24
September, 2026

A News 365Times Venture

24
Thursday
September, 2026

A News 365Times Venture

Karnataka: ముస్లిం ప్రిన్సిపాల్‌ను తొలగించాలని స్కూల్ వాటర్ ట్యాంకులో విషం..

Date:

Karnataka: కర్ణాటక బెళగావిలో జిల్లాలో ఒక ప్రభుత్వ పాఠశాలలో ముస్లిం ప్రిన్సిపాల్‌ని తొలగించేందుకు కొందరు దారుణమైన పని చేశారు. పాఠశాలలోని నీటి ట్యాంక్‌లో విషం కలిపారు. జూలై 14న జరిగిన ఈ సంఘటనలో, శ్రీరామ్ సేన అనే మితవాద గ్రూపుతో అనుబంధం ఉన్న స్థానిక నాయకుడు సహా ముగ్గురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. హులికట్టిలోని ప్రభుత్వ లోయర్ ప్రైమరీ స్కూల్‌లో గత 13 సంవత్సరాలుగా సేవలందిస్తున్న ప్రధానోపాధ్యాయుడు సులేమాన్ గోరినాయక్ చుట్టూ భయాందోళనలు, అనుమానాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ చర్యతో అతని ప్రతిష్టను దెబ్బతీసి, బలవంతంగా బదిలీ చేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

పాఠశాల ట్యాంక్ నుండి నీరు తాగిన తర్వాత పన్నెండు మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విషం ప్రాణాంతకం కాకపోయినా, పాఠశాల అధికారులు, తల్లిదండ్రులలో ఆందోళన కలిగించాయి. పిల్లలకు వెంటనే చికిత్స అందించడంతో ప్రస్తుతం వారంతా కోలుకుంటున్నారు. విచారణలో ఐదో తరగతి పిల్లాడు నీటిలో విషం కలిపినట్లు గుర్తించారు. అయితే, పిల్లాడిని విచారించగా, నిందితులు వాటర్ బాటిల్ ఇచ్చి వాటర్ ట్యాంక్‌లో కలపాలని చెప్పినట్లు వెల్లడించాడు. ఆ బాటిల్ ఇచ్చిన వ్యక్తిని కృష్ణ మదార్‌గా గుర్తించారు.

Read Also: Fighter jets: భారత్‌కు 5వ తరం ఫైటర్ జెట్స్ ఎందుకు అవసరం.. అమెరికా F-35, రష్యా su-57లో ఏది బెటర్..

విచారణలో కృష్ణను వేరే నిందితులు బెదిరించినట్లు తేలింది. తన కులాంతర ప్రేమను బయటపెడతారని బెదిరించడంతో తాను ఈ పనిచేశానని, సాగర్ పాటిల్, నాగన గౌడ పాటిల్ తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని పోలీసులకు తెలిపాడు. ఒత్తిడికి గురైన కృష్ణ మదార్, పాఠశాల వాటర్ ట్యాంక్‌లో విషం కలపాలనే వారి డిమాండ్‌ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీరామ సేన తాలూకా స్థాయి అధ్యక్షుడు సాగర్ పాటిల్ ఈ ఘటన వెనక మాస్టర్ మైండ్‌గా గుర్తించారు. ప్రిన్సిపాల్‌గా ముస్లిం వ్యక్తి ఉన్నాడనే కోపంతోనే పాటిల్ ఈ పనిచేసినట్లు అంగీకరించాడని పోలీసులు విచారణలో తేలింది. ముగ్గురు నిందితులు – సాగర్ పాటిల్, నాగనగౌడ పాటిల్ మరియు కృష్ణ మదార్‌లను అరెస్ట్ చేశారు.

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ విషప్రయోగ ప్రయత్నాన్ని ఖండించారు. దీనిని “మతపరమైన ద్వేషం మరియు మౌలికవాదం ద్వారా నడిచే హేయమైన చర్య” అని అభివర్ణిస్తూ, ఈ నేరం మత సామరస్యానికి తీవ్ర ముప్పు కలిగిస్తుందని ఆయన అన్నారు.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

"எடப்பாடியுடன் கூட்டணி வைத்தால் துணை முதல்வர் பதவி என்றார் ஆதவ் அர்ஜுனா" – ரகசியம் பகிர்ந்த சீமான்

தாராபுரம் இடைத்தேர்தலில் நாம் தமிழர் கட்சி வேட்பாளராக களத்தில் உள்ள கார்த்திகாவை...

AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు

AP Severe Depression Landfall: తీవ్ర వాయుగుండం ఆంధ్రప్రదేశ్‌ తీరాన్ని తాకడం...

ഗ്യാനേഷ് കുമാറിനെ ജയിലിലടക്കണം; ബാലറ്റ് പേപ്പറുകള്‍ ഉപയോഗിച്ച് തെരഞ്ഞെടുപ്പുകള്‍ വീണ്ടും നടത്തണം: ഉദ്ധവ് താക്കറെ

ന്യൂദല്‍ഹി: മുഖ്യ തെരഞ്ഞെടുപ്പ് കമ്മീഷണര്‍ ഗ്യാനേഷ് കുമാറിനെതിരെ രൂക്ഷവിമര്‍ശനവുമായി ശിവസേന (യു.ബി.ടി)...

`தேர்தல் முடிவுகள் மீது கடும் சந்தேகங்களை எழுப்புகிறது; ஞானேஷ் குமார் பதவி விலக வேண்டும்!'- ஸ்டாலின்

வாக்காளர் சிறப்பு தீவிர திருத்தம் (SIR) மூலம் வாக்காளர் பட்டியலிலிருந்து சுமார்...