25
April, 2026

A News 365Times Venture

25
Saturday
April, 2026

A News 365Times Venture

AA22xA6 : అల్లు అర్జున్ సినిమాలో మరొక స్టార్.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ అట్లీ

Date:

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో సినిమా వస్తున్నా సంగతి తెలిసిందే. బన్నీ కెరీర్ లో 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటి నుండే అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. కోలీవుడ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్స్ లో ఒకటైన సన్ పిచర్స్ అత్యంత భారీ బడ్జెట్ పై ఈ సినిమాను నిర్మిస్తోంది. దీపికా పాడుకొనే,  మృణాల్ ఠాకూర్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Also Read : Mega Star : విశ్వంభరపై అనుమానాలు.. వీడియో రిలీజ్ చేసిన మెగాస్టార్

2 ప్రపంచాలు, ఒక వర్తమాన ప్రపంచం మరియు మరొకటి అవతార్ లాంటి పౌరాణిక-చారిత్రక ప్రేరేపిత సమాంతర విశ్వం వంటి  విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాతో వరల్డ్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నాడు బన్నీ. అందుకే పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ హైప్ తో ఈ సినిమాను తీసుకువస్తున్నారు. కాగా ఇప్పుడు ఈ సినిమాకు మరొక స్టార్ వాల్యూ తోడైంది. అట్లీ డైరెక్ట్ చేసే ఈ చిత్రంలో ఒక పవర్ఫుల్ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని తీసుకున్నారు. ఇప్పటికే లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేశారట. విజయ్ సేతుపతిని చేసేది క్యామియో రోల్ అయినా కూడా ప్రాముఖ్యత ఉన్న రోల్ అని తెలుస్తోంది. విజయ్ సేతుపతి తాజగా ఈ సినిమా సెట్స్ లో జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతోంది. టోటల్ సినిమాను వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు కొనసాగుతుందని 2027   విడుదల చేసే అవకాశం ఉందని యూనిట్ వర్గాల సమాచారం.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

നിയുക്ത മുഖ്യമന്ത്രിക്ക് അഭിവാദ്യങ്ങള്‍; കണ്ണൂരില്‍ വി.ഡി. സതീശന് അഭിവാദ്യമര്‍പ്പിച്ച് ഫ്‌ളക്‌സ്

കണ്ണൂര്‍: കോണ്‍ഗ്രസില്‍ മുഖ്യമന്ത്രി ആരാകുമെന്ന തര്‍ക്കം മുറുകുന്നതിനിടെ കണ്ണൂര്‍ പഴയങ്ങാടി ബി.ബി....

Off The Record: నాగబాబు మంత్రి పదవి మీద ఆశలు వదులుకున్నట్టేనా..?

Off The Record: కొణిదెల నాగబాబు…. జనసేన ఎమ్మెల్సీ. ఆయనకు మంత్రి...

ನಾನೂ ಸೇರಿ AAP 7 ಸಂಸದರು ಬಿಜೆಪಿ ಸೇರ್ಪಡೆ: ರಾಘವ್ ಛಡ್ಡಾ ಘೋಷಣೆ

ನವವದೆಹಲಿ,ಏಪ್ರಿಲ್,24,2026 (www.justkannada.in): ರಾಜ್ಯಸಭಾ ಸಂಸದ ರಾಘವ್ ಛಡ್ಡಾ ಅವರು ಎಎಪಿ...