18
April, 2026

A News 365Times Venture

18
Saturday
April, 2026

A News 365Times Venture

Adi Saikumar : ఆగని చంద్రహాస్ యాటిట్యూడ్.. మధ్యలో హీరో ఆదికి ఏమైంది?

Date:

టాలీవుడ్ నటుడు ప్రభాకర్ కొడుకు చంద్రహాస్ ‘బరా బర్ ప్రేమిస్తా’ ఈవెంట్‌లో పాడిన అసభ్యకరమైన పాట ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. ఈ పాటపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతుంటే, చంద్రహాస్ మాత్రం అస్సలు తగ్గకుండా “నేను ఎవరికీ క్షమాపణలు చెప్పను” అంటూ ఎదురు దాడికి దిగి గొడవను మరింత పెద్దది చేశా‌డు. చివరకు ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి, ఆయనపై కేసు కూడా నమోదైంది. సోషల్ మీడియాలో తన‌ను విమర్శించిన వారికి వార్నింగ్ ఇస్తూ ఆయన చేసిన వీడియోలు చూసి జనం ఆశ్చర్యపోతున్నారు. ఇది చాలదన్నట్లు..ఈ వివాదంలో హీరో ఆది సాయికుమార్ రియాక్షన్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Also Read : Ramayana : యష్ వర్సెస్ విజయ్ సేతుపతి.. నితేష్ తివారీ రామాయణంలో అదిరిపోయే ట్విస్ట్!

ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వెళ్లిన యంగ్ హీరో ఆది సాయి కుమార్ ఈ రచ్చ పై ట్విట్టర్ (X) వేదికగా స్పందిస్తూ.. “ప్రభాకర్ గారు పిలిచారనే గౌరవంతో నేను ఆ కార్యక్రమానికి వెళ్లాను. కానీ అక్కడ జరిగిన సంఘటనలు చాలా దురదృష్టకరం. పబ్లిక్ ఈవెంట్లలో సందేశాలు ఇచ్చేటప్పుడు గౌరవం, బాధ్యత కలిగి ఉండాలి. ఎందుకంటే అలాంటి ప్రోగ్రామ్స్‌కు ఫ్యామిలీస్ కూడా వస్తుంటారు” అని గట్టిగానే హితవు పలికారు. అయితే, ఏమైందో ఏమో కానీ.. ఆ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే ఆది దానిని తన అకౌంట్ నుంచి డిలీట్ చేయడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ప్రభాకర్ తో ఉన్న వ్యక్తిగత సంబంధాల వల్ల లేదా సినిమా ఇండస్ట్రీ పెద్దల ఒత్తిడి వల్ల ఆది వెనక్కి తగ్గారా అనే చర్చ నడుస్తోంది. మొత్తానికి చంద్రహాస్ ప్రవర్తన వల్ల ఇటు తండ్రి ప్రభాకర్‌కు, అటు సపోర్ట్ చేసిన గెస్టులకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

വനിതാ സംവരണ ഭേദഗതി ബില്‍ ലോക്സഭയില്‍ പരാജയപ്പെട്ടു; എന്‍.ഡി.എ സര്‍ക്കാരിന് തിരിച്ചടി

ന്യൂദല്‍ഹി: വനിതാ സംവരണ നിയമത്തില്‍ ഭേദഗതി വരുത്തുന്നതിനുള്ള ഭരണഘടനാ ഭേദഗതി ബില്‍...

ஓட்டு கேட்க கிளம்பிய நடிகை, கேட்டை திறக்காத தலைவர்; கட்சியில் சேர்ந்ததும் நடிகருக்குக் கிடைத்த கார்

வரும் வியாழக்கிழமை நடக்கவிருக்கிறது தமிழக சட்டசபைத் தேர்தல். ஆளும் திமுக, காங்கிரஸ்...

Chia Seeds : మధుమేహానికి చెక్ పెట్టే చియా సీడ్స్.. షుగర్ లెవల్స్ తగ్గాలంటే ఇలా తిని చూడండి!

నేటి ఆధునిక కాలంలో జీవనశైలి వ్యాధుల్లో అత్యంత ప్రమాదకరమైనదిగా మారిన ‘మధుమేహం’...

ರೈತರಿಗೆ ಅಗತ್ಯವಿಲ್ಲದ ರಸಗೊಬ್ಬರ ಖರೀದಿಸುವಂತೆ ಒತ್ತಾಯಿಸಿದ್ರೆ ಕ್ರಮ- ಡಿಸಿ ಲಕ್ಷ್ಮಿಕಾಂತ ರೆಡ್ಡಿ ವಾರ್ನಿಂಗ್

ಮೈಸೂರು, ಏಪ್ರಿಲ್,17,2026 (www.justkannada.in(www.justkannada.in): ರಸಗೊಬ್ಬರ ಮಾರಾಟಗಾರರು ರೈತರು ಯುರಿಯಾ ಸೇರಿದಂತೆ ...