21
April, 2026

A News 365Times Venture

21
Tuesday
April, 2026

A News 365Times Venture

Zomato CEO Deepinder Goyal’s Shocking Post: ఆ నిర్ణయమే ఏకైక మార్గం అంటూ… జొమాటో సీఈఓ షాకింగ్ పోస్ట్..

Date:

Zomato CEO Deepinder Goyal’s Shocking Post: ఇటీవల భారత దిగుమతులపై అమెరికా 50శాతం టారిఫ్‌‌లు విధించిన సంగతి తెలిసిందే. ఈ సుంకాలతో భారతీయ వస్త్ర పరిశ్రమ, ఆక్వారంగం, తోలు ఉత్పత్తులపై వెంటనే ప్రభావం పడనుంది. ఈక్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్‌ నిర్ణయంపై భారతీయ వ్యాపార దిగ్గజాలు, సీఈఓలు సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు పెడుతున్నారు. తాజాగా జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్‌ వేదికగా షాకింగ్ పోస్ట్ చేశారు.

READ MORE: Gas Cylinder Blast: విశాఖలో భారీ పేలుడు.. ముగ్గురు మృతి..!

కీలక వ్యాఖ్యలు చేసిన దీపిందర్ గోయల్..
‘‘ఈ ప్రపంచంలో కాలం ఎప్పటికప్పుడు మన స్థానమేంటో గుర్తుచేస్తుంటుంది. ప్రస్తుతం టారిఫ్‌ల రూపంలో మనముందు ఓ బెడద ఉంది. ఇలాంటివి మనకు ఎన్ని ఎదురైనా..
మనపని మనం చేసుకుంటూ ముందుకు వెళ్లిపోవాలి. మన భవిష్యత్తును మన చేతుల్లోకి తీసుకోకపోతే.. ప్రపంచ శక్తులు మనల్ని బెదిరించాలని చూస్తూనే ఉంటాయి. ఇలాంటి సమయంలో ఆర్థికంగా, సాంకేతికంగా, రక్షణపరంగా మరీ ముఖ్యంగా మన ఆశయాల్లో సమష్టిగా సూపర్‌పవర్‌గా అవతరించాలని నిర్ణయించుకోవడమే అందుకు ఏకైక మార్గం’’ ఎక్స్‌ వేదికగా పోస్ట్ చేశారు. మిత్ర దేశం అంటూనే భారత్‌పై 50శాతం టారిఫ్‌‌లు విధించిన అగ్రరాజ్యంపై నెట్టిజన్లు మండిపడుతున్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని భారత్‌ స్పష్టం చేసింది.

READ MORE: Tariff Impact iphone Price: ట్రంప్ 50 శాతం టారిఫ్.. ఐఫోన్‌లు మరింత కాస్ల్టీగా మారుతాయా?.. భారత్ లో ప్రభావం ఎంత?

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

അപ്രതീക്ഷിത സ്ഫോടനം; ചികിത്സാ സഹായങ്ങൾ ലഭ്യമാക്കും; തൃശൂരിലെ സ്‌ഫോടനത്തിൽ പ്രതികരിച്ച് മുഖ്യമന്ത്രി

തൃശ്ശൂർ: തൃശൂരിലെ വെടിക്കെട്ട് പുരയിലുണ്ടായ സ്‌ഫോടനത്തിൽ പ്രതികരിച്ച് മുഖ്യമന്ത്രി പിണറായി വിജയൻ.പുറത്തുവരുന്ന...

தமிழ்நாட்டில் தொடங்கியது `அமைதி நேரம்’ – ஓய்ந்தது 2026 சட்டமன்றத் தேர்தல் பிரசாரம்!

தமிழ்நாட்டின் சட்டப்பேரவைத் தேர்தல் களம் இறுதிக்கட்டத்தை எட்டியுள்ளது. தமிழ்நாட்டின் தேர்தலில் இம்முறை...

Ganja: గంజాయి మాయలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. ఉద్యోగం వదిలి.. ఇంటిపైనే సాగు..

చెడు సావాసాలు ఎంతటి వ్యసనాలకు గురిచేస్తాయో, ఆ వ్యసనాలు ఉన్నతమైన భవిష్యత్తును...

ನಮ್ಮದು ಅಭಿವೃದ್ಧಿ ಪಥದ ಸರ್ಕಾರ: ಇಂದಿನ ಅಭಿವೃದ್ಧಿ ಕಾಮಗಾರಿಗಳೇ ಇದಕ್ಕೆ ಸಾಕ್ಷಿ -ಸಿಎಂ ಸಿದ್ದರಾಮಯ್ಯ

ಮೈಸೂರು ಏಪ್ರಿಲ್, 21,2026 (www.justkannada.in): ನಮ್ಮದು ಅಭಿವೃದ್ಧಿ ಪಥದಲ್ಲಿ ಮುನ್ನಡೆಯುತ್ತಿರುವ...