18
February, 2026

A News 365Times Venture

18
Wednesday
February, 2026

A News 365Times Venture

Electric Two-Wheeler మార్కెట్‌లో సంచలనం.. అగ్రస్థానంకు టీవీఎస్.. పాతాళానికి ఓలా!

Date:

Electric Two-Wheeler: భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) విప్లవం కొత్త సంచనాలు సృష్టిస్తోంది. 2026 ప్రారంభంలోనే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు మార్కెట్‌ ను ఏలిన కొన్ని కంపెనీలు వెనకబడగా.. సంప్రదాయ వాహన తయారీదారులు ఎలక్ట్రిక్ విభాగంలో తమ పట్టును కొనసాగిస్తున్నారు. మరి ఏ కంపెనీ ఎంత అమ్మకు చేపట్టిందో చూసేద్దామా..

రేపే Xiaomi QLED TV X Pro లాంచ్.. AI ఫీచర్లు, భారీ స్క్రీన్‌తో కొత్త స్మార్ట్ టీవీ..

టీవీఎస్ మోటార్:
టీవీఎస్ కంపెనీ 2026 జనవరిలో 34,558 యూనిట్ల విక్రయాలతో మార్కెట్ లీడర్‌గా అవతరించింది. గతేడాది ఇదే నెలలో జరిగిన 24,028 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే, కంపెనీ ఏకంగా 43.8% వృద్ధిని నమోదు చేసింది. సుమారు 28.1% మార్కెట్ వాటాతో టీవీఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. కొత్త మోడళ్లు, మంచి సర్వీస్ నెట్‌వర్క్ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

బజాజ్ ఆటో:
చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్లతో బజాజ్ ఆటో తన దూకుడును కొనసాగిస్తోంది. జనవరిలో 25,598 యూనిట్లను విక్రయించిన బజాజ్, గతేడాది కంటే 19.2% వృద్ధిని సాధించి రెండో స్థానంలో నిలిచింది. పాత బ్రాండ్ మీద ఉన్న నమ్మకం, మెటల్ బాడీతో కూడిన ఉన్న స్కూటర్లు మధ్యతరగతి కుటుంబాలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం బజాజ్ మార్కెట్ వాటా 20.8% గా ఉంది.

PAK Playing XI vs NAM: నమీబియాతో మ్యాచ్‌.. పాకిస్థాన్ ప్లేయింగ్ ఎలెవన్‌పై హై డ్రామా!

ఏథర్ ఎనర్జీ:
ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీదారు ఏథర్ ఎనర్జీ మూడో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ 21,999 యూనిట్లను విక్రయించి, గతేడాది కంటే 67.9% భారీ వృద్ధిని కనబరిచింది. ఏథర్ తన ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేయడం, కొత్తగా విడుదలైన ‘రిజ్టా’ వంటి ఫ్యామిలీ స్కూటర్లు ఈ వృద్ధికి ఊతమిచ్చాయి. ఏథర్ తన మార్కెట్ వాటాను 17.9% కి పెంచుకుంది.

హీరో విడా :
ఎలక్ట్రిక్ విభాగంలో హీరో మోటోకార్ప్ ‘విడా’ (Vida) బ్రాండ్‌తో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది జనవరిలో 13,302 యూనిట్లను విక్రయించిన హీరో, గతేడాది కంటే 718% అసాధారణ వృద్ధిని నమోదు చేసింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న తన బలమైన డీలర్ నెట్‌వర్క్ ద్వారా హీరో విదా వేగంగా మార్కెట్ వాటాను (10.8%) దక్కించుకుంటోంది.

Amazon Logo Mehndi: అమెజాన్ లో చిగురించిన ప్రేమ.. పెళ్లిలో చేతిపై ఐకానిక్ స్మైల్ లోగోతో వధువు

ఓలా ఎలక్ట్రిక్:
ఒకప్పుడు మార్కెట్‌లో 40% వాటాతో అగ్రస్థానంలో ఉన్న ఓలా ఎలక్ట్రిక్ ఐదో స్థానానికి పడిపోవడం గమనార్హం. కేవలం 7,516 యూనిట్ల విక్రయాలతో సరిపెట్టుకున్న ఓలా.. గతేడాది కంటే 69.21% క్షీణతను మూటగట్టుకుంది. సర్వీస్ సంబంధిత సమస్యలు, కస్టమర్ల ఫిర్యాదులు, పెరుగుతున్న పోటీ కారణంగా ఓలా తన మార్కెట్ వాటాను కోల్పోతుంది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಪಿಸಿಒಡಿ ಸಮಸ್ಯೆ ಬಗ್ಗೆ ಎಚ್ಚರದಿಂದಿರಿ- ಡಾ. ತೇಜಸ್ವಿನಿ ಸಲಹೆ

ಮೈಸೂರು, ಫೆಬ್ರವರಿ, 17, 2026 (www.justkannada.in): ಹೆಣ್ಣುಮಕ್ಕಳಲ್ಲಿ ಕಾಣಿಸಿಕೊಳ್ಳುವ ಪಿಸಿಒಡಿ...

സ്വകാര്യ സ്ഥലത്ത് നിസ്‌കരിച്ചവരെ കസ്റ്റഡിയിലെടുത്തു: ബറേലി എസ്.പിക്ക് അലഹബാദ് ഹൈക്കോടതിയുടെ കോടതിയലക്ഷ്യ നോട്ടീസ്

ലഖ്‌നൗ: സ്വകാര്യസ്ഥലങ്ങളില്‍ പ്രാര്‍ത്ഥനായോഗങ്ങള്‍ സംഘടിപ്പിക്കുന്നതിന് അനുമതി ആവശ്യമില്ലെന്ന കോടതി ഉത്തരവ് ലംഘിച്ച...

"அந்த போன்கால் வரட்டும்!" – காத்திருக்கும் அறிவாலயம்

நேற்று பிப்.17-ம் தேதி, தமிழ்நாடு காங்கிரஸ் கமிட்டியின் மாவட்டத் தலைவர்கள் கூட்டம்...

Regina Cassandra : బాలీవుడ్ గుట్టు విప్పిన రెజీనా కసాండ్రా!

తెలుగు ప్రేక్షకులో రెజీనా కసాండ్రా అంటే ఒక స్పెషల్ ఇమేజ్ ఉంది....