17
February, 2026

A News 365Times Venture

17
Tuesday
February, 2026

A News 365Times Venture

AP Speaker Ayyanna Patrudu: స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు.. ఆ ఎమ్మెల్యేలను రీకాల్‌ చేయాలి..!

Date:

AP Speaker Ayyanna Patrudu: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీ లాబీలో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చిట్‌చాట్‌ చేశారు. అయితే, విధులు సక్రమంగా నిర్వర్తించని ఎమ్మెల్యేలను ప్రజలు రీకాల్‌ చేయాలంటూ పిలుపునిచ్చారు.. అసెంబ్లీకి హాజరుకావడం ఎమ్మెల్యేల విధి అని స్పష్టం చేశారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.. కొందరు సభ్యులు సభకు హాజరుకాకుండానే జీతాభత్యాలు తీసుకుంటున్నారని.. సభకు హాజరుకాని సభ్యులకు జీతం కట్‌ చేయాలి కదా? అని ప్రశ్నించారు.. ఈ అంశాలన్నీ జాతీయ స్థాయిలో చర్చ చేపట్టామని… ఈ నిబంధన దాదాపు 8 దేశాల్లో అమల్లో ఉందన్నారు. ఇక, అసెంబ్లీలో నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్‌ అటెండెన్స్‌ బాగా పని చేస్తోందన్నారు స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు.. కాగా, తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే ప్రధాన డిమాండ్‌తో అసెంబ్లీ సమావేశాలకు హాజరుకావడం లేదు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. మొక్కుబడిగా.. అసెంబ్లీ ప్రారంభమైన తొలిరోజు హాజరై.. ఆ తర్వాత సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.. మండలికి హాజరైన శాసన సభకు మాత్రం హాజరుకాకపోడంతో స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు పలు సందర్భాల్లో ఎమ్మెల్యేల హాజరు విషయంపై చంలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే..

Read Also: Pathum Nissanka Record: పాతుమ్ నిశాంక అరుదైన రికార్డు.. రెండో లంక బ్యాటర్‌గా..!

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

20 ವರ್ಷಗಳಲ್ಲಿ 500 ಹೆಲಿಕಾಪ್ಟರ್ ತಯಾರಿಕೆ- ಸಚಿವ ಎಂ.ಬಿ ಪಾಟೀಲ್

ಕೋಲಾರ,ಫೆಬ್ರವರಿ,17,2026 (www.justkannada.in): ಫ್ರಾನ್ಸ್ ಮೂಲದ ಏರ್ ಬಸ್ ಮತ್ತು ಭಾರತದ...

കോഴിക്കോട് ജയലക്ഷ്മി ടെക്സ്‌റ്റൈല്‍സില്‍ വന്‍തീപിടുത്തം; ആളുകളെ ഒഴിപ്പിച്ചു

കോഴിക്കോട്: കോഴിക്കോട് നഗരത്തിലെ റെയില്‍വേ സ്റ്റേഷനടുത്തുള്ള ജയലക്ഷ്മി ടെക്സ്റ്റൈല്‍സില്‍ വന്‍ തീപിടുത്തം....

கோவை: அடுத்தடுத்து 2 பிரமாண்ட மாநாடுகள்; பிளானுடன் களமிறங்கிய செந்தில் பாலாஜி

கோவை மாவட்டத்தில் உள்ள 10 தொகுதிகளை கைப்பற்ற திமுக, அதிமுக இடையே...

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనాలనుకుంటున్నారా.. మరికొన్ని రోజులు ఆగండి..

Maruti Suzuki Brezza: మారుతి సుజుకి బ్రెజ్జా కొనుగోలు చేయాలని ప్లాన్...