29
March, 2026

A News 365Times Venture

29
Sunday
March, 2026

A News 365Times Venture

AP Crime: కోట్లది రూపాయల మోసం.. వైసీపీ నేతపై పీడీ యాక్ట్, లుక్‌అవుట్‌ నోటీసులు జారీ

Date:

AP Crime: వివిధ వ్యాపారాల పేరుతో చాలా మందిని నుంచి అందినకాడికి అనే తరహాలో.. కోట్లాది రూపాయలు మోసాలు పాల్పడుతూ తప్పించుకుని తిరుగుతున్న కొత్తచెరువుకు చెందిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత దాల్ మిల్ సూరిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశారు పోలీసులు.. ఈ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న.. జిల్లాలో వివిధ వ్యాపారాల పేరుతో కోట్లాది రూపాయలు మోసాలకు పాల్పడ్డ దాల్ మిల్ సూరిపై 36 కేసులు నమోదయ్యాయి. కోట్ల రూపాయలకు పైగా మోసాలకు పాల్పడడమే కాకుండా ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలిందని.. సూరిపై కలెక్టర్ ఉత్తర్వుల మేరకు పీడీ యాక్ట్ కూడా నమోదు చేశామని వెల్లడించారు..

Read Also: Turaka Kishore: ఎట్టకేలకు జైలు నుంచి విడుదలైన తురకా కిషోర్‌..

ఇక, దాల్‌ మిల్‌ సూరిపై కొత్తచెరువు పోలీస్ స్టేషన్‌లో 20 కేసులు, నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో 16 కేసులు నమోదయ్యాయని తెలిపారు ఎస్పీ రత్న.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఎవరైనా బాధితులు ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చు అని సూచించారు.. మరోవైపు, దాల్‌మిల్‌ సూరి ఆచూకీ తెలపాలంటూ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో లుక్‌అవుట్‌ నోటీసులు జారీ చేస్తున్నాం అని వెల్లడించారు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న..

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್ ಆರೋಪ: ಸ್ಪಷ್ಟನೆ  ನೀಡಿದ ಸಚಿವ ಹೆಚ್.ಸಿ ಮಹದೇವಪ್ಪ

ಮೈಸೂರು,ಮಾರ್ಚ್,28,2026 (www.justkannada.in): ಸಾಂಸ್ಕೃತಿಕ ನಗರಿ ಮೈಸೂರಿನಲ್ಲಿ ಅವೈಜ್ಞಾನಿಕ ಟ್ರಾಫಿಕ್ ಸಿಗ್ನಲ್...

ബി.ജെ.പി സീല്‍ വിവാദം: ഡെപ്യൂട്ടി സി.ഇ.ഒ മിഷാല്‍ സാഗര്‍ ഭരതിനെ മാറ്റി

തിരുവനന്തപുരം: തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷന്‍ രാഷ്ട്രീയ പാര്‍ട്ടികള്‍ക്കയച്ച കത്തില്‍ ബി.ജെ.പിയുടെ സീല്‍ ഉള്‍പ്പെട്ട...

அண்ணாவுக்கு பிறகு… நெடுஞ்செழியனை முந்தி கருணாநிதி முதல்வராக, திமுக தலைவராக மாறிய கதை! ஆடுபுலி 11

திமுகவில் துரைமுருகன், கே.என்.நேரு, பொன்முடி, டி.ஆர்.பாலு, ஆ.ராசா, அதிமுகவில் திண்டுக்கல் சீனிவாசன்,...

Story Board : ఇరాన్ ఉచ్చులో ట్రంప్..! యుద్ధం మొదలుపెట్టి.. ఎగ్జిట్ దొరకక అమెరికా అయోమయం

ఎవరైనా యుద్ధానికి ముందు వ్యూహరచన చేస్తారు. యుద్ధం మొదలయ్యాక కూడా అవసరమైతే...