16
March, 2026

A News 365Times Venture

16
Monday
March, 2026

A News 365Times Venture

Pakistan: పాక్‌లో “ధురంధర్‌”ల హవా.. పహల్గాం ఉగ్రదాడి హ్యాండ్లర్ ఖతం..

Date:

Pakistan: పాకిస్తాన్‌లో గుర్తు తెలియని వ్యక్తులు హవా కొనసాగుతోంది. భారత వ్యతిరేకులు ఎక్కడ ఉన్న వెతికి వెంటాడి వేటాడి మట్టపెట్టుడుతున్నారు. అజ్ఞాత ‘‘ధురంధర్‌లు’’ పాకిస్తాన్‌లోని టెర్రరిస్టులు, భారత్‌కు వ్యతిరేఖంగా కుట్రలు పన్నుతున్న వ్యక్తులను లేపేస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా, 26 మందిని బలితీసుకున్న పహల్గాం ఉగ్రవాద దాడి హ్యాండ్లర్‌గా భావిస్తున్న పాకిస్తాన్ ఆర్మీ లెఫ్టినెంట్ కల్నర్ ఇమ్రాన్ దయాల్‌ను గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చడం సంచలనంగా మారింది. పాక్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ లో అతడి కారుపై కాల్పులు జరిపి, హతమార్చారు. అయితే, ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారనే వివరాలు ఐఎస్ఐ, పాక్ పోలీసులు, పాక్ సైన్యానికి అంతు చిక్కకపోవడం గమనార్హం. భారత్ మోస్ట్ వాంటెట్ ఉగ్రవాది, లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు ఇమ్రాన్ దయాల్ అత్యంత దగ్గరి వ్యక్తి.

Read Also: Rohit Shetty: ముంబయిలో కాల్పుల కలకలం.. స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి ఇంటిపై దుండగుల దాడి!

బుధవారం డేరా ఇస్మాయిల్ ఖాన్‌లో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయి. జిల్లాలోని షోర్ కోట్ ప్రాంతంలో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కాల్పులు జరిగాయి. పాక్ అధికారులు మాత్రం ఈ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇమ్రాన్ లక్ష్యంగా జరగలేదని, వ్యక్తిగత శత్రుత్వం, ప్రణాళికబద్ధమైన దాడితో సంబంధం లేదని అధికారులు తెలిపారు. రెండు సాయుధ గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో మరణించినట్లు అక్కడి మీడియా చెప్పుకుంటోంది. రెండు వర్గాల మధ్య జరుగుతున్న కాల్పుల్లో దయాల్ చిక్కుకున్నాడని చెబుతోంది. ఖైబర్ ఫఖ్తుంఖ్వా గవర్నర్ ఫైసల్ కరీం లెఫ్టినెంట్ కల్నల్ ఇమ్రాన్ బలిదానం విషాదకర సంఘటన అని చెప్పారు. ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించేందుకు పాక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

എ. പത്മകുമാറിനെ വെട്ടി; ആറന്മുള മണ്ഡലം എല്‍.ഡി.എഫ് കണ്‍വീനര്‍ സ്ഥാനം നഷ്ടപ്പെട്ടു

പത്തനംതിട്ട: ശബരിമല സ്വര്‍ണക്കൊള്ള കേസിലെ പ്രതിയും മുന്‍ എം.എല്‍.എയും സി.പി.ഐ.എം നേതാവുമായ...

Ustaad Bhagat Singh: ‘సినిమా లేట్ అవ్వడానికి కారణం నేనే’: డైరెక్టర్ హరీశ్ శంకర్..

పవన్ కళ్యాణ్ హీరోగా, మాస్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో ఎంతో...

ಎಲ್ ಪಿಜಿ ಸಿಲಿಂಡರ್ ಪೂರೈಕೆ ವ್ಯತ್ಯಯ: ಪ್ರಧಾನಿ ಮೋದಿಗೆ ಪತ್ರ ಬರೆದ ಹೋಟೆಲ್ ಮಾಲಕಿ

ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್, 14,2026 (www.justkannada.in): ಮಧ್ಯಪ್ರಾಚ್ಯದಲ್ಲಿ ಯುದ್ದ ಹಿನ್ನೆಲೆಯಲ್ಲಿ ಕರ್ನಾಟಕ...