28
August, 2026

A News 365Times Venture

28
Friday
August, 2026

A News 365Times Venture

Karnataka: 13 ఏళ్ల బాలుడిపై 48 ఏళ్ల టీచర్ లైంగిక దాడి.. పోక్సో చట్టంపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు!

Date:

Karnataka: పిల్లలపై లైంగిక దాడుల నుంచి రక్షణ చట్టం (POCSO Act – 2012)పై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఈ చట్టం అబ్బాయిలకూ, అమ్మాయిలకూ సమానంగా వర్తిస్తుంది. లైంగిక దాడి కేసుల్లో లింగ భేదం ఉండదని స్పష్టం చేసింది. కాగా, ఒక కేసులో 13 ఏళ్ల పొరుగింటి బాలుడిపై 48 ఏళ్ల ఆర్ట్ టీచర్ పదే పదే లైంగిక దాడికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఆమె కోర్టును ఆశ్రయించగా, జస్టిస్ ఎం. నాగప్రసన్న ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు. ఈ సందర్భంగా చట్టం లింగాన్ని ఆధారంగా తీసుకోదు.. దాడి చేసినవారు పురుషుడు లేదా మహిళ అనే విషయం కాదు, పిల్లవాడిపై లైంగిక దాడి జరిగిందా అన్నదే ప్రధాన అంశమని స్పష్టం చేశారు.

Read Also: JR NTR : ఎన్టీఆర్ కు జరిగిందే మీకూ జరగొచ్చు.. సింగర్ మద్దతు..

ఇక, 2019లో జరిగిన సవరణల వల్లే పోక్సో చట్టం జెండర్-న్యూట్రల్ గా మారిందని కర్ణాటక హైకోర్టు చెప్పుకొచ్చింది. అలాగే, 2007లో ప్రభుత్వ అధ్యయనంలో లైంగిక వేధింపుల బాధితుల్లో 54.4 శాతం మంది అబ్బాయిలు కాగా, 45.6 శాతం మంది అమ్మాయిలు ఉన్నారని గుర్తు చేసింది. బాలుడి తరపు న్యాయవాది వాదిస్తూ.. పోక్సో చట్టం కూడా IPC లాగా కేవలం పురుషులను మాత్రమే నేరస్తులుగా పరిగణిస్తుందన్నారు. ఆ అడ్వకేట్ వ్యాఖ్యను న్యాయస్థానం తీవ్రంగా ఖండించింది. పోక్సో చట్టంలో లైంగిక దాడి జరిగిన వారికి న్యాయం చేయడమే ప్రధాన లక్ష్యం ఇందులో లింగ భేదం లేదన్నారు.

Read Also: Priyanka Gandhi : ఓటు చోరీపై నిజాలు బయటపెట్టండి

అయితే, చట్టంలోని కొన్ని సెక్షన్లలో ‘He’ అన్న పదం ఉపయోగించిన దానిని కేవలం పురుషుడిగా మాత్రమే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. మహిళలూ ఈ నేరాలకు పాల్పడే అవకాశం ఉందని కోర్టు తెలిపింది. అలాగే, మహిళలు లైంగిక చర్యలో పాసివ్ పాత్రలో మాత్రమే ఉంటారన్న వాదనను న్యాయస్థానం ఖండించింది. ఇలాంటి ఆలోచన చాలా పాతది.. ఆధునిక న్యాయవ్యవస్థ బాధితులకు జరిగిన అన్యాయమును గుర్తించి, తగిన న్యాయం చేసేలా చట్టాలు రూపొందించడబడ్డాయని కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యానించింది.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

പിടികിട്ടാപ്പുള്ളി സുകുമാര കുറിപ്പിനെ തപ്പി വീണ്ടുമിറങ്ങും: ബ്രൂണോയിലെ വയോധികനെ കണ്ടെത്താന്‍ ചെന്നിത്തലയുടെ നിര്‍ദേശം: അന്വേഷണം ക്രൈം ബ്രാഞ്ചിന്

തിരുവനന്തപുരം: പിടികിട്ടാപ്പുള്ളി സുകുമാര കുറുപ്പിന്റെ രൂപ സാദൃശ്യമുള്ള വയോധികനെ ബ്രൂണോയില്‍ കണ്ടെത്തിയതിന്...

"மேகதாது அணை தமிழகத்திற்கே உதவும்; உச்ச நீதிமன்றத் தீர்ப்பைக் காப்பாற்றுவேன்" – கர்நாடக முதல்வர்

கர்நாடகாவின் முதலமைச்சராக டி.கே.சிவகுமார் பதவியேற்ற பின், தமிழ்நாட்டிலும், கர்நாடகாவிலும் மேகதாது அணைப்...

OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్

OTR: యాందిసామీ…. దుడ్లెట్టా…! ఎవుడు పెట్టుకుంటాడు? ఉమ్మడి చిత్తూరు జిల్లా కూటమిలో...

ಬಿ.ನಾಗೇಂದ್ರ ಪಕ್ಷದ ಹಿತಕ್ಕಾಗಿ ಎಲ್ಲಾ ತ್ಯಾಗಕ್ಕೂ ಸಿದ್ದರಿದ್ದಾರೆ- ಸಿಎಂ ಡಿಕೆಶಿ

ನವದೆಹಲಿ,ಆಗಸ್ಟ್,27,2026 (www.justkannada.in):  ಸಚಿವ ಬಿ. ನಾಗೇಂದ್ರ ಪಕ್ಷದ ಹಿತಕ್ಕಾಗಿ ಎಲ್ಲಾ...