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ సూర్య కుమార్‌ యాదవ్‌.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మధ్య ఓవర్లలో కాస్త ఒత్తిడి ఎదురైనా, శివం దూబే అద్భుతంగా ఆడి 31 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు బలమైన స్కోరు అందించాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. చివరి ఓవర్లలో హార్దిక్‌ పాండ్యా (30 పరుగులు, 21 బంతులు) తో కలిసి కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌ త్వరగా అవుట్ కావడంతో భారత్ 39/2కి చేరింది. ఆ తర్వాత తిలక్ వర్మ (31) మరియు సూర్యకుమార్ ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు.

Read Also: Vanasthalipuram Murder: హైదరాబాద్‌లో దారుణ హత్య.. గర్భిణి అని కూడా చూడకుండా రంపం, కత్తులతో మాజీ భర్త కిరాతకం!

నెదర్లాండ్స్ పోరాటం
194 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు ప్రారంభంలోనే ధైర్యంగా ఆడింది. మాక్స్ ఓ’డౌడ్ 35, మైఖేల్ లెవిట్ 51 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభం అందించారు. అయితే మధ్య ఓవర్లలో భారత బౌలర్లు చెలరేగడంతో బౌలింగ్ చేసి మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ముఖ్యంగా వరుణ్‌ చక్రవర్తి 3 ఓవర్లలో కేవలం 14 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశాడు. శివం దూబే 2 వికెట్లు, బుమ్రా ఒక వికెట్ సాధించారు. దీంతో నెదర్లాండ్స్ 176 పరుగులకే పరిమితమైంది. అయితే, ఈ విజయంతో టీమిండియా టోర్నీలో అజేయంగా కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో శివం దూబే, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శనతో మ్యాచ్ హీరోలుగా నిలిచారు. ఇక నెదర్లాండ్స్ ఈ టోర్నీలో తన ప్రయాణాన్ని ముగించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ഇതാണ് ഉത്തരവാദിത്തമുള്ള ഭരണം; എല്ലായിടത്തും കൂടി, എന്നാല്‍ ഇവിടെ അത്രയ്‌ക്കൊന്നുമില്ലല്ലോ; ഇന്ധനവിലവര്‍ധനവിനെ ന്യായീകരിച്ച് റിജിജു

ന്യൂദല്‍ഹി: രാജ്യത്ത് ഇന്ധനവില വര്‍ധിപ്പിച്ച കേന്ദ്ര സര്‍ക്കാര്‍ തീരുമാനത്തെ ന്യായീകരിച്ച് കേന്ദ്രമന്ത്രി...

த.வெ.க அரசின் அமைச்சரவை விரிவாக்கம் எப்போது? | பின்னணி தகவல்!

முதல்வர் விஜய் தலைமையிலான த.வெ.க அரசு பொறுப்பேற்று, இன்றுடன் ஆறு நாட்கள்...

Gujarat: జానపద గాయకుడిపై లక్షల్లో నోట్ల వర్షం.. వీడియో వైరల్

ప్రస్తుతం భారత్‌లోనూ.. అంతర్జాతీయంగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా...

ಸೇತುವೆ ಮೇಲಿಂದ ಉರುಳಿ ಬಿದ್ದ ಟ್ರ್ಯಾಕ್ಟರ್ ಒಂದೇ ಕುಟುಂಬದ 6 ಮಂದಿ ಸಾವು

ಕೊಪ್ಪಳ, ಮೇ,15,2026 (www.justkannada.in):  ಹಿಂದಿನಿಂದ ಟ್ಯಾಂಕರ್ ಡಿಕ್ಕಿಯಾದ ಪರಿಣಾಮ ಸೇತುವೆ...